Naga Panchami Weekly Roundup: పంచమి, మోక్షల శోభనం ఫిక్స్.. ఒక్కటై కరాళీకి చెక్ పెట్టబోతున్న జంట!

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ.. సీరియల్ ను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా మలుస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 19వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి కరాళీకి వార్నింగ్ ఇస్తుంది. మోక్ష జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది. దీంతో కరాళీ పంచమిపైకి తోడేళ్లను పంపి దాడి చేయించే ప్రయత్నం చేస్తుంది. కానీ పంచమి వాటి నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి చివరకు ఓ చోట పడిపోగా.. సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటుంది. దీంతో స్వామి వారి ఆయుధం వచ్చి వాటి నుంచి కాపాడుతుంది.

 Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 February 19th to February 24th episode

ఫిబ్రవరి 20వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష, మేఘనల పెళ్లి వద్దని శబరి అంటుంది. వారి పెళ్లికి నేను అస్సలే ఒప్పుకోనని చెబుతుంది. అలాగే చిత్ర, జ్వాలలు కూడా మోక్ష, మేఘనల పెళ్లి వద్దని గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత పంచమి తన శత్రువులతో పోరాడే విధంగా సుబ్బు మోటివేట్ చేస్తాడు. వాళ్ల ఆటలు కట్టించి సమస్యలు తీర్చుకోవాలని చెబుతాడు. పంచమి కూడా కరాళీ ఆట కట్టిస్తానని అంటుంది.

ఫిబ్రవరి 21వ తేదీ ఎపిసోడ్ లో.. ఫణీంద్ర పామును జ్వాల రూపంలోకి వెళ్లిన నంబూద్రీ పట్టుకుని బంధిస్తాడు. చంపే ప్రయత్నం చేసి ఆ తర్వాత నేలకు వేసి కొడతాడు. ఆ తర్వాత ఫణీంద్ర మనిషిగా మారగా.. నువ్వు నంబూద్రీ కదా అంటాడు. నీ గురించి నాకు అంతా తెలుసని.. మేఘనే నీ చెల్లి కరాళీ అని పంచమికి చెబితే ఏం అవుతుందో ఆలోచించుకో అంటూ భయపెడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి విషయాలు ఒకరికి చెప్పకూడదని అంటాడు.

ఫిబ్రవరి 22వ తేదీ ఎపిసోడ్ లో.. మేఘనను, ఫణీంద్రను ఇంట్లోంచి పంపించి వేయమని మోక్ష పంచమితో చెబుతాడు. ఈవిషయాన్ని ఫణీంద్ర వినగా... నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే నాగలోకం తీసుకు వెళ్లగలనని అంటాడు. అంతలోనే మోక్ష వచ్చి తను నా భార్య అని నాగలోకంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. దీంతో ఫణీంద్ర మరింత కోపం తెచ్చుకుని నీ భర్తను చంపేస్తానంటూ పంచమిని బెదిరిస్తాడు.

ఫిబ్రవరి 23వ తేదీ ఎపిసోడ్ లో.. నేను నీకు చాలా సాయం చేశానని చెబుతనే.. నువ్వు నాగలోకం వస్తానని మాట ఇచ్చావని ఫణీంద్ర పంచమికి గుర్తు చేస్తాడు. నువ్వు ఇప్పుడు రాకపోతే చాలా తప్పు చేసినదానివి అవుతావు.. కచ్చితంగా నాగలోకం రావాల్సిందేనని అంటాడు. కచ్చితంగా నువ్వు వచ్చి తీరాలని అంటాడు. మోక్ష మాత్రం మొండిగా పంచమికి నాగలోకం రావడం ఇష్టం లేదని అంటాడు. ఇలా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

 Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 February 19th to February 24th episode

ఫిబ్రవరి 24వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లడం.. స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. నాకు నాగలోకం కూడా శత్రువుగా మారింది.. నువ్వే నా భర్తను కాపాడాలి స్వామి అంటూ కోరుతుంది. ఫణీంద్ర కూడా తన భర్తను చంపుతానని బెదిరిస్తున్నాడని, అలాగే కరాళీ కూడా ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదని ఆవేదన చెందుతుంది. కళ్లు మూసుకోగానే ఆమెపై నెమిలి పించం పడుతుంది. ఆ తర్వాత సుబ్బు వచ్చి పంచమితో మాట్లాడతాడు. నీకు ఆ స్వామి వారే కావాలని ఈ పింఛాన్ని ఇచ్చినట్లు ఉన్నారని సుబ్బు చెబుతాడు. దీన్ని దాచుకో ఎలాంటి సమస్యా ఉండదని వివరిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X