Naga Panchami October 13th: దీక్ష తీసుకున్న పంచమి, నాగలోకానికి తీసుకొస్తానంటున్న నాగదేవత - వ్రతభంగం కానుందా?

Naga Panchami October 13th: ఈరోజుటి నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది. అదిరిపోయే ట్విస్టులతో.. పంచమి సుబ్రహ్మణ్య స్వామి దీక్ష తీసుకోవడం చూస్తుంటే చాలా ఆసక్తి కరంగా అనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో పంచమి దీక్ష తీసుకోవడంతో సీరియల్ ప్రారంభం అవుతుంది. పంచమి దీక్ష తీసుకుంటుండగా.. అయ్యగారు స్వామి దీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద్దని.. వ్రతభంగం చేస్తే స్వామి వారి అనుగ్రహం ఆగ్రహంగా మారుతుందని వివరిస్తారు. ఎలాగైనా తాను ఈ వ్రతం పూర్తి చేస్తాననే నమ్మకంతో పంచమి దీక్ష తీసుకోబోతుంది.

అయితే పంచమి పక్కనే కూర్చున్న సుబ్బు.. పంతులుగారిని ఆపి మరీ పంచమికి కొన్ని విషయాలు చెబుతాడు. పంతులుగారు చెప్పినట్లు ఎలాంటి కష్టాలు వచ్చినా, సమస్యలు ఎదురైనా వ్రతం ఆపకూడదని వివరిస్తాడు. నీవు కచ్చితంగా చేయగలను అనుకుంటేనే దీక్ష తీసుకొమ్మని అంటాడు. నీ ఇంట్లో వాళ్ల సహకారం లేకుండా నీవు ఇది చేయలేవని అంటాడు. కానీ పంచమి మాత్రం తాను కచ్చితంగా ఈ వ్రతం చేసి తీరుతానని అంటుంది. దీంతో పంతులుగారు పంచమికి దీక్షమాల వేస్తారు. ఆ తర్వాత పంచమి స్వామి వారికి హారతి ఇస్తుంది. ఈక్రమంలోనే ఆ హారతి సుబ్బు చుట్టూ తిరుగుతున్నట్లుగా చూపిస్తారు.

Naga Devatha Warning to Panchami on October 13th 2023 Episode number 173 in Naga Panchami Telugu Serial

ఇక ఆ తర్వాత చిత్ర, జ్వాలలను చూపిస్తారు. అందులో వారిద్దరూ పంచమి రాత్రికి రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఇక రాదని తెగ సంబర పడిపోతూ ఉంటారు. ఒకవేళ వచ్చినా ఇంట్లోంచి వెళ్లగొట్టాలని ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత శిశిర, మోక్షలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండడం కనిపిస్తుంది. ఈక్రమంలోనే శిశిర.. బాబాయ్ అన్నం తిను అంటూ భోజనం పెడుతుంది. కానీ మోక్ష.. పంచమి వస్తేనే తింటానని మారాం చేస్తాడు. అయితే నువ్వు అన్నం తినకపోతే పంచమి పిన్ని బాధ పడుతుందని.. కాబట్టి తినాలని చెబుతుంది. దీంతో మోక్ష చప్పుడు చేయకుండా తింటాడు.

ఈక్రమంలోనే సుబ్బు, పంచమిలు ఇంటికి వస్తారు. వారిని చూసిన మోక్ష పంచమి వద్దకు పరిగెత్తుకెళ్తాడు. పంచమి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లిపోయావు అంటూ మోక్ష అడగ్గా.. గుడికి వెళ్లాను స్వామీ అని చెబుతుంది. స్వామి అనే మాట వినగానే ఏంటి పంచమి కొత్తగా మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తున్నాడు. స్వామి వారు దీక్ష తీసుకున్నట్లు చెబుతుంది. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా వచ్చి.. ఇప్పటి వరకు ఎక్కడకు వెళ్లావని ప్రశ్నిస్తారు. దీంతో గుడికి వెళ్లానని అంటుంది. కానీ చెప్పకుండా ఎందుకు వెళ్లావని అంతా ఫైర్ అవుతారు.

Naga Devatha Warning to Panchami on October 13th 2023 Episode number 173 in Naga Panchami Telugu Serial

బ్రహ్మమహూర్తంలో లేచి తలస్నానం చూసి గుడికి వెళ్లానని.. అంత పొద్దున చెప్పడం ఎందుకు అని చెప్పకుండా వెళ్లినట్లు పంచమి వివరిస్తుంది. కానీ ఇంట్లోని వాళ్లంతా కోప్పడతారు. ఇంట్లోంచి వెళ్లిపోమని అంటారు. పంచమి మాత్రం మోక్ష బాబు బాగు కోసం వ్రతం చేస్తున్నానని.. అప్పటి వరకు వెళ్లనని అంటుంది. వారంతా అందుకు ఒప్పుకోమని చెప్పగా.. అయితే నేను కూడా ఓ నిర్ణయం తీసుకోక తప్పదని అంటుంది. ఇక ఇంతటితో నిన్నటి ఎపిసోడ్ పూర్తి కాగా... ఈరోజుటి ఎపిసోడ్ లో అంతా పంచమి వ్రతం చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఆ తర్వాత స్వామి వారి పాలకావిడిని గుడి వరకూ తీసుకెళ్లాలని.. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటిని దింపకూడదని పంతులుగారు పంచమికి సూచిస్తారు. ఈక్రమంలోనే పంచమి పాలకావిడి ఎత్తుకొని గుడికి బయలు దేరుతుంది. సుబ్బు కూడా పంచమి వెంటే ఉంటాడు. అయితే వారి వెంట మోక్ష వెళ్తానని మారాం చేయగా.. ఇంట్లోని వాళ్లంతా ఆపుతారు. ఆ తర్వాత మోక్ష వాళ్లను వదిలించుకొని పంచమి కోసం పరిగెట్టగా మెట్లపైన పడిపోతాడు. దీంతో పంచమి కంగారు పడి వెనక్కి తిరిగి చూస్తుంది. మరి మోక్షను లేపేందుకు వెళ్లి వ్రతభంగం చేస్తుందా లేదా తెలియాలంటే ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X