Naga Panchami October 11th: పంచమికి నాగదేవత హెచ్చరిక, వ్రతమే సమాధానం చెబుతుందంటున్న సుబ్బు!
Naga Panchami October 12th: నాగపంచమి ఎపిసోడ్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. గత నాలుగు రోజులుగా పంచమి సుబ్రహ్మణ్య స్వామి దీక్ష తీసుకోబోతున్నట్లు తరువాయి భాగంలో చూపిస్తున్నప్పటికీ.. ఇంకా కార్యం మాత్రం మొదలు కాలేదు. అయితే ఈ రోజుటి ఎపిసోడ్ లో మాత్రం కచ్చితంగా పంచమి దీక్ష తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంచమి చేయబోయే వ్రతాన్ని ఎలా చెడగొట్టాలా అని చిత్ర, జ్వాలలు ప్లాన్ లు వేసుకుంటున్నారు.
నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా చిత్రను చూపించారు. తనకు లేవని వినాయక విగ్రహాన్ని పంచమి ఎలా లేపిందని, ఆమెకు ఏమైనా శక్తులు ఉన్నాయోమేనని భయపడుతుంది. అదే సమయంలో జ్వాల వచ్చి చిత్రపై చేయి వేయగా.. ఆమె మరింత టెన్షన్ పడుతుంది. గట్టిగా అరుస్తుంది. దీంతో జ్వాల నవ్వుతూ.. ఎందుకు అంతలా భయపడుతున్నావంటూ ప్రశ్నిస్తుంది. అందుకు చిత్ర.. పంచమి అనుకున్నానని చెబుతుంది. పంచమి అంటే నీకెందుకు అంత భయం అని అడగ్గా.. తన మనసులోని అనుమానాలను జ్వాలకు వివరిస్తుంది.

ఇంట్లోని వారెవరూ లేపలేని విగ్రహాన్ని పంచమి ఒక్కతే ఎలా లేపింది.. ఆమెకు ఏమైనా శక్తులు ఉన్నాయోమో అనిపిస్తుందని చిత్ర, జ్వాలతో అంటుంది. అలాగే వినాయకుడి విగ్రహం ముందు పెట్టిన పండ్లు, స్వీట్లు మాయం చేసి మళ్లీ అందరూ వచ్చేలోపు అక్కడే ఉండేలా చేసిన సుబ్బును చూస్తుంటే కూడా తనకు అనుమానంగా ఉందని తెలుపుతుంది. అందుకు జ్వాల.. వారిద్దరూ కావాలనే మనల్ని ఆట పట్టిస్తున్నారని.. దానికే అంతలా భయపడాల్సిన అవసరం లేదని చెబుతుంది. కానీ మనసులో మాత్రం జ్వాల కూడా... పంచమికి ఏదైనా క్షుద్ర శక్తులతో సంబంధం ఉందా లేదా దైవ శక్తి సాయం చేస్తుందా అని అనుకుంటుంది.
ఇదంతా అయిపోయాకా.. పంచమి ఓ చోట కూర్చొని మోక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నాగ దేవత ప్రత్యక్షమై.. పంచమిని హెచ్చరిస్తుంది. నాగరాణివి అయ్యుండి.. ఇక్కడ భర్త, కుటుంబం కోసం నీవు చేస్తుంది ఏం బాగా లేదని చెబుతుంది. నీ మెడలో తాళి కంటే నీ తలపై ఉండే కిరీటమే నీకు ముఖ్యం అని నాగ లోకానిలి రావాలని అంటుంది. పంచమి మాత్రం తన భర్త, అత్తమామలు, పెంచిన తల్లిదండ్రులే ముఖ్యం అని చెప్పగా.. నీ తల్లి నాగలోకానికి చేసిన మేలు వల్లే నిన్ను ఏం చేయలేకపోతున్నామని.. లేదంటే పంచమిని ఏం చేసేందుకు అయినా తమకు ఎక్కువ సమయం పట్టదని వివరిస్తుంది.

పంచమి వద్దు తల్లీ.. నా సమస్యలు అన్నీ తొలగించి, నా భర్తను బాగు చేయమంటూ నాగ దేవతను వేడుకుంటుంది. కానీ నాగ దేవత మాత్రం సడెన్ గా మాయమైపోతుంది. ఆ తర్వాత పంచమి కన్నీరు పెట్టుకుంటుంటే.. సుబ్బు వస్తాడు. ఏమైందని అడగ్గా.. నేను చెప్పినా నీకు అర్థం కాదు సుబ్బు అంటుంది. కానీ చెప్పమనగా... తన కథనంతా చెప్పుకొస్తుంది. తాను వేరే లోకానికి వెళ్లిపోవడం మంచిదా, పెంచిన వాళ్లు, భర్తతో ఉండడం కరెక్టా అని అడగ్గా... సుబ్బు సమాధానం చెప్పలేకపోతాడు. నీవు చేయాలనుకున్న వ్రతం చేస్తే అన్నింటికీ సమాధానం దొరుకుతుందని అంటాడు. ఆ తర్వాత శివయ్యదే తప్పు అంటూ శివుడితో మాట్లాడతాడు.
ఆ తర్వాత మోక్ష నిద్రలోంచి లేచి చూసే సరికి పంచమి కనిపించదు. దీంతో కిందకు వచ్చి నానా హంగామా చేస్తాడు. కుటుంబ సభ్యులంతా తాము ఉన్నామని చెబితే.. అసలు మీరు ఎవరంతా అని అడుగుతాడు. దీంతో చిత్ర, జ్వాలలు ఫైర్ అవుతారు. పిచ్చొడంటూ కామెంట్లు చేస్తారు. కానీ మోక్ష మాత్రం పంచమి కావాలంటూ పూలకుండీ ఎత్తేయబోతుంటే.. శిశిర వచ్చి ఆపుతుంది. బాబాయ్.. పంచమి పిన్నికి నువ్వంటే ఇష్టం, నిన్ను వదిలి ఎక్కడకూ వెళ్లదని చెబుతుంది. దీంతో కూల్ అయిన మోక్ష పంచమి కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఇక ఈరోజుటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే రాత్రి వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











