Naga Panchami: ఓ వైపు నాగదేవత, మరోవైపు దుష్ట శక్తులు.. వీటన్నిటినీ దాటి పంచమి వ్రతం పూర్తి చేస్తుందా?

Naga Panchami: అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతూ.. స్టార్ మాలో టీఆర్పీతో దూసుకెళ్తున్న సీరియల్ నాగ పంచమి. ఈ సీరియల్ లో దేవుళ్లు, దుష్టశక్తులతో.. నాగకన్యలను చూపిస్తుండడంతో ఆనేక మంది చాలా ఆసక్తిగా ఈ సీరియల్ చూస్తున్నారు. ఈ వారం నాగ పంచమి సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారం అంతా ఏం జరిగిద్దో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం.

అక్టోబర్ 9వ తేదీన మోక్ష, పంచమిలు తిరిగి ఇంటికి రావడం.. కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం మనం చూడొచ్చు. కానీ మోక్షను ఎలాగైనా బాగు చేసుకుంటానని.. భర్త బాగు కోసమే సుబ్రహ్మణ్య స్వామి గుట్టకు వెళ్లినట్లు చెబుతుంది. ఎలాగోలా ఇంట్లో చేరిన పంచమి వ్రతం చేయాలనుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు చెబుతుంది. కానీ వారు ఒప్పుకోరు. ఇక ఆ తర్వాత మోక్ష తల్లి.. నంబూద్రీకి ఫోన్ చేసి పంచమి, మోక్షలు ఇంటికి వచ్చినట్లు చెబుతుంది. వారిని ఇంట్లోనే ఉంచమని పంచమిని వెళ్లగొట్టకూడదని నంబూద్రీ మొక్ష తల్లికి సూచిస్తాడు. ఇలా కుటుంబ సభ్యులు అంతా కలిసి వినాయక చవితి పూజకు పూనుకుంటారు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2023 October 9th to October 14th Episode

పంచమి, మోక్షలతో పాటే వచ్చిన సుబ్బు కూడా వీరితో ఇంట్లోనే ఉంటాడు. వినాయక పూజ కోసం విగ్రహం తీసుకొచ్చినట్లు చెబుతాడు. భక్తి, శ్రద్ధలతో స్వామి వారిని మొక్కుకొని తీసుకొస్తూనే.. విగ్రహాన్ని తీసుకురాగలరని చెబుతాడు. కానీ ముందుగా వెళ్లిన చిత్ర వెళ్లి లేపగా స్వామి విగ్రహం లేవదు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంతా కలిసి లేపినా లేవదు. పంచమి ట్రై చేసినా అలాగే ఉంటుంది. చివరకు దేవుడిని ప్రార్థించి విగ్రహం లేపగా... పంచమికి లేస్తుంది. ఇలా కుటుంబ సభ్యులంతా కలిపి వినాయక పూజను పూర్తి చేస్తారు.

ఆ తర్వాత నంబూద్రీ.. మోక్షను తన అదుపులోకి తెచ్చుకోవాలని కరాళీకి సూచిస్తాడు. నాగమణిని పొందేందుకు తాను ఏదైనా చేస్తానని.. మోక్ష తాను ఆడించినట్లు ఆడేలా చేసుకుంటానని వివరిస్తుంది. మరోవైపు చిత్ర, జ్వాలలు కూడా పంచమిని ఎలాగైనా సరే ఇంట్లోంచి వెళ్లగొట్టాలని ప్లాన్ చేస్తుంటారు. కానీ పంచమి మాత్రం మోక్ష బాగు కోసం కచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేయాలనుకుంటుంది.ఇంట్లో వాళ్ల వద్దంటున్నా తాను వెళ్లి దీక్ష తీసుకొని వస్తుంది.

దీక్షమాలతో వచ్చిన పంచమిని చూసిన కుటుంబ సభ్యులు ఇంట్లోంచి వెళ్లిపోవాలని, కొత్త నాటకం ఆడుతున్నావని అవమానిస్తారు. కానీ వ్రతం పూర్తయ్యేవరకు తాను ఎక్కడికి వెళ్లనని, కచ్చితంగా భర్తను బాగు చేసుకుంటానని చెబుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి.. పాల కావిడి మోసుకెళ్తుంది. పంచమి మోసే పాలకావిడిని కింద దించేలా, కింద పడిపోయేలా చాలానే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ముందుగా మోక్ష.. పంచమి కోసం వెళ్తూ మెట్ల పైనుంచి పడిపోతాడు. తీవ్రంగా కలత చెందిన పంచమి.. తన కర్తవ్యాన్ని మర్చిపోకుండా పాలకావిడితో గుడికి బయలు దేరుతుంది.

మరోవైపు నాగదేవత కూడా పంచమిని తిరిగి నాగ లోకానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నేరుగా నాగ దేవతే భూమ్మీదకు వచ్చి పంచమిని తీసుకెళ్లాలని చూస్తోంది. ఇదిలా ఉండగా.. నంబూద్రీ, కరాళీల పూజలతో దుష్టశక్తులను పంపిస్తారు. పంచమి పాలకావిడి దించేందుకు ఆమె వెళ్లే దారిలో ముళ్ల కంపలను వేస్తారు. ఇక ఇక్కడి నుంచి ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X