నవ్వుతారు బిగ్‌బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్, లైవ్‌లో దొరికేసిన మణికంఠ

బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో .. బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా నాలుగో వారంలోకి ప్రవేశించింది. 14 మందితో ప్రారంభమైన ఈ సీజన్‌లో ప్రస్తుతం 11 మంది మిగిలారు. బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్‌లు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం కూడా మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్‌ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. షో ప్రారంభానికి ముందే ఈ సీజన్ కొత్తగా ఉంటుందని నిర్వాహకులు ముందే హింట్ ఇచ్చారు. చెప్పినట్లుగానే భారీ ట్విస్ట్ ఇచ్చారు బిగ్‌బాస్. ఏకంగా 12 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే..

అభయ్ నవీన్‌ని ఇన్సిడెంట్‌తో ఇంటి సభ్యులంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతున్నారు. గత వారం నాగార్జున పీకిన క్లాస్‌తో కంటెస్టెంట్స్‌కి మత్తు వదిలి ఇప్పుడిప్పుడే గేమ్‌ని రక్తి కట్టిస్తున్నారు. ఇంతో మన బిగ్‌బాస్ దత్తపుత్రిక యష్మీ గౌడ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. నామినేషన్స్ వంకతో సోనియాని ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపారేసింది. మదర్ అంటావ్, సిస్టర్ అంటావ్.. క్లోజ్‌గా ఉంటావ్.. ఇంతకీ ఆ ఇద్దరితో నీ రిలేషన్ పేరు ఏంటి అని యష్మీ నిలదీస్తుంది. ఆమె పెట్టిన పెంట ఇప్పటికీ నడుస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ దొరుకుతోంది.

naga manikanta made sensational comments on 12 wild card entries into bigg boss telugu 8

ఇలాంటి దశలో బిగ్‌బాస్ పెద్ద బాంబు పేల్చి కంటెస్టెంట్స్‌ని భయపెట్టాడు. ఇప్పటి వరకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇచ్చాం.. వాటన్నింటి కంటే పెద్దది ఈసారి ఇవ్వబోతున్నామని .. ఇది బిగ్‌బాస్ హిస్టరీలోనే పెద్దదని చెప్పాడు. ఈసారి ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని , రెండు వారాల్లో మొత్తం ప్రాసెస్ ముగుస్తుందని బిగ్‌బాస్ అనౌన్స్ చేస్తాడు. ఈ మాటలతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. సరిగ్గా గేమ్ ట్రాక్‌లో పడిన దశలో బిగ్‌బాస్ మాటలతో ఇంటి సభ్యులు సైకలాజికల్‌గా డిజప్పాయింట్ అవుతున్నారు.

ఆ 12 మంది ఎవరు, వాళ్లు మా కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే వారిని ఎలా ఎదుర్కోవాలి, అసలు పరిస్ధితిని ఊహించుకోవడమే కష్టంగా ఉందని కొందరి ఇన్నర్ ఫీలింగ్ . బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ గురించి చెప్పగానే ఏదో గోల చేశారు గానీ.. వచ్చేవాళ్లు తమకు ఎక్కడ పోటీ ఇస్తారోనని ఇంటి సభ్యులు భయపడుతున్నారు. నాగ మణికంఠ అయితే ఈ విషయం చెప్పినప్పటి నుంచి వణికిపోతున్నాడు. నిద్రలోనూ మనోడిని ఈ విషయం భయపెడుతోంది.

బెడ్ పై పడుకుని ఈ 10 మెంబర్స్‌తోనే నా బుర్ర హీటెక్కిపోతుందని.. దీపావళి ఫైర్ క్రాకర్‌లో ఒక్కొక్కరు పేలుతున్నారని అంటాడు. కొత్తగా 12 మంది కనుక వస్తే నేను ప్రెషర్ కుక్కర్ పేలినట్లు ఢామ్ అని పేలుతానని మణికంఠ చెబుతాడు. వాళ్లని హౌస్‌లోకి తీసుకురావొద్దని.. వాళ్లను అట్నుంచి అటే పంపించేయాలని బిగ్‌బాస్‌కి చెబుతాడు. 7 వండర్స్ ఉంటాయని తెలుసు గానీ, 8వ వింత ఈ బిగ్‌బాస్ తెలుగు 8 అని అంటాడు.

ఎక్కడలేని వింతలు, విడ్డూరాలు, విచిత్రాలు అన్ని మా బిగ్‌బాస్‌లోనే ఉన్నాయని .. 12 మంది అంట నవ్వుతారేమో , కొత్త సీజన్‌ చేయొచ్చు అంటాడు. ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్‌లోకి వెళ్లడానికి నాకు సెట్ అవ్వడానికి రెండ్రోజులు పడుతుందని, అలాంటిది 12 మంది కొత్తవాళ్లతో ఎలా వేగాలో అని తనలో తాను కుమిలిపోతుంటాడు . మణికంఠ చెప్పేదంతా లైవ్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X