మోక్షను కాటేసింది పంచమా, కరాళీయా.. నాగమణిని ఎవరు దక్కించుకోబోతున్నారు?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను అద్భుతంగా మలుస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. జనవరి 8వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 8వ తేదీ ఎపిసోడ్ లో.. ఫణీంద్ర.. మోక్షను కాటేయమని పంచమికి చెబుతాడు. ఆ తర్వాత నాగలోకం వెళ్లి నాగమణిని తీసుకువచ్చి భర్త ప్రాణాలు కాపాడుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ పంచమి మాత్రం భర్తను కాటేయలేక తెగ ఇబ్బంది పడుతుంది. అలా ఆరోజును నాశనం చేసుకుంటుంది. మేఘన, ఫణీంద్రలు ఎంత కాటేయమని చెప్పినా తన వల్ల కాదు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 8th to January 13th episode

జనవరి 9వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి, మోక్షలు ప్లాన్ ప్రకారం నాగులవరం వెళ్తారు. అయితే మేఘన కూడా ఏదో పని ఉందని ఇంట్లో చెప్పి బయటకు రాగానే.. చిత్ర, జ్వాలలు.. మేఘన గది వెతకాలనుకుంటారు. ఈక్రమంలోనే వారికి ఓ చిన్న మూట దొరుకుతుంది. అది గుర్తించిన కరాళీ తన మంత్రశక్తితో వారిలోకి దెయ్యాన్ని పంపిస్తుంది. ఇలా చిత్ర, జ్వాలలు ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటారు. చివరకు బాగైపోతారు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 8th to January 13th episode

జనవరి 10 తేదీ ఎపిసోడ్ లో.. నాగదేవతకు యువరాజు ఫణీంద్రపై అనుమానం వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు పంచమిని నాగలోకం తీసుకు వస్తానని.. తీసుకురాకపోవడంతో నాగులందరినీ పిలచి ఫణీంద్ర భూలోకంలో ఏ చేస్తున్నాడో కనుక్కోవాలని అంటుంది. ఆ తర్వాత కరాళీ తన అన్న నంబూద్రీ వద్దకు వెళ్లి అసలు విషయం చెబుతుంది. మరికొన్ని రోజుల్లో తాను నాగమణిని సంపాదించబోతున్నట్లు వివరిస్తుంది.

జనవరి 11వ తేదీ ఎపిసోడ్ లో.. నాగసాధువు వద్దకు వెళ్లిన మోక్ష, పంచమిలకు తనకు ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా అనిపించట్లేదని చెబుతాడు. ముఖ్యంగా నాగమణి ప్రాణాలు కాపాడాదే అయినా నాగలోకం నుంచి దాన్ని తీసుకు రావడం చాలా కష్టం అని వివరిస్తాడు. ఇలా పంచమి పూర్తిగా అయోమయంలో పడుతుంది. మరి ఫణీంద్ర తనకు సాయం ఎందుకు చేయాలనుకుంటున్నాడో అని అనుమానం మొదలు అవుతుంది.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 8th to January 13th episode

జనవరి 12వ తేదీ ఎపిసోడ్ లో.. నాగమణిని తాను పట్టుకున్నా ఏం కాకుండా వరం కావాలని మహాకాళిని ఆవాహనం చేసుకుంటుంది కరాళీ. ఇలా కరాళీ ప్రత్యక్షం అవ్వడం.. మహాకాళి వరం ఇవ్వడం మనం చూడవచ్చు. ఆ తర్వాత తన అన్న నంబూద్రీని ఎలాగైనా సరే కాపాడుకోవాలని అందుకోసం తనలో తానే పలు రకాల ప్లాన్ లు వేసుకుంటుంది.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 January 8th to January 13th episode

జనవరి 13వ తేదీ ఎపిసోడ్ లో.. మనసులో ఒకటి పెట్టుకుని పైకి పంచమికి సాయం చేస్తానంటూ నమ్మిస్తూ వస్తున్న ఫణీంద్రకు సుబ్బు పాము రూపంలో కనిపించి భయపెడతాడు. ఆ తర్వాత సుబ్బుగా మారి తన భక్తురాలికి నమ్మకద్రోహం చేస్తే ఊరుకోనని వివరిస్తాడు. అలా ద్రోహం చేస్తే అదే పెనుభూతమై నీ ప్రాణాలు తీస్తుందంటూ ఫణీంద్రకు వివరిస్తాడు. దీని తర్వాత అద్భుతమైన ట్విస్ట్ లు చూపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X