Naga Panchami Weekly Roundup: పంచమి తల్లైతే జన్మలో పాముగా మారదు.. అదే జరిగితే మోక్ష చనిపోవడం ఖాయం?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టులు ఇస్తూ... సీరియల్ ను రసవత్తరంగా మారుస్తున్నారు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక సీరియల్ లో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. అలాగే గతవారం మొత్తం కూడా అంటే నవంబర్ 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ 13వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష తన భార్య గురించి ఆలోచిస్తూ ఉండగా... సుబ్బు వచ్చి తన చేతులతో పాము రూపంలో నీడను సృష్టించగా మోక్ష చాలా భయపడతాడు. ఇందుకు సుబ్బు విపరీతంగా నవ్వి ఎందుకు అంతలా భయపడుతున్నావు మోక్ష అని అంటాడు. నాగు పాములు అంటే కోపమే తప్ప భయం లేదని చెప్పగా.. ఎందుకు కోపం అని సుబ్బు అడుగుతాడు. దానికి మోక్ష.. పాములు నిర్దాక్షిణ్యంగా కాటు వేసి చంపేస్తాయి, చిన్నా పెద్దా అని కూడా చూడవంటూ చెప్పుకొస్తాడు. పాములు పగబట్టవు, వాటికి ఏమైనా అన్యాయం చేస్తేనే అవి అలా చేస్తాయని వివరిస్తాడు. భయపడే వాటితో స్నేహం చేస్తే ఆ భయం పోతుందంటూ చెప్పగా.. మోక్ష వెళ్లి పంచమికి దగ్గరవుతాడు. అప్పటి నుంచి ఆమెను ప్రేమగా చూస్తాడు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2023 November 13th to November 18th episode

నవంబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష తల్లి తన ఇంటి పెత్తనాన్ని పంచమికి ఇస్తుంది. ముందు గట్టిగా పిలిచిన ఆమె ఆ తర్వాత ప్రేమగా మాట్లాడుతూ... తన వద్ద ఉన్న ఇంటి తాళాల గుత్తి తీసి పంచమి చేతిలో పెడుతుంది. ఇక నుంచి ఇంటి బాధ్యత నీదేనని అంటుంది. మరోవైపు చిత్ర, జ్వాలలు మాకివ్వకుండా ఆమెకి ఎలా ఇస్తారంటూ గొడవ పడతారు. ఈక్రమంలోనే పంచమి కూడా తాను పల్లెటూరిదాన్ని అని, పెద్దగా చదువు కూడా రాజు కాబట్టి తాను ఈ బాధ్యతలు నిర్వర్తించలేదని వివరిస్తుంది. కానీ చివరకు అందరు చెప్పిన మాటలతో ఆమె ఇంటి బాధ్యతను తీసుకుంటుంది.

నవంబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో.. యువరాజు ఫణీంద్ర భూలోకాని రావడం పంచమిని కలవడం చూపిస్తారు. వచ్చే పౌర్ణమికి పంచమిని కచ్చితంగా.. పవిత్రంగా నాగలోకానికి తీసుకెళ్తానని చెబుతాడు. కానీ పంచమి మాత్రం తన భర్తను కాపాడుకున్న తర్వాతే వస్తానని అంటుంది.కానీ అంతలోపే మోక్ష వచ్చి పంచమిని ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం చూసిన ఫణీంద్ర కోపంగా వస్తుంటాడు. అంతలోనే నాగ దేవత ప్రత్యక్షమై.. వాళ్లు మనుషులు, వారికి బంధాలు, అనుబంధాలు ఉంటాయని చెబుతుంది. అలా ఫణీంద్ర అప్పుడు కోపంతో ఆగిపోతాడు.

నవంబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష బతికినన్ని రోజులు పంచమితో హాయిగా బతకాలని అనుకుంటాడు. అదే విషయాన్ని భార్యకు చెబుతాడు. ఎలాగైనా సరే ఈరోజు ఒక్కటి అవుదాం అనుకుంటూ ఆమెను హత్తుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అంతలోనే పంచమికి ఏసీలోంచి వల్లె గాలిలో యువరాజు ఫణీంద్ర పాము రూపంలో కనిపిస్తాడు. అది చూపి తీవ్రంగా భయపడిపోయిన పంచమి.. భర్త మోక్షను నెట్టేస్తుంది. కౌగిలించుకునేందుకు వెళ్లిన తనను పంచమి తోసేయడంతో మోక్ష మొహం మాడిపోతుంది. ఏం జరుగుతుందో తెలియని అతను.. పంచమిని టెన్షన్ గా చూస్తూ ఉంటాడు. ఇదంతా మనం ఈరోజుటి ఎపిసోడ్ లో చూడవచ్చు.

నవంబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి కోసం ఏదైనా చేయాలనుకున్న మోక్ష నాగులవరం వెళ్లి నాగసాధువను కలుస్తాడు. తన భార్య అంటే తనకు చాలా ఇష్టం అని.. అలాగే తాను చనిపోతానని తనకు ఏమాత్రం భయం లేదని.. కానీ చనిపోయేలోపు పంచమికి ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. అందుకు స్పందించిన స్వామీజీ.. పంచమి తల్లిగా మారితే ఆమె పాముగా జీవితంలో మారలేదని వివరిస్తాడు. ఇది చాలు స్వామి నాకు అంటూ మోక్ష చెప్పగా... కానీ నాగ కన్యతో సంభోగం చేసిన వారు ప్రాణాలతో ఉండరని చెప్తాడు.

నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ మోక్ష ఇంటికి పంపిన భటులను సుబ్బు ఓ ఆట ఆడుకుంటాడు. వారు చేసే చెడును వారికే మర్లేలా చేసి మరీ వాళ్లను ఇంటికి పంపిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లిన పంచమి వద్దకు ఫణీంద్ర వస్తాడు. వచ్చే పౌర్ణమికి నీ భర్తను చంపి నిన్ను నాగ లోకం తీసుకెళ్లడం, నిన్ను పెళ్లాడడం జరగుతుందని మరోసారి అంటాడు. దీనికి కోపం తెచ్చుకున్న పంచమి కొట్టేందుకు చేయి లేపుతుంది. కానీ ఫణీంద్ర మాత్రం నవ్వుతూ నీవేం చేసిన పౌర్ణమి వరకే.. ఇక ఆ తర్వాత నాగలోకానికే వస్తావు అనగా.. నేను రాను నా తల్లితోనే ఆ బంధం పోయింది... ఇక జన్మంతా ఇక్కడే అంటుంది. ఈక్రమంలోనే మోక్ష గుడికి వస్తాడు. పంచమి దర్శనం అయిందా అని అడుగుతాడు. పక్కనే ఉన్న ఫణీంద్రను చూసి మీరెవరూ అనగా.. నేను పంచమికి దూరపు బంధువును అని అంటాడు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X