Naga Panchami Weekly Roundup: ముద్దుపెట్టుకుంటేనే అలా.. ఇక పిల్లలు కావాలంటే మోక్ష చావు కన్పార్మ్!

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ.. సీరియల్ ను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా మలుస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 12వ తేదీ ఎపిసోడ్ లో.. జ్వాల శరీరంలోకి నంబూద్రీ ఆత్మ వచ్చి వెళ్తున్న విషయం తెలియక.. చిత్రతో పాటు వాళ్ల భర్తలు తెగ టెన్షన్ పడిపోతుంటారు. తను క్షణాల్లో మారిపోతుందేంటని.. ఇలా ఎందుకు చేస్తుందని ఆలోచిస్తూ ఉంటారు. కావాలనే అక్క ఇలా చేస్తుందని చిత్ర అనగా.. వదినను ఆస్పత్రిలో చూపించమని చిత్ర భర్త.. జ్వాల భర్తకు సూచిస్తాడు. ఇక ఆ తర్వాత మోక్షను ఎలాగైనా బలి ఇచ్చి తన శక్తులు తిరిగి పొందుతానని నంబూద్రీకి చెబుతూ ఉంటుంది.

 Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 February 12th to February 17th episode

ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్ లో.. సుబ్బ మోక్షకు జ్ఞానోపదేశం చేస్తాడు. అలాగే నువ్వు నీ ప్రేమ కోసం, నీ భార్య కోసం ఫైట్ చేయమంటూ వివరిస్తాడు. ఇదంతా విన్న మోక్ష సరేనని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత శబరి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. పంచమిని వైదేహి ఏం చేస్తుందో అని వర్రీ అవుతూ.. మోక్ష, పంచమిలు కలిసుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటుంది. కానీ వైదేహి మాత్రం ఎలాగోల మేఘన, మోక్షలకు పెళ్లి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది.

ఫిబ్రవరి 14వ తేదీ ఎపిసోడ్ లో.. చిత్ర, జ్వాలలు ఇద్దరూ తమ భర్తలతో కలిసి మాట్లాడుతూ కనిపిస్తారు. ఆస్తిని తామిద్దరే సగ భాగాలుగా, సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక ఈ ఎపిసోడ్ లోనే పంచమితో మోక్ష రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. తన మోహాన్ని ఆపుకోలేక ఆమెకు లిప్ లాక్ ఇస్తాడు. దీంతో తనలోని విషం మొక్ష గొంతులోకి వెళ్తుంది. దీంతో ఆయన నోటి నుంచి గొంతు వరకు నీలంగా మారుతుంది. పంచమి కన్నీరు పెడుతూనే ఉంటుంది.

ఫిబ్రవరి 15వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ ఇచ్చిన సమయం కళ్లా మోక్షను బలి ఇవ్వలేకపోయినందున ఆమె శక్తులను తిరిగి వెనక్కి ఇవ్వనని కరాళీ ఖరాఖండీగా చెప్పేస్తుంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావంటూ కరాళీ అంటున్నా వినకుండా.. నువ్వు నీ ప్రయత్నాలు ఆపాలని అంటుంది. నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను మాతా.. నా శక్తులు తిరిగి వచ్చేదాకా నేను మిమ్మల్ని ఆవాహనం చేసుకుంటూనే ఉంటానని శపథం చేస్తుంది.

ఫిబ్రవరి 16వ తేదీ ఎపిసోడ్ లో.. ఇక మోక్షను కాపాడేందుకు పంచమి ఫణీంద్రను కలుస్తుంది. వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా.. చిత్ర, జ్వాలలు చూస్తారు. ఆ తర్వాత పంచమి, ఫణీంద్ర పాము గదిలోకి రాగా... మోక్షను ఫణీంద్ర కాపాడతాడు. ఆ తర్వాత చిత్ర, జ్వాలలు వారి గది వద్దకు వచ్చి గొడవ పడతారు. నీ బాయ్ ఫ్రెండ్ కోసమే మోక్షకు ఏదో మత్తు ఇచ్చావు కదా అంటూ నిలదీస్తారు. ఈక్రమంలోనే మోక్ష వచ్చి వారితో గొడవ పడతాడు. జ్వాల పీక కూడా పట్టుకుంటాడు మోక్ష.

 Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 February 12th to February 17th episode

ఫిబ్రవరి 17వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి చాలా కోపంగా కరాళీ ఉంటున్న ఆశ్రమం వద్దకు వస్తుంది. అక్కడంతా వెతికినా కరాళీ కనిపించకపోగా... ఇంటికి బయలుదేరుతుంది. కానీ ఆలోపే కరాళీ తన మంత్రశక్తితో ఓ గరుడను పంపిస్తుంది. ఆ గరుడు పంచమిపై దాడికి దిగుతుంది. అయితే పంచమి ఆ తర్వాత ఏం చేస్తుందనేది తెలియాలంటే మాత్రం రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X