Naga Panchami Weekly Roundup: పంచమిని మోసం చేస్తున్న ఫణీంద్ర.. కరాళీ మోక్షను బలిస్తుందా?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ.. సీరియల్ ను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా మలుస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 5వ తేదీ ఎపిసోడ్ లో.. మేఘన రూపంలో ఉన్న కరాళీ.. పంచమి, ఫణీంద్రలను మరోసారి మోసం చేస్తుంది. ముఖ్యంగా తన తల్లిదండ్రులను కరాళీ రాళ్లుగా మార్చేసి తనతో ఈ నాటకం ఆడించిందని నమ్మిస్తుంది. అలాగే మోక్షను పెళ్లి చేసుకుని అతడిని తనకు అప్పగించాలని చెబుతుందని వివరిస్తుంది. ఇదంతా నమ్మిన పంచమి మోక్షను నువ్వే పెళ్లి చేసుకోవాలంటూ కోరుతుంది. బతిమాలుతుంది. ఇందుకు మేఘన ఓకే కూడా చెబుతుంది.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 February 5th to February 3rd episode

ఫిబ్రవరి 6వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష మేఘనను పెళ్లి చేసుకోవడానికి అస్సలే ఒప్పుకోడు. కానీ పంచమి ఇంటికి వచ్చాకా ఆమె ఒప్పిస్తుంది. మేఘన నాగకన్య కాదని.. మీరు ఆమెనే పెళ్లి చేసుకోవాలని అంటుంది. దానికి మోక్ష వద్దని వారిస్తున్నా వినకుండా.. నేను మీతో ఉండను కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అంటుంది. అయితే నువ్వే ఇక్కడ ఉండి పెళ్లి పనులు చూసుకోవాలని.. పెళ్లి దగ్గరుండి చేయాలని అంటాడు. అలా అయితేనే తాను మేఘనను పెళ్లి చేసుకుంటానని అంటాడు. అందుకు పంచమి కూడా ఒప్పుకుంటుంది.

ఫిబ్రవరి 7వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ మహాంకాళిని ప్రసన్నం చేసుకుంటుంది. ప్రత్యక్షం అయిన మహాంకాళి మేఘనను విపరీతంగా భయపెడుతుంది. నువ్వు చేసే పని సరైన కాదని.. దానికి దైవం కూడా సాయం చేయదని అంటుంది. నువ్వు ఈ పని చేయలేవు అంటూ చెప్పగా.. మేఘన భయపడిపోతుంది. ఆ తర్వాత తన అన్న నంబూద్రీ ఆత్మను ఆవాహనం చేసుకొని.. మహాంకాళి తనను భయపెడుతుందని.. నువ్వే నాకు అండగా ఉండాలంటూ కోరుతుంది.

ఫిబ్రవరి 8వ తేదీ ఎపిసోడ్ లో.. ఫణీంద్ర నాగలోకం వెళ్లి నాగ దేవతను దర్శించుకుంటాడు. ఈ క్రమంలోనే నాగ దేవత.. యువరాణి అవసరం నాగలోకానికి చాలా ఉందని.. తను ఎప్పుడు వస్తుందని అడుగుతుంది. మోక్ష పెళ్లి కాగానే వస్తుందని ఫణీంద్ర చెప్పగా.. అందుకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నిస్తుంది. 15 రోజుల్లో పెళ్లి అయిపోతుందని ఫణీంద్ర వివరించగా.. యువరాణికి ఎట్టి పరిస్థితుల్లో తన అవసరం నాగ లోకానికి ఉందని తెలియకూడదని అంటుంది.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 February 5th to February 3rd episode

ఫిబ్రవరి 9వ తేదీ ఎపిసోడ్ లో.. ఫణీంద్ర పాముగా మారి పంచమితో పాటు మోక్ష ఇంట్లో ఉంటాడు. ఈ క్రమంలోనే మేఘన రూపంలో ఉన్న కరాళీ.. జ్వాలలోకి ఆవహించిన తన అన్న నంబూద్రీ ఆత్మతో మాట్లాడుతూ కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న ఫణీంద్ర ఈ విషయాలన్నింటినీ విని వారి సీక్రెట్ ను తెలుసుకుంటాడు. ఈక్రమంలోనే మేఘన, జ్వాలలు అతడిని చంపాలని వస్తారు. కానీ అతను మాత్రం అది తెలిస్తే పంచమి నాగలోకం రాదని భావించి... ఆ సీక్రెట్ ను చెప్పకుండా ఉంటాడు.

ఫిబ్రవరి 10వ తేదీ ఎపిసోడ్ లో.. శబరి.. వైదేహితో గొడవ పడుతుంది. ముఖ్యంగా తన మనవడు మోక్ష పెళ్లిని మేఘనతో చేయడానికి అస్సలే వీళ్లేదని గొడవ పడతుంది. కానీ అదంతా అర్ధం చేసుకోని వైదేహి మరింత పిచ్చిగా వ్యవహరిస్తూ... అందరిపై ఫైర్ అవుతుంది. ఇదంతా చూసిన పంచమి.. వైదేహికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇలా చేయడానికి అస్సలే వీళ్లేదంటూ అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X