Naga Panchami Weekly Roundup: నాగలోకం వెళ్లిపోనున్న పంచమి.. మోక్ష చెంత చేరిన కరాళీ.. ఏం జరగబోతుంది?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. సినిమాల్లో కూడా చోటు చేసుకోని అనేక ట్విస్ట్ లు వస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సీరియల్ ను మరింత అద్భుతంగా మార్చడంలో ఎప్పుడూ ముందుంటున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

డిసెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ లో.. కార్తీక పౌర్ణమికి మోక్ష ప్రాణాలతో బయట పడడంతో నాగ దేవత చాలా కోపంగా ఉంటుంది. ఇక పంచమి తన భర్తను చంపదని.. ఆ బాధ్యతను మోక్షకు అప్పజెబుతుంది. నువ్వే అతడిని చంపాలంటూ పేర్కొంటుంది. ముఖ్యంగా రాబోయే ఏకాదశి లోపు అతడి ప్రాణాలు తీయాలని.. ఇక జన్మలో పంచమి నాగ లోకానికి రాదని చెబుతుంది.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2023 December 18th to December 23th episode

డిసెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి, ఫణీంద్ర గుడిలో మాట్లాడుకుటుండగా వారి మాటలు చాటుగా విన్న కరాళీ ఫణీంద్రను అడ్డగిస్తుంది. తాను కూడా ఓ నాగ కన్యను అని.. రాణి భూలోకం వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని రాణి చనిపోవడంతో నాగ దేవత తనకు నాగలోక ప్రవేశం ఇవ్వట్లేదంటూ చెప్పుకొచ్చింది. అలా పరిచయం చేసుకుని అదిరిపోయే ప్లాన్ వేసింది కరాళీ.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2023 December 18th to December 23th episode

డిసెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి నాగమణి గురించి మోక్షకు వివరిస్తుంది. దాన్ని తీసుకువచ్చి ప్రాణాలు కాపాడవచ్చని.. కానీ అంతకంటే ముందు మిమ్మల్ని కాటేసి నాగ లోకానికి వెళ్లాలంటూ వివరిస్తుంది. దానికి మోక్ష అలా వద్దు అని తనతో పిల్లల్ని కని పంచమి ఇక్కడే తన భార్యగా జీవితాంతం ఉంటే చాలని అంటాడు. దాని గురించి మాత్రమే ఆలోచించమంటూ కోరతాడు. కానీ ఆమె మాత్రం భర్తను కాపాడుకోవడానికి నాగ లోకానికి వెళ్లాలని అనుకుంటోంది.

డిసెంబర్ 21వ తేదీ ఎపిసోడ్ లో.. ఫణీంద్ర పంచమి ఇంటికి వస్తాడు. ఎందుకు వచ్చావని పంచమి అడగ్గా... నాగమణి గురించి చెబుతాడు. ముందుగా నువ్వు మోక్షను కాటేసి నాగ లోకం వచ్చే అక్కడే రెండ్రోజులు ఉంటే పట్టాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత నాగమణి తీసుకు వచ్చిన మోక్ష ప్రాణాలు కాపాడి తిరిగి నాగలోకం వచ్చేయాలని చెబుతాడు. అయితే కాటేసిన తర్వాత నాగమణి తీసుకు వచ్చేవరకు నాగమణిని కాపాడే బాధ్యతను మరో నాగకన్య తీసుకుంటుందని.. ఇది నీకు ఓకే అయితే రేపు గుడికి రమ్మని చెబుతాడు.

డిసెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో... నాగ లోకం రావడానికి ఒప్పుకున్న పంచమి గుడికి వస్తుంది. ఈక్రమంలోనే వారు ప్లాన్ ని ఎలా అమలు చేయాలని నిర్ణయించుకుంటారు. అలాగే మేఘన రూపంలో ఉన్న కరాళీని ఇంటికి తీసుకు వస్తుంది పంచమి. మరోవైపు ఫణీంద్ర పంచమి నాగ లోకానికి రాగానే తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే తమ పెళ్లి కూడా జరిగినట్లుగా ఊహించుకుంటాడు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2023 December 18th to December 23th episode

డిసెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో... కరాళీని ఇంటికి తీసుకు వచ్చిన పంచమి తన చిన్ననాటి స్నేహితురాలిగా ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తుంది. కొన్నాళ్లు ఇక్కడే ఉంటుందని అందర్నీ ఒప్పిస్తుంది. ఆ తర్వాత ఓ గదిలోకి తీసుకు వెళ్లి.. నిజంగానే నాగమణితో తన భర్తను కాపాడుకోవచ్చా అని.. ఫణీంద్ర తనకు కచ్చితంగా సాయం చేస్తాడా లేదా అని అడుగుతుంది. అందుకు కరాళీ చేస్తాడు.. నువ్వు నాగలోకం వెళ్లాలని అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X