Naga Panchami Weekly Roundup: పంచమి జన్మరహస్యం వెలుగులోకి.. మోక్షను కాపాడుతుందా, కాటేసి చంపుతుందా?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. అత్యధిక టీఆర్పీతో ఎవరూ ఊహించని రీతిలో దూసుకెళ్తోంది. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఇఅలాగే గతవారం మొత్తం కూడా అంటే నవంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో పంచమి జన్మ రహస్యాన్ని మోక్ష తెలుసుకుంటాడు. నేరుగా నాగలవరం స్వామీజీ వద్దకు వెళ్లిన మోక్షకు.. పంచమియే పాము అని, పౌర్ణమి రోజు మాత్రమే ఆమె పాములా మారుతుందని చెప్పాడు. అయితే ఆమె మిమ్మల్ని చంపితేనే నాగలోకానికి ప్రవేశం ఉంటుందని వివరిస్తాడు. దీంతో స్వామీజీ ఇది మీ ఇద్దరి జీవన్మరణ సమస్య అని చెప్పుకొస్తాడు. అయితే మేమిద్దరమే ఈ గొడవ తేల్చుకుంటామని చెప్పి మోక్ష ఇంటికి వచ్చేస్తాడు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2023 November 6th to November 11th episode

నవంబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ చనిపోయిన తన అన్న ఆత్మను ప్రసన్నం చేసుకుంటుంది. ఎలాగైనా సరే నిన్ను బతికించుకుంటాను అన్నయ్యా అనగా... నన్ను బతికించే శక్తి ఒక్క నాగమణికి తప్ప మరెవరికీ లేదని చెబుతాడు. అప్పటికీ మహంకాళి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న కరాళీకీ.. అమ్మవారు ఎలాంటి శక్తులను ప్రసాదించరు. అలాగే నాగమణి గురించి అన్న నంబూద్రీని బతికించడం గురించి మర్చిపోవాలని చెబుతుంది. ఇదంతా కరాళీ తన అన్నకు చెప్పగా.. నాగమణి లభిస్తే నీకు శక్తులు ఎక్కువ అవుతాయని.. అమ్మవారు ఈర్ష్యతో నిన్ను భయపెట్టారని నంబూద్రీ అంటాడు. ఈక్రమంలోనే కరాళీ కచ్చితంగా తాను నాగమణిని సంపాధిస్తానని అంటుంది.

నవంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి కరాళీ వద్దకు వెళ్లడం.. నంబూద్రీని చూడాలని అడుగుతుంది. కరాళీ మాత్రం తన అన్నను చంపింది నువ్వేనని.. నీ వల్లే నా అన్న ప్రాణాలు కోల్పోయాడని అంటుంది. నీ భర్త మోక్షను కాపాడుకొని నా అన్నను చంపడం తప్పు.. కాబట్టి నువ్వే నా అన్నను బతికించు అంటుంది. చనిపోయిన వారిని తాను బతికించలేనని.. ఒకవేళ తనకు అలాంటి శక్తులు ఉన్నా దుష్టశక్తి నంబూద్రీని మాత్రం అస్సలే బతికించను అని వివరిస్తుంది. అలాగే కరాళీని గట్టిగా హెచ్చరిస్తుంది. నాగమణి గురించి మర్చిపోయి హాయిగా జీవించమని చెబుతుంది. కానీ కరాళీ మాత్రం కచ్చితంగా నీ చేతులతోనే నాగమణిని నా చేతుల్లోకి తీసుకొచ్చేలా చేసుకుంటానని అంటుంది.

నవంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో... మోక్ష తల్లిపై ఆయన తండ్రి ఫుల్ ఫైర్ అవుతాడు. నీవల్లే కొడుకు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని.. పెళ్లి చేశాక తరచూ భార్యను వదిలేయామని చెప్పడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారుడ. ఈరోజుటి ఎపిసోడ్ లోనే సుబ్బును ఇంటి నుంచి వెళ్లగొడతారు. పంచమికి ఇష్టం లేకపోయినా మోక్ష పంపంచి వేయమన్నాడనే ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిపోమని చెబుతుంది. ఇలా సుబ్బు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. అలాగే భార్య గురించి తలుచుకుంటూ మోక్ష ఫుల్ భయపడిపోతూ ఉంటాడు.

నవంబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో.. అసలు ఆ పాము తనను ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పమంటూ మోక్ష.. పంచమని అడుగుతాడు. అందుకు పంచమి కూడా సమాధానం చెప్పింది. మీపై పగ తీర్చుకోవడం ఆ పాము ఖర్మ అంటూ మొదలెట్టింది. తన తల్లి అని చెప్పకుండా నాగరాణికి జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. అలా దెబ్బతిన్న పాము మిమ్మల్ని చంపాలని చూస్తోందని.. అందరిలాగా ఆ పాములు జాలి, దయా గుణం లేవని.. కచ్చితంగా పగ తీర్చుకుంటాయని వివరించింది. ఇన్నాళ్లూ తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తాను.. ఎందుకు చనిపోవాలంటూ మోక్ష ప్రశ్నించగా... పంచమి కూడా ఏడుస్తుంది.

నవంబర్ 11వ తేదీ ఎపిసోడ్ లో.. నాగ దేవత నాగులతో మాట్లాడుతుంది. పంచమి మానవ సంబంధాలకు రుణపడి నాగలోకానికి వచ్చేందుకు అయిష్టత చూపుతోందని.. ఆమెకు ఇక్కడకు రావడం ఏమాత్రం ఇష్టం లేదని వివరిస్తుంది. అది విన్న ఓ నాగరాజు.. యువరాణిని తానే స్వయంగా నాగ లోకానికి తీసుకు వస్తానని.. మోక్షను చంపేస్తామని చెబుతాడు. ఏం చేసైనా సరే ఆమెను తీసుకొచ్చి యువరాణి పీఠంపై కూర్చోబెడతానని అంటుంది. ఇలా ఈ వారం అద్భుతమైన ట్విస్టులతో ఈ సీరియల్ కొనసాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X