Naga Panchami Weekly Roundup: మోక్ష సేఫ్.. కానీ పంచమికి శాపం.. వీరిద్దరూ బతికి ప్రేమను బతికించగలరా?
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. సినిమాల్లో కూడా చోటు చేసుకోని స్థాయిలో ట్విస్ట్ లు ఇస్తూ.. సీరియల్ ను రసవత్తరంగా మార్చడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలకమలుపులు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబర్ 11వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష ప్రాణాలు కాపాడేందుకు మహా మృత్యుంజయ యాగం తలపెడతారు. అయితే సుబ్బు.. సప్త రుషుల సాయం కోరగా.. వారు యాగం చేసేందుకు ఒప్పుకుట్టారు. ఆరోజే పంచమి సుబ్బును పంపించేస్తుంది. యాగం చాలా చక్కగా జరుగుతుండగా.. ఫణీంద్ర మాత్రం మరో ఇద్దరు నాగులను వెంట పెట్టుకుని వచ్చి యాగాన్ని చెడగొట్టాలని ప్లాన్ చేసుకుంటాడు. కానీ అది మాత్రం కుదరదు. దీంతో ఫణీంద్ర చాలా ఫైర్ అవుతాడు.

డిసెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి తన ప్రాణాలు అర్పించేందుకు ఆత్మాహుతి చేసుకుంటుంది. భర్తను కాపాడుకోవాడని పౌర్ణమి రోజు నిప్పు పెట్టుకుని అందులో కాలిపోవాలని చూస్తుంది. అయితే నాగ దేవత మాత్రం రుద్రతాండవం చేసి పంచమిని ఐదు తలల పాముగా మార్చేస్తుంది. పంచమి ఆత్మాహుతి చేసుకోబోతున్నట్లు తెలుసుకున్న మోక్ష కూడా అడవిలోకి వెళ్తాడు. పాముగా మారిన పంచమి ఆమె వెంట పడతాడు.
డిసెంబర్ 13వ తేదీ ఎపిసోడ్ లో.. మహా మృత్యుంజయ యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సప్త రుషులు నేరుగా వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు. ఈక్రమంలోనే సుబ్బు వీరికి థాంక్స్ చెబుతాడు. పంచమి భర్త ప్రాణాలు కాపాడేందుకు సాయం చేసిన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనని అంటాడు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అయిపోతుంది.
డిసెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో.. భర్త ప్రాణాలు కాపాడుకున్న పంచమి పాము నుంచి మనిషిగా మారిపోతుంది. స్పృహ కోల్పోయిన మోక్షను చూసి చనిపోయాడనుకుంటుంది. కానీ ఆ తర్వాత స్పృహ తప్పాడని తెలుసుకుని నీళ్లు తెచ్చేందుకు వెళ్లగా... కరాళీ వచ్చి మోక్షను తీసుకెళ్తుంది. అది చూసిన పంచమి ఆమెపై శివాలెత్తుతుంది. అలా అతడిని నేరుగా శివాలయానికి తీసుకు వెళ్తుంది.
డిసెంబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష తన కుటుంబ సభ్యులకు తనను చంపేందుకు వచ్చింది ఐదు తలల పాము అని చెబుతాడు. ప్రతీ పౌర్ణమికి ఆ పాము తనను చంపేందుకు వస్తుందని అంటాడు. అలాగే కరాళీ కూడా మహాకాళిని వేడుకోగా.. ఆమెకు మేనక రూపాన్ని ఇస్తుంది. ఆ రూపంతో కరాళీ.. మోక్షను వశ పరుచుకుని తన కోరిక తీర్చుకోవాలని అనుకుంటుంది.
డిసెంబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి నాగ లోకాన్ని మోసం చేసి చనిపోవాలనుకోవడం జీర్ణించుకోలేని నాగ దేవత పంచమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా నాగ దేవత పంచమికి శాపం ఇస్తుంది. ఇక నువ్వు నాగ లోకానికి రావాల్సిన అవసరం లేదని.. నీవు వచ్చే పౌర్ణమికి పాముగా మారినప్పుడు నిన్ను జనాలు చూసి కర్రలతో కొట్టి చంపేస్తారని శాపం ఇస్తుంది. అది విన్న పంచమి చాలా భయపడిపోతుంది. ఇలా ఈ వారం అదిరిపోయే ట్విస్ట్ లతో అద్భుతంగా సాగింది.


Click it and Unblock the Notifications











