Naga Panchami Weekly Roundup: బలవంతంగా పంచమితో కలవబోతున్న మోక్ష.. ఏం జరగబోతుంది!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అదిరిపోయే ట్విస్ట్ లతో అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని, అంచనాలకు అందని స్థాయిలో రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలకమలుపులు చోటు చేసుకున్నాయి. నవంబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నవంబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి, మోక్షల పెళ్లి రోజు దగ్గరకు వచ్చిందని, ఆరోజుని ఘనంగా జరుపుకోవాలని ఉందని మోక్ష కుటుంబ సభ్యులకు చెబుతాడు. ఈక్రమంలోనే శబరి పిల్లలు కావాలని కోరుతుంది. ఇందుతు చిత్ర, జ్వాలలు రచ్చ చేయగా.. ఆ తర్వాత మోక్ష కూడా త్వరలోనే నీవు పిల్లలను ఎత్తుకుంటావని అంటాడు. ఆ తర్వాత నేరుగా పంచమితో శబరికి ప్రామిస్ చేయిస్తాడు మోక్ష. ఇదంతా చూస్తుంటే త్వరలోనే పంచమి తల్లి కావడం, మోక్ష చనిపోవడం జరిగే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

నవంబర్ 21వ తేదీ ఎపిసోడ్ లో.. ధ్యానం చేసుకుంటున్న సుబ్బు వద్దకు యువరాజు ఫణీంద్ర వస్తాడు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో మీ దర్శన భాగ్యం నాకు కల్గిందంటూ ఫణీంద్ర చెప్పగా... ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం మరే జన్మలోనో ఫలిస్తుంది, కానీ ఈ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలోనే వెంటాడుతుందని అంటాడు. పంచమిని నాగ లోకానికి తీసుకెళ్లడం నా కర్తవ్యం అని అందుకు మీరు సాయం చేయాలంటూ ఫణీంద్ర సుబ్బుతో అంటాడు. దైవం ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని.. పంచమి పాముగా మారితేనే మీ యువరాణి అని, అప్పటి వరకు ఆమెను వేధించడం సరికాదని చెబుతాడు. ఇలా వీరిద్దరి మధ్య కాసేపు చర్చ సాగగా.. ఫణీంద్ర వెళ్లిపోతాడు.
నవంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో.. నాగలోకపు యువరాజు ఫణీంద్ర సోది పలికే వాడిగా వచ్చి మోక్ష కుటుంబ సభ్యులను భయపెడతాడు. అలాగే పంచమి తప్పిపోయి భూలోకంలో పుట్టిందని... ఆమె నాగమ్మ తల్లి అంశ అంటూ వివరించాడు. పంచమి ఇక్కడున్నంత కాలం మోక్షకు ప్రాణ గండం అని ఆయన ప్రాణాలు పోవాల్సిందేనంటూ హెచ్చరించాడు. ఇక ఇధంతా విన్న కుటుంబ సభ్యులు భయంతో వణికిపోయారు. కానీ మోక్ష మాత్రం వాళ్లను భయపడొద్దంటూ చెప్పాడు. తన ప్రాణాలు పోయినప్పుడు పోతాయి కానీ ఇప్పుడు తాను సంతోషంగా ఉండాలనుకుంటున్నట్లు వివరించాడు.
నవంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ మహాకాళిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తూ కనిపిస్తుంది. ఈక్రమంలోనే మహాకాళిని పిలుస్తుంది. అప్పుడే అమ్మవారి విగ్రహం రాగా... చిన్నగా ఉన్న అది పెద్దగా అవుతుంది. తన శక్తులు తిరిగి వచ్చేలా చేయమని కరాళీ వేడుకుంటుంది. కానీ అది కుదరదని మహాకాళి చెబుతుంది. ఈక్రమంలోనే కరాళీ మరోసారి వేడుకోగా.. తాను శక్తులు ఇవ్వలేను కానీ.. పెళ్లి అయి బ్రహ్మచారిగా ఉన్న మోక్షను తన వశం చేసుకుంటే చాలా శక్తులు వస్తాయని చెబుతుంది. పెళ్లయ్యాక కూడా బ్రహ్మచారిగా ఉంటే కొన్ని శక్తులు ఏర్పడతాయని.. అతడి నుంచి నువ్వు ఆ శక్తులు పొందవచ్చని చెబుతుంది. వాటి వల్ల పంచమిని ఎదురుకోవచ్చే తప్ప నాగమణిని సంపాధించలేవని వివరిస్తుంది.
నవంబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష తాను ఉన్నా లేకున్నా భార్యను చక్కగా చూసుకోవాలని చెబుతూ.. కుటుంబ సభ్యులకు పంచమి బాధ్యతలను అప్పగించాడు. పంచమి, మోక్షల పెళ్లి రోజును ఘనంగా నిర్వహించారు. ఈక్రమంలోనే పూజ చేసి వారిద్దరికీ మళ్లీ పెళ్లి చేశారు. ముఖ్యంగా దండలు మార్చుకున్నారు. ఈక్రమంలోనే పూజ అనంతరం భర్త పాదాలకు దండం పెట్టుకున్న పంచమి.. దీర్ఘసుమంగళీ భవ అని దీవించమంటే... మోక్ష మాత్రం చాలా సేపు ఆలోచించి మరీ సంతాన ప్రాప్తిరస్తు అని దీవించాడు. అందరూ షాకింగ్ గా చూశారు.
నవంబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష, పంచమిల పెళ్లి జరగ్గగా... ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పంచమి తల్లి ఇద్దరికీ ధైర్యం చెబుతూ కనిపిస్తారు. మోక్షనేమో బతికినంత కాలం సంతోషంగా బతకాలని అనుకుంటున్నట్లు వివరిస్తాడు. ఓవైపు కరాళీ, మరోవైపు యువరాజులు.. వీరి శోభనాన్ని అడ్డుకునేందుకు ప్లాన్ లు వేస్తూనే ఉంటారు. కానీ మోక్ష మాత్రం పంచమికి ఇష్టం లేకపోయినా ఆమెతో కలవాలని చూస్తాడు. ఆమె వద్దు వద్దు అని వారిస్తున్నా దగ్గరకు తీసుకోబతాడు. ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











