Naga Panchami Weekly Roundup: నా భర్తను నువ్వే పెళ్లి చేసుకో.. కరాళీ మాయలో పంచమి.. మోక్ష బలి తప్పదా?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను అద్భుతంగా మలుస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 29వ తేదీ ఎపిసోడ్ లో.. నాగదేవత కళలో ఆదిశేషుడు కనిపిస్తాడు. యువరాణితో నాగమణికి పూజ చేయించాలని లేని పక్షంలో నాగలోకమే అంధకారం అవుతుందని చెబుతాడు. వీలయినంత త్వరగా ఈ పూజ చేయించాలని లేకపోతే ఎవరూ ఊహించని సమస్యలు వస్తాయని పేర్కొంటాడు. ఇదంతా విన్న నాగ దేవత ఫణీంద్ర వద్ద ప్రత్యక్షమై యువరాణిని నాగలోకం తీసుకు రావాల్సిన బాధ్యత నీదేనని అంటుంది.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 29th to February 3rd episode

జనవరి 30వ తేదీ ఎపిసోడ్ లో.. నాగదేవత తనకు కనిపించి పంచమి నాగలోకం తీసుకు రావాలని ఫణీంద్రకు ఆజ్ఞాపిస్తుంది. తాను ఆ పనిలోనే ఉన్నానని.. కరాళీ అనే మంత్రగత్తే నాగలోకం వచ్చిందని చెబుతాడు. ఆ నింద పోగొట్టుకుని త్వరలోనే మేము నాగలోకం వస్తామని అంటాడు. తప్పొప్పుల గురించి ఆలోచించే సమయం లేదు.. త్వరగా మీరు నాగలోకం రండి అంటూ నాగ దేవత చెబుతుంది.

జనవరి 31వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష మేఘననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ముందుగా ఆ విషయాన్ని పంచమికి చెప్పగా.. తను కూడా ఓ నాగకన్య పెళ్లి వద్దని అంటుంది. కానీ అదంతా విన్న మోక్ష మాత్రం కచ్చితంగా నేను మేఘననే పెళ్లి చేసుకుంటానని పట్టుబడతాడు. నువ్వు వచ్చి పెళ్లి ఆపకపోతే నేను ప్రాణాలు తీసుకుంటానని.. మేఘనతో కలిస్తే చాలు చనిపోతానని అంటాడు.

ఫిబ్రవరి 1వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి ఫణీంద్ర కోసం నాగ సాధువు వద్దకు వెళ్తుంది. ఫణీంద్ర నన్ను నాగలోకం తీసుకు వెళ్లాలని చూస్తున్నాడని అంటుంది. ఆ శివయ్య నీకు రెండు లోకాలతో రుణం పెట్టాడు.. చివరకు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు పంచమి.. నాగలోకం వెళ్లాలా వద్దా అన్నది నీ చేతిలో కూడా లేదంటూ వివరిస్తాడు. అతడి మాటలు విన్న పంచమి ముందుగా కరాళీ ఆటలు కట్టించి మోక్షను కాడాపాకుంటానని అంటుంది. అందుకో ఫణీంద్ర కూడా సాయం చేస్తానని చెబుతాడు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 29th to February 3rd episode

ఫిబ్రవరి 2వ తేదీ ఎపిసోడ్ లో.. చిత్ర, జ్వాలల తమ భర్తలను రెచ్చగొడతాడు. మేఘనతో మోక్ష పెళ్లి ఆపేలా ప్లాన్ చేస్తారు. ఈక్రంమలోనే వారి భర్తలు ఇద్దరూ ఇంట్లో గొడవ చేస్తుండగా.. నంబూద్రీ ఆత్మ జ్వాల శరీరంలోకి వెళ్తుంది. అలా ఆమె మధ్యలోకి వెళ్లి అందరిపై కోప్పడి.. మేఘన పెళ్లిని తానే స్వయంగా మోక్షతో జరిపిస్తానని హామీ ఇస్తుంది. ఇదంతా కళ్లారా చూసిన మోక్ష అన్నయ్యలతో పాటు జ్వాల తోడి కోడలు చిత్ర కూడా షాక్ కు గురవుతుంది.

ఫిబ్రవరి 3వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి, ఫణీంద్రలు ఇద్దరూ కలిసి నేఘనను కలిసేందుకు పట్నం వస్తారు. అప్పటికే మేఘన ఏడుస్తూ ఓ చోట కూర్చుని కనిపించి కళ్లబొల్లి మాటలు చెబుతుంది. మంత్రశక్తులు నేర్పిస్తానని చెప్పి కరాళీ ఇక్కడకు తీసుకు వచ్చి తనను ఇందులో ఇరికించిందని అంటుంది. ఇదంతా తెలుసుకున్న పంచమి.. నువ్వే మోక్ష బాబును పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. నీతో పెళ్లి జరిగితే ఆయన సంతోషంగా ఉంటాడని అంటుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X