Naga Panchami Weekly Roundup: మోక్ష, మేఘనలను ఒక్కటి చేయబోతున్న పంచమి.. ఏం జరగబోతుంది?
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ.. సీరియల్ ను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా మలుస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 26వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ తన మంత్రశక్తితో కంత్రీ, తంత్రీలను పిలుస్తుంది. వారిని మోక్ష ఇంట్లోకి చేరి పంచమిని ఇబ్బంది పెట్టాలని చెబుతుంది. ఇల్లంతా హంగామా చేసి ఎప్పుడూ గొడవలయ్యేలా చేయాలని చెప్పగా... ఆ ఇంట్లో చిన్న పిల్లాడు ఉంటాడని మాకు భయం అని చెబుతారు. కానీ కరాళీ ఇప్పుడు అతడు లేడని చెప్పగానే వెళ్లేందుకు సిద్ధం అవుతారు.

ఫిబ్రవరి 27వ తేదీ ఎపిసోడ్ లో.. కంత్రీ, తంత్రీలు చేసే రచ్చ చూపి పంచమి చాలా భయపడిపోతుంది. ముఖ్యంగా పంచమికి మాత్రమే కనపించేలా మంటలు రేపడం, అన్నంలో విషం కలపడం వంటివి చూపిస్తారు. ఇదంతా చూసిన పంచమి భయపడగా... సుబ్బు ఇచ్చిన నెమలి ఈకతో ఈ సమస్యకు చెక్ పెడతారు. సుబ్రహ్మణ్య స్వామి తన వెంట ఉన్నాడని పంచమి అనగా.. మోక్ష ఇక భయపడకు అంటూ వివరిస్తాడు.
ఫిబ్రవరి 28వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ తన అన్న నంబూద్రీ ఆత్మను ఆవాహనం చేసుకుంటుంది. తాను మోక్షకు దగ్గర కావాలంటే పంచమి ఇంట్లో ఉండకూడదని.. ముఖ్యంగా బతికి ఉండకూడదని చెబుతుంది. తాను అనుకున్నది జరగాలంటే పంచమిని చంపేయాలని ఆ బాధ్యత నీదేనంటూ అన్న నంబూద్రీకి వివరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగినా తాను చూసుకుంటానని అంటుంది. నంబూద్రీ కూడా పంచమిని చంపేందుకు ఓకే చెబుతాడు.
ఫిబ్రవరి 29వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి నాగదేవతను స్మరిస్తూ కనిపిస్తుంది. అప్పుడే ఫణీంద్ర వచ్చి నీకు నాగదేవత ప్రత్యక్షం కాదని.. నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నాగలోకం రావట్లేదు కాబట్టి అమ్మవారు నీకు శక్తులు ఇవ్వరని చెబుతాడు. అప్పుడే మోక్ష వచ్చి పంచమి తన భార్య అని నాగలోకం రాదని చెబుతాడు. దీంతో కోపోద్రిక్తుడు అయిన ఫణీంద్ర.. మోక్షను ఈ రాత్రికే చంపి పంచమిని నాగలోకం తీసుకెళ్తానని అంటాడు.
మార్చి 1వ తేదీ ఎపిసోడ్ లో.. నంబూద్రీ ఆత్మ జ్వాల శరీరంలోకి వెళ్లి పంచమిని చంపే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కంత్రీ, తంత్రీలు తలుపు కొట్టగా బయటకు వచ్చిన పంచమి పీక పట్టుకుంటుంది జ్వాల. మరోవైపు ఫణీంద్ర.. పాముగా మారి మోక్షను చంపే ప్రయత్నం చేస్తాడు. కాటు వేసేందుకు వెళ్లగానే.. సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం వచ్చి ఆపుతుంది. ఆ తర్వాత సుబ్బు వచ్చి ఫణీంద్ర చేసిన తప్పును వివరిస్తాడు. పంచమి జోలికి రాకుండా చేస్తాడు.

మార్చి 2వ తేదీ ఎపిసోడ్ లో.. నిద్రలో ఉన్న మోక్షను లేచేలా చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. నిద్ర లేచిన మోక్ష పక్కన పంచమి లేకపోవడంతో కిందకు రాగా.. జ్వాల పంచమిని చంపుతూ కనిపిస్తుంది. వెంటనే మోక్ష జ్వాలను తోసేసి గట్టిగా అరుస్తాడు. ఇలా అంతా అక్కడకు రాగా పంచమి ప్రాణాలు సేవ్ అవుతాయి. ఆ తర్వాత మోక్ష జ్వాలను బెదిరించడం.. మీరు సమస్యలో ఉన్నారని పంచమి జ్వాలకు చెప్పడం చూపిస్తారు.


Click it and Unblock the Notifications











