Naga Panchami Weekly Roundup: నాగమణి కోసం కరాళీ.. మోక్షను చంపేందుకు నాగులు.. పంచమి ఏం చేయబోతుంది?
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అదిరిపోయే ట్విస్ట్ లతో అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని, అంచనాలకు అందని స్థాయిలో రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలకమలుపులు చోటు చేసుకున్నాయి. నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నవంబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ మహా మాయావిని ఆవాహన చేసుకొని మోక్ష, పంచమిల శోభనాన్ని క్యాన్సిల్ అయ్యేలా చేయాలని చెబుతుంది. అది విన్న మహా మాయవి జ్వాలలో ఆవాహనం అయి వీరి శోభనం జరగకూడదంటూ ఫైర్ అవుతుంది. ఒకవేళ కార్యం జరిగితే పంచమి పసుపు, కుంకుమలు పోతాయని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత సుబ్బు తన శక్తితో అమ్మవారిని హెచ్చరించగా.. తప్పయిపోయింది స్వామి నేను వెళ్లిపోతాను, నేను మంచి చేయడానికి మాత్రమే పని చేస్తానంటూ మహా మాయావి పారిపోతుంది.

నవంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి, మోక్షలు శోభనం రోజు సుబ్బు శక్తితో మోక్ష పడుకుండి పోతాడు. అయితే ఆ తర్వాత అక్కడకు వచ్చిన యువరాజు ఫణీంద్ర మోక్షను చంపబోయే ప్రయత్నం చేస్తాడు. కానీ పంచమి మాత్రం నీకు మోక్షను చంపే హక్కు లేదని.. అలా చేయద్దని చెబుతుంది. ఆ తర్వాత నాగ దేవత వచ్చి.. సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చిన హామీ మేరకు నీకు మోక్షను చంపే హక్కు లేదని అంటుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ సాగుతుంది.
నవంబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో.. కార్తీక పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లో పంచమిని నాగ లోకానికి తీసుకు రావాలని నాగ దేవత నాగులకు సూచిస్తుంది. అలాగే తాను ఇచ్చిన మాట మేరకు... పౌర్ణమి వరకు ఎవరు కూడా మోక్షను చంపడానికి వీలు లేదని... ఆ తర్వాత మాత్రమే అతడిని చంపాలని హెచ్చరిస్తుంది. అలాగే మోక్ష, పంచమిలు కలిస్తే ప్రాణ గండం అని తెలిసి కూడా మోక్ష శోభనానికి ప్రయత్నించడం చూసి ఫుల్ భయపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులు.
నవంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో... పంచమి, మోక్షలకు శోభనం జరిగి.. మోక్ష బ్రహ్మచర్యం పోయిందని ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం అవుతుంది కరాళీ. తాను చనిపోయేందుకు చుట్టూ అగ్నిని ఏర్పరుచుకుని సజీవ దహనం అయ్యే ప్రయత్నం చేస్తుంది. అయితే అంతలోనే మహాకాళి వచ్చే కరాళీని చావకుండా అడ్డుకుంటుంది. నువ్వు ఇలా చేయడం తప్పు.. అసహజ మరణం అస్సలే మంచిది కాదని వివరిస్తుంది. అలాగే పంచమి, మోక్షలకు శోభనం జరగలేదని.. గదిలోకి పంచిన మాట వాస్తవమే అయినా ఏం జరగలేదని వివరిస్తుంది. నువ్వు పౌర్ణమి లోగా అతడిని వశపరుచుకుని నీ పని చేసుకోవాలని.. పౌర్ణమికి మోక్ష ప్రాణాలు పోతాయని చెబుతుంది.
డిసెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో... మరోవైపు మోక్ష ఇంట్లో అడుగు పెట్టిన కరాళీ.. మోహనిగా పరిచయం చేసుకుంది. నంబూద్రీ చెల్లెను అని వైదేహీకి చెప్పి.. ఆమె స్నేహితురాలిగా ఇంట్లోకి చేరింది. ఈక్రమంలోనే పాములు, విషంపై రీసర్చ్ చేస్తున్నానంటూ మోక్షకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఒంటరిగా అతడితో మాట్లాడుతూ.. తనలోని వశపరుచుకునే శక్తితో అతడికి దగ్గర అవుతోంది. తన కళ్లలోంచి మోహించే శక్తిని పంపి.. అతడిని తన వశం చేసుకుంది. ఈక్రమంలోనే మోక్ష.. మోహిని నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమెను పొగుడుతాడు. అతడు కూడా ఆమెను పొగడగా.. కరాళీ మోక్షను ముద్దు పెట్టుకుంది. అప్పుడే అక్కడకు వచ్చిన పంచమి, సుబ్బులు వాళ్లను చూస్తూ ఉండిపోతారు.
డిసెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో.. మోహిని మంచిది కాదని చెబుతుంటే మోక్ష వినడు. అలాగే మోహిని.. నంబూద్రీ చెల్లెలు అని ఆమెకు అనేక మంత్ర శక్తులు వచ్చాయని చెబుతుంది. ఆమె వల్ల మనకే మంచి లాభం చేకూరుతుందని అంటాడు. ఇక ఆ తర్వాత కరాళీకి.. మహాకాళి కనిపించి పౌర్ణమి లోపే నీ కోరికి తీర్చుకో అని మరోసారి హెచ్చరిస్తుంది. అది కాగానే పంచమి వచ్చి కరాళీని ఇంటి నుంచి వెళ్లిపోమంటుంది. కానీ తాను నాగమణిని సంపాధించాకే వెళ్లిపోతానని అంటుంది. నీ భర్తను చంపి అయినా సరే నీ చేతులతోనే తీసుకొచ్చానని అంటుంది.


Click it and Unblock the Notifications











