Naga Manikanta : నిఖిల్‌ మోస్ట్ డేంజరస్ .. ఆ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో, షాకింగ్ న్యూస్ చెప్పిన మణికంఠ

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా ఏడు వారాలు కంప్లీట్ చేసుకుని 8వ వారంలోకి అడుగుపెట్టింది. 14 మందితో మొదలైన ఈ సీజన్‌లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యారు. ఏడో వారం అనూహ్యంగా మణికంఠ తనకు తాను ఎలిమినేట్ అవుతానని ప్రకటించడంతో ప్రేక్షకులు షాకయ్యారు. నాగార్జున ఒకటికి పదిసార్లు ఆలోచించుకోమని చెప్పినా సరే నా వల్ల కాదని దండం పెట్టేసి తనను ఎలిమినేట్ చేసేయమని వాపోయాడు. అలా ఎందుకు చేశాడు, హౌస్‌ నుంచి ఎలిమినేట్ అవ్వాలని షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో అర్జున్ అంబటికి ఇచ్చిన బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో చెప్పాడు మణికంఠ. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 8 ఏడో వారంలో నామినేషన్స్‌లో నిలిచిన 9 మందిలో మణికంఠ ఒకరు. ఆదివారం ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు హోస్ట్ నాగార్జున . చివరికి వచ్చేసరికి మణికంఠ, గౌతమ్ నిలిచారు. బిగ్‌బాస్ నిర్ణయాని కంటే ముందే మణికంఠ తననే ఎలిమినేట్ చేసేయాలని, తన వల్ల కావడం లేదని నవ్వినా పెయిన్ వస్తుందని తన ఆరోగ్య పరిస్ధితిని వివరించాడు. టెస్టుల్లో ఏం రాలేదని నాగ్ ప్రశ్నించగా.. ఏదోలా నెట్టుకొస్తున్నానని , కానీ ఇక తన వల్ల కాదని చేతులెత్తేశాడు.

Naga Manikanta Bigg Boss Buzzz Interview with arjun Ambati after elimination from bigg boss telugu 8

ఒకటికి రెండు సార్లు నాగార్జున అవకాశం ఇచ్చినా.. ప్లీజ్ సర్ అర్ధం చేసుకోండి అని సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో చేసేది లేక మణికంఠ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. తర్వాత ఓటింగ్ రిజల్ట్స్‌ని నాగ్ స్క్రీన్‌పై వేసి చూపించగా.. లీస్ట్ ఓటింగ్‌తో గౌతమ్ ఈ వీక్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. అది చూసి ఆడియన్స్, కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. మనోడు ఏంటీ ఇలా చేశాడని చర్చించుకుంటున్నారు.

బిగ్‌బాస్ లాంచింగ్ సెర్మనీ నాడు తను జీవితంలో కోల్పోయినవన్నీ సాధించడానికి భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడని మణికంఠ చెప్పాడు. హౌస్‌లో కూడా ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎలిమినేట్ కాకూడదన్న కసితో ఆడాడు. తొలి రోజు నుంచే సెంటిమెంట్ కార్డ్ వాడటంతో ప్రేక్షకులు కరిగిపోయి.. మణికంఠ ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా టాప్ ఓటింగ్ కట్టబెట్టారు. ఈసారి కూడా టాప్‌ 3లో నిలబెట్టారు. కానీ అతను మాత్రం నా వల్ల కాదు బాబాయ్.. ఇకపై తనకు ఓట్లు వేయొద్దని రిక్వెస్ట్ చేశాడు.

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక అర్జున్ అంబటికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మణికంఠ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు స్టార్ మా ప్రోమోను రిలీజ్ చేసింది. బిగ్‌బాస్‌లో విన్నర్ కావాలని వచ్చిన మీరు చీఫ్ కూడా అవ్వకుండా ఎందుకు బయటికొచ్చేశారని అర్జున్ అడుగుతాడు. అయితే విన్నర్ అవ్వాలని తాను రాలేదని చెప్పడంతో అర్జున్ షాక్ అవుతాడు. అనంతరం మణికంఠ చేసినట్లుగా నా పెళ్లాం, బిడ్డలు నాకు కావాలని అనుకరించి చూపిస్తాడు అర్జున్.

ఫస్ట్ వీక్‌లో చెప్పిన ఫ్యామిలీ ఎమోషన్స్ తర్వాత కనిపించలేదని, నువ్వు గోరంత దానిని కొండంత చేస్తావని ప్రశ్నిస్తాడు. అసలు నువ్వు హౌస్‌లో రామువో, అపరిచితుడువో, రెమోవో ఎవరికీ అర్ధం కావడం లేదని మణికంఠపై సెటైర్లు వేస్తాడు. తానెవరికి వెన్నుపోటు పొడవలేదని.. నిఖిల్‌కి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మణికంఠ కామెంట్ చేశాడు. పృథ్వీకి విష్ణుకి ఏముందని అర్జున్ అడగ్గా.. చిగురిస్తూ , మొలకలేస్తూ, అలా పువ్వులు పూలకరిస్తూ అలా అలా ఉందని అంటాడు. వన్ సైడా టూ సైడా అంటే టూ సైడేనని మణికంఠ షాకింగ్ న్యూస్ చెప్పాడు. మరి మణికంఠ చెప్పిన మరిన్ని సంగతులు తెలుసుకోవాలంటే ఫుల్ ఇంటర్వ్యూ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X