Naga Panchami: భర్త కళ్లెదుటే పాములా పంచమి, వణికిపోతున్న మోక్ష.. ఏం జరగబోతుంది?
Naga Panchami October 27th Episode: నాగ పంచమి సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దుమ్ములేపుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్టులతో వస్తూ.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ప్రతిరోజూ ఏం జరగబోతుందో అని అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ పౌర్ణమి సందర్భంగా పంచమి పాములా మారబోతుంది. అయితే ఆమె రహస్యాలు తెలుకునేందుకు ఆమె భర్త మోక్ష.. ఆమెను తమ గదిలోకి తీసుకెళ్లి లాక్ వేశాడు. అతడు కూడా లోపలే ఉన్నాడు. పంచమి బయటకు వెళ్తానని ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. అతడు అంగీకరించలేదు.
ఈక్రమంలోనే పంచమి తన భర్త కళ్లెదుటే పాములా మారుతుంది. పంచమి మాత్రం ఓవైపు పాములా మారుతూనే మరోవైపు భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అది చూసిన మోక్ష భయంతో గజగజా వణికిపోతాడు. ఏంటి పంచమి ఇదంతా అంటూ ఆమె రహస్యాన్ని కళ్లారా చూస్తాడు. అయితే పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజు రాత్రి వచ్చే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పుడే పౌర్ణమి రోజు ఏం జరిగిందో పూర్తిగా తెలుస్తుంది.

మరోవైపు నిన్నటి ఎపిసోడ్ లో.. గరుడ, పంచమిని భయపెడుతూ కనిపించడంతో సీరియల్ ప్రారంభం అయింది. అయితే నీవు ఇంట్లోంచి వస్తే నిన్ను చంపుతానని.. బయటకు రాకపోతే కుటుంబ సభ్యులకు నీ నిజ స్వరూపం తెలుస్తుందంటూ గరుడ చెబుతాడు. దీనికి పంచమి తీవ్రంగా భయపడుతుంది. ఇక ఆ తర్వాత పంచమి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి గరుడ నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత పంచమి ధ్యానం చేసుకుంటున్న సుబ్బు వద్దకు వెళ్తుంది. తన బాధను చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాకు ఈ భూమిపై ఉండే ఆశ లేదని అంటుంది. మనుషులు అవసరం తీరిందని భగవంతుడు అనుకున్న మరుక్షణమే వారిని తనలో ఐక్యం చేసుకుంటాడంటూ సుబ్బు చెబుతాడు.

సమస్యల గురించి పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్లలేమని.. అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే మన సమస్యలు అన్నీ తీరిపోతాయని సుబ్బు చెబుతాడు. సుబ్బు చెప్పిన మాటలకు పంచమికి కాస్త ధైర్యం వచ్చి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వాహనం అయిన నెమలి.. సుబ్బు వద్దకు వచ్చి పంచమి కష్టాలు చూస్తుంటే బాధేస్తుందని చెబుతుంది. ఇంకెన్నాళ్లు స్వామి పంచమికి కష్టాలు అని ప్రశ్నిస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య కాసేపు చర్చ సాగుతుంది. ఇక ఆ తర్వాత చిత్ర, జ్వాలలు కనిపిస్తారు. పౌర్ణమి రోజు పంచమి ఏం చేయబోతుందో తెలుసుకుందామంటూ మాట్లాడుకుంటారు.

ఆ తర్వాత మోక్ష నానమ్మ శబరిని, ఆమె కూతురిని చూపిస్తారు. పంచమిని ఇంట్లోంచి పంపించడం మంచి పద్ధతి కాదని ఇలా చేయడం చాలా తప్పని అంటుంది. అలా అనడంతో.. అవును అంటూ ఆమె కూడా అంటుంది. ఈక్రమంలోనే మోక్ష తండ్రిని పిలిచి పంచమి ఈ ఇంటి కోడలు.. ఆమెను ఇంట్లోంచి పంపించడం సరికాదని చెబుతుంది. అప్పుడే మోక్ష తల్లి వైదేహి వచ్చి పంచమి నా కొడుకుకు భార్యే కాదంటూ కామెంట్లు చేస్తుంది. అప్పుడే వచ్చిన మోక్ష.. ఈరోజు పౌర్ణమి, నాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.. అవేంటో ఈరోజు తెలుసుకుంటానంటాడు. ఒకవేళ పంచమి నిజంగానే పాము అయితే ఇంట్లోంచి పూర్తిగా పంపించేస్తానని హామీ ఇస్తాడు. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











