Naga Panchami Weekly Roundup: మోక్ష, మేఘనలకు పెళ్లి.. వైదేహిని ఆపి భర్తను పంచమి కాపాడుకోగలదా?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను అద్భుతంగా మలుస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. జనవరి 22వ తేదీ నుంచి జనవరి 27వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 22వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమియే నాగలోకం వెళ్లి నాగ చంద్రకాంత మొక్కను తెచ్చిందనుకుని ఫణీంద్ర, పంచమిలకు శాపం విధిస్తుంది. తనకు తెలియకుండా వచ్చి.. నాగలోకాన్ని మోసం చేసినందుకు వారు నాగలోకం రాకుండా శక్తులన్నీ తిరిగి తీసేసుకుంటుంది. అలాగే మీరు భూలోకంలోనే ఉండి పౌర్ణమి రోజు పాములగా మారినప్పుడు జనాలు చంపేస్తారని శాపం విధిస్తుంది.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 22nd to January 27th episode

జనవరి 23వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష ప్రాణాలతో బయటపడడంతో పంచమి తెగ సంబురపడిపోతుంది. కానీ ఇకపై అతడి జీవితంలోకి తాను వెళ్లకూడదని వెళ్తే.. మోక్ష హాయిగా, పిల్లాపాపలతో సంతోషంగా ఉండలేడని భావిస్తుంది. అందుకే నేను మీతో ఇంటికి రానని.. తేల్చి చెబుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఫోర్స్ చేయడంతో పంచమిని అక్కడే వదిలేసి మోక్ష ఇంటికి వెళ్లిపోతాడు. మరోవైపు పంచమి మాత్రం కన్నీరు పెట్టుకుంటూ మోక్ష గురించి బాధ పడుతూ ఉంటుంది.

జనవరి 24వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి నువ్వు మోక్షతో ఉండడమే సబబు అని.. మీది స్వచ్ఛమైన ప్రేమ అంటూ సుబ్బు పంచమికి కళలో కనిపించి చెబుతాడు. శారీరక సుఖం అనేది పువ్వు లాంటిది అని, ప్రేమ మకరందం లాంటిది అని చెబుతాడు. కానీ పంచమి మాత్రం అలా జరగకూడదని కోరుకుంటూ నిద్రలోంచి ఉలిక్కి పడి లేస్తుంది. తల్లి వెంటనే లేచి పంచమికి సర్ది చెబుతూ నెమ్మదించేలా చేస్తుంది.

జనవరి 25వ తేదీ ఎపిసోడ్ లో.. ఫణీంద్ర ఒంటికాలిపై నిలబడి నాగదేవతను ప్రసన్నం చేసుకోగా.. దేవత ప్రత్యక్షం అయి వరం ఇస్తుంది. శక్తులను తిరిగి ప్రసాదిస్తుంది. కానీ మళ్లీ తప్పు చేస్తే కఠిన శిక్ష ఉంటుందని హెచ్చరిస్తుంది. వెంటనే ఫణీంద్ర పాములా మారి పంచమి వద్దకు వెళ్తాడు. అదే విషయాన్ని చెబుతాడు. మేఘనే కరాళీ అని అర్థం చేసుకుని.. తనను నాగ దేవత ముందుకు తీసుకెళ్లి ఆ తప్పు చేసింది ఆమే అని చెప్పేలా చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అలా ఇద్దరూ కలిసి పట్నం బయలు దేరుతారు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 22nd to January 27th episode

జనవరి 26వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమిని మర్చిపోవాలంటూ వైదేహి మోక్షకు చెబుతుంది. తను నా ప్రాణం అని పంచమిని మర్చిపోయే సమస్యే లేదని చెబుతాడు. కానీ వైదేహి మాత్రం పంచమి ఇంటికి వచ్చేందుకు తాను ఒప్పుకోనని అంటంది. పంచమిని నువ్వు పూర్తిగా మర్చిపోవాలని సూచిస్తుంది. కానీ మోక్ష మాత్రం పంచమియే తన ప్రాణం అని కుటుంబ సభ్యులు అందరికీ తేల్చి చెబుతాడు. మీరంతా తనని మోక్షను మర్చిపోతే నేను పంచమిని మర్చిపోతానంటూ చెబుతాడు. 4

జనవరి 27వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష తల్లి వైదేహి.. తన కొడుక్కు పంచమితో విడాకులు చేయించాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. అలాగే మళ్లీ మోక్షకు పెళ్లి చేయాలని.. పదీ పదిహేను రోజుల్లోనే ఆ తంతు పూర్తి కావాలని అనుకుంటుంది. మరోవైపు తన పెళ్లి మేఘనతో చేస్తే బాగుండనే ఆలోచన వైదేహి మనసులో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. పంచమి వీరిని అడ్డుకోగలదా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X