BIGG BOSS TELUGU 8 : రెండేళ్లకే తండ్రి మరణం, క్యాన్సర్‌తో తల్లి కూడా, భార్య విడాకులు .. హౌస్‌లో ఆఖరి పోరాటమంటూ

బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌‌గా లాంఛ్ అయ్యింది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా హౌస్‌లోకి వస్తూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున వారిని పలకరిస్తూ ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు. ఈసారి హౌస్‌లోకి ఒంటరిగా వెళ్లరని ఓ బడ్డీతోనే లోపలికి వెళ్తారంటూ జంటగా పంపుతున్నారు నాగ్. అందరూ నవ్వుకుంటూ సరదాగా జోకులేస్తూ హౌస్‌లోకి వెళ్లారు కానీ నాగ మణికంఠ మాత్రం అందరినీ ఏడిపించేశాడు.

కిరాక్ సీతను బడ్డీని సెలెక్ట్ చేసుకోమని చెప్పిన నాగార్జున ఆమెకు మూడు కలర్స్ చూపిస్తాడు. అందరిలాగే ఆమె కూడా యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంది. ఆ వెంటనే బోర్డుపై సెన్సిటివ్, అన్‌ప్రెడిక్ట్‌బుల్, హైపర్ అనే క్వాలిటీస్ వస్తాయి. దీంతో కిర్రాక్ సీత రాబోయే వ్యక్తి తనకు క్వైట్ అపోజిట్ అంటుంది. టీవీలో ఏవీ చూపించగా నాగ మణికంఠ ప్రత్యక్షమవుతాడు. సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ అంటూ చాలా చిన్న ప్రపంచం నుంచి వచ్చానని అతను ఇంట్రడక్షన్ ఇస్తాడు.

naga manikanta emotional story revealed by akkineni nagarjuna at BIGG BOSS TELUGU 8 Grand Launch

పుట్టిన రెండేళ్లకే నాన్న చనిపోయారని, మా అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుందని.. తనకు ఊహా తెలిసేసరికి అతను తన అసలు తండ్రి కాదని తెలిసి తట్టుకోలేకపోయానని మణికంఠ చెప్పాడు. ఇంట్లో ఉన్న కొట్లాటలు చాలవన్నట్లు తన తల్లికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందని .. ఆమెను బతికించుకోవడానికి చాలా ట్రై చేశానని, చివరికి 2019లో అమ్మ తనను వదిలి వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. తల్లికి తలకొరివి పెట్టి 11 రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటికి వచ్చేశానని తెలిపాడు.

దేవుడు ఒకటి తీసుకుంటే రెండు ఇస్తాడన్నట్లుగా ఐపీసీసీ క్లియర్ చేశానని.. జాబ్ వచ్చిందని, కానీ పంచుకోవడానికి ఇంట్లో మనుషులు లేరని ఫీలింగ్ అని ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయేటప్పుడు అమ్మ ఓ మాట చెప్పిందని.. మళ్లీ నా కడుపున పుడతానని చెప్పిందని మణికంఠ అన్నాడు. దీంతో తాను ఓ తోడు కావాలనుకుని పెళ్లి చేసుకుని యూఎస్‌కు వెళ్లిపోయానని చెప్పాడు. తన ప్రియ గర్భం దాల్చి 9 నెలలు గడిచాక పాపను చేతుల్లో పెట్టిందని సంతోషం వ్యక్తం చేశాడు.

తన బిడ్డ కోసం కష్టపడాలనుకుంటున్న టైంలో తన భార్య తనకు విడాకులు ఇవ్వడంతో ఇండియాకు వచ్చేశానని నాగ మణికంఠ చెప్పాడు. లైఫ్‌తో గ్యాంబిల్ ఆడి వచ్చానని, ఈ గ్యాంబిల్ ఆడటం తనకు కొత్తేమీ కాదని ధీమాగా చెప్పాడు. నీ కథ బయోపిక్ తీస్తే ఏం పేరు పెడతావని నాగార్జున అడగ్గా.. ఆఖరి పోరాటమని ఆన్సర్ ఇస్తాడు మణికంఠ. బిగ్‌బాస్ ద్వారా నేను కోల్పోయిన రెస్పెక్ట్‌ని మళ్లీ సాధించుకుంటానని పేర్కొన్నాడు. లైఫ్ మళ్లీ నాకు తిరిగి అవకాశం ఇస్తే తన తల్లిని మళ్లీ బతికించుకుంటానని, పెళ్లి కోసం ఇంకా వెయిట్ చేస్తానని మణికంఠ అంటాడు.

అనంతరం కిర్రాక్ సీతను పిలిచి మీరిద్దరూ జంటగా హౌస్‌లోకి వెళ్తారని చెబుతారు నాగార్జున. వెళ్లే ముందు మణికంఠ కోసం ఓ కానుక అని చెప్పి.. ఓ ఎరుపు రంగు శాలువా ఇస్తాడు. ఇది మణికంఠ వాళ్ల అమ్మగారిదని అంటాడు. వాళ్లమ్మ గారిని తోడు తీసుకుని హౌస్‌లోకి వెళ్తాడని చెప్పగా.. ఆ స్వెట్టర్ చూసి మణికంఠ ఎమోషనల్ అవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి హౌస్‌లో అడుగుపెడతారు. కంటెస్టెంట్స్ అందరిలోకి మణికంఠ ఎంట్రీ ఆడియన్స్‌ని కంటతడి పెట్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X