Naga Panchami Weekly Roundup: చంద్రకాంత మొక్కతో మోక్షను కాపాడిన మేఘన.. షాక్‌లో ఫణీంద్ర!

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను అద్భుతంగా మలుస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. జనవరి 15వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 15వ తేదీ ఎపిసోడ్ లో.. తాను ప్రాణాలో కోల్పోతే.. ఆ తర్వాత నువ్వు నీకు నచ్చినట్లుగా బతకమంటూ మోక్ష పంచమితో చెబుతాడు. మరోవైపు మేఘన రూపంలో ఉన్న కరాళీ.. మహాకాళిని ఆవాహనం చేసుకుంటుంది. నాగలోకం వెళ్లేందుకు పంచమిలా మార్చమని.. ఆ ఒక్క వరం ఇస్తే తన కోరికి తీర్చుకుంటానని అంటుంది. అలా అమ్మావారితో పంచమిలా తన రూపం మార్చుకుంటుంది.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 15th to January 20th episode

జనవరి 16వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి రూపంలోకి మారిన కరాళీ ఫణీంద్ర ఒంటరిగా ఉన్న సమయం చూసి అక్కడకు వస్తుంది. తానే పంచమిని అని నమ్మేలా చేసి నాగలోకం వెళ్లేందుకు చెబుతానన్న మంత్రం చెప్పమని అంటుంది. అలా ఫణీంద్ర నుంచి మంత్రం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇది గుర్తించని ఫణీంద్ర పంచమికే తాను మంత్రం చెప్పినట్లు భావిస్తాడు.

జనవరి 17వ తేదీ ఎపిసోడ్ లో.. తాము అమలు చేయాలనుకున్న ప్లాన్ ప్రకారం.. మోక్షను పడుకోబెడతారు. ఇక ఆలస్యం చేయడం సబబు కాదని.. వెంటనే పాములా మారి మోక్షను కాటేయమని పంచమికి ఫణీంద్ర చెబుతాడు. ఆ తర్వాత పంచమి మోక్షను కాటేస్తుంది. వెంటనే మంత్రం చెప్పమని అడుగుతుంది. అప్పుడే చెప్పాను కదా అని ఫణీంద్ర అనగా.. కావాలనే నువ్వు నన్ను మోసం చేస్తున్నావంటూ ఫైర్ అవుతుంది.

జనవరి 18వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి రూపంలోకి మారిన కరాళీ.. ఫణీంద్ర చెప్పిన మంత్రంతో నాగలోకం వెళ్తుంది. నాగమణిని తీసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ అక్కడ ఉన్న ఐదు తలల పాముకు భయపడి తన ప్రయత్నాన్ని మానుకుంటుంది. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చి నాగచంద్రకాంత మొక్కను తీసుకుంటుంది. మంత్రం చదివి మరీ తనకు ఏం కాకుండా బయటకు రాగ ఓ నాగకన్య కంట్లో పడుతుంది. నాగదేవతకు వద్దకు వెళ్తామంటూ అనగా.. మంత్రం చదివి అక్కడి నుంచి మాయం అవుతుంది.

జనవరి 19వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష నానమ్మ శభరి.. తన భర్త ఫొటో కింద పడడం చూసి తన మనవడికి ఏదో ఆపద రాబోతుందని అంటుంది. గతంలో కూడా ఇలాగే జరగ్గా తన భర్త చనిపోయాడని అంటుంది. ముఖ్యంగా తన భర్త కట్టిన ఓ ముడుపు పాడైపోయిన మరుసటి రోజో ఆయన చనిపోయారని.. తన మనవడి కోసం కూడా ముడుపు కట్టానని అది తీసుకు రమ్మని చెబుతుంది. అలా చిత్ర, జ్వాలలు ఆ ముడుపు తీసుకురాగా.. అది కుళ్లిపోయి ఉండడం చూసి కుటుంబ సభ్యులంతా విలపిస్తారు.

జనవరి 20వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి రూపంలో ఉన్న కరాళీ మరోసారి మహాకాళిని ఆవాహనం చేసుకుంటుంది. నాగమణి కళ్ల ముందే ఉన్నా తీసుకురాలేకపోయావు ఆ నాగ చంద్రకాంత మొక్కతో మీ అన్నయ్యను నీవు బతికించుకోలేవని అమ్మవారు అంటుంది. అందుకోసం నీ శక్తులన్నీ పోగొట్టుకున్నావు ఇప్పుడెందుకు పిలిచావనగా.. తాను మేఘన రూపంలోకి మారాలని అడుగుతుంది. అలా మరోసారి మేఘనగా మారి నాగ చంద్రకాంత మొక్కతో మోక్షను కాపాడుతుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X