నాగపంచమి సీరియల్ హీరోహీరోయిన్లకు పెళ్లి.. అది గెలిస్తే స్టేజీ మీదే చేసుకుంటామంటూ..!

నాగ పంచమి సీరియల్ హీరోహీరోయిన్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భతమైన నటన, అంతకు మించిన టాలెంట్ తో తమ ప్రతిభను ప్రూవ్ చేసుకుంటున్న మోక్ష, పంచమిలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. అయితే తాజాగా ఓ షోకు వచ్చిన వీరు తామిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అదే జరిగితే ఈ స్టేజీ మీదే పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నాగ పంచమి సీరియల్ హీరోహీరోయిన్లు అయిన దర్శిని గౌడ, పృథ్వీ ప్రిన్స్ శెట్టిల గురించి అందరికీ తెలిసిందే. పంచమి, మోక్షలుగా కనిపిస్తూ.. ఆదర్శ దంపతలుగా పేరు తెచ్చుకున్న వీరు నిజజీవితంలోనూ భార్యాభర్తలు కాబోతున్నట్లు తెలుస్తోంది. రీల్ లైఫ్ దంపతులే రియల్ లైఫ్ లోనూ కపుల్స్ కాబోతున్నారని వాళ్లే చెప్పడంతో చాలా మంది తెగ ఎగ్జైట్ అవుతున్నారు. నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Naga Panchami Serial hero heroine Going to marry Check Details

అయితే పృథ్వీ ప్రిన్స్ శెట్టి, దర్శిని గౌడలు తాజాగా నీతోనే డ్యాన్స్ 2.0 షోలో కంటెస్టెంట్లుగా వచ్చారు. అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. పాములగా కనిపించేలా మేకప్ వేసుకుని.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ అనే పాటకు మహాద్భుతంగా స్టెప్పులు వేశారు. వీరి డ్యాన్స్ చూసిన జడ్డి... వీళ్ల టాలెంట్ చూస్తుంటే ఫైనల్స్ వరకు వస్తారనిపిస్తుందని తెలిపారు. దీంతో దర్శిని గౌడతో పాటు పృథ్వీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అక్కడే ఉన్న యాంకర్ శ్రీముఖి వెంటనే మైక్ అందుకుని వీరి గురించి మాట్లాడింది.

మీపై మీ ఇద్దిరపై పూర్తిగా క్లారిటీ ఉంది కాబట్టి.. మీ పెళ్లి ఎప్పుడు అంటూ పృథ్వీ ప్రిన్స్ శెట్టితో పాటు దర్శిని గౌడను అడిగింది. దానికి ఆయన ఈ షో టైటిల్ గెలిచిన వెంటనే అని చెప్పాడు. ఈ టైటిల్ గనుక మీకు వస్తే ఈ స్టేజీ మీద మీ పెళ్లి ఈవెంట్ కచ్చితంగా జరుగుతుందని అంటూ శ్రీముఖి అరిచి మరీ చెబుతుంది. ఇదంతా విన్న దర్శిని, పృథ్వీలు మొహానికి చేతులు అడ్డుగా పెట్టుకుంటూ మరీ నవ్వుతారు. అయినా సరే శ్రీముఖి ఆపకుండా వీరి పెళ్లిపై కామెంట్లు చేస్తూనే ఉంటుంది.

కిందపడి, మీద పడి అయినా సరే ఈ టైటిల్ మీకే ఇప్పించి మీ పెళ్లి చేస్తానంటూ చెబుతుంది. దీనికి పృథ్వీ ప్రిన్స్ శెట్టి, దర్శిని గౌడలు కూడా ఓకే చెబుతారు. అయితే ఇదంతా చూస్తుంటే వీళ్లేదో కామెడీకీ తాము పెళ్లి చేసుకుంటామని చెప్పినట్లు అర్థం అవుతుంది. రీల్ లైఫ్ లో హ్యాపీగా ఉండే వీళ్లు రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. చూడాలి మరి వీరిద్దరి మధ్య నిజంగానే బంధం ఉందా.. కేవలం షోకోసమే ఇలా చేస్తున్నారా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X