Naga Panchami Weekly Roundup: ఒక్కటైన మేఘన, ఫణీంద్రలు.. త్వరగా పెళ్లయ్యేందుకు కరాళీ కొత్త ప్లాన్!

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ.. సీరియల్ ను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా మలుస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మార్చి 4వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి 4వ తేదీ ఎపిసోడ్ లో.. మోక్ష, మేఘనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వైదేహి కాస్త కుదుట పడుతుంది. అప్పటి వరకు వారి పెళ్లి జరుగుతుందో లేదోనని ఆవేదనలో ఉన్న ఆమెకు అతడు చెప్పిన సమాధానంతో సంబురపడిపోతుంది. ఆ తర్వాత సుబ్బు వచ్చి మోక్షతో మాట్లాడతాడు. ముఖ్యంగా నువ్వు పంచమిని సరిగ్గా అర్థం చేసుకోలేవంటూ చెబుతాడు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 March 4th to March 9th episode

మార్చి 5వ తేదీ ఎపిసోడ్ లో.. నిశ్చితార్థం జరిగిన వెంటనే మోక్షను పెళ్లి చేసుకుని.. అతడిని బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు మీనాక్షి, శబరిలు.. మోక్ష, మేఘనలకు పెళ్లి జరగకూడదంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తారు. అలాగే పంచమికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అదంతూ చూసిన వైదేహి వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ వీరి పంచమి మాత్రం తానే దగ్గరుండి మరీ మోక్ష, మేఘనలకు నిశ్చితార్థం జరిపిస్తుంది.

మార్చి 6వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమియే దగ్గరుండి మోక్ష, మేఘనలకు నిశ్చితార్థం జరిపిస్తుంది. పైకి సంతోషంగా కనిపిస్తున్నా లోలోపల బాధతో కుమిలిపోతుంది. ముఖ్యంగా వాళ్లు ఉంగరాలు మార్చుకోగానే కన్నీటితో వెనుదిరుగుతుంది. ఆ తర్వాత పంచమి ఫణీంద్ర వద్దకు వెళ్లి సారీ చెబుతుంది. మరోవైపు ఫణీంద్ర కూడా పంచమికి సారీ చెబుతాడు. మోక్ష, మేఘనల పెళ్లి కాగానే తాను నాగలోకం వచ్చేస్తానని వివరిస్తుంది. ఫణీంద్ర కూడా నీ ఇష్టం ఉన్నప్పుడే రా అని చెబుతాడు.

మార్చి 7వ తేదీ ఎపిసోడ్ లో.. ఫణీంద్ర నాగలోకం వెళ్లి నాగదేవతను దర్శించుకుంటాడు. పంచమియే నేరుగా నాగలోకం వస్తానని చెప్పిందని అంటాడు. దీనికి నాగదేవత నీ గురించి నాకు తెలుసు ఫణీంద్ర.. నీవు అనుకున్నది సాధిస్తావు యువరాణిని నాగలోకం తీసుకు వస్తావని అంటుంది. మోక్ష పెళ్లి కాగానే వస్తామని చెప్పగా.. ముందే కబురు పంపితే యువరాణి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తానని... ఘన స్వాగతం పలుకుతానని నాగదేవత అంటుంది.

మార్చి 8వ తేదీ ఎపిసోడ్ లో.. చిత్ర మరోసారి జ్వాల బిహేవియర్ గురించి ఆమెకు చెబుతుంది. భర్త, బావ ఎదురుగానే జ్వాల గురించి మాట్లాడగా.. ఆమె కూడా తనకు తెలియకుండా తనలోకి ఏదో శక్తి వస్తుందనిపిస్తుంది అంటుంది. మరోవైపు పంచమి.. ఫణీంద్రను కరాళీ వద్దకు తీసుకు వెళ్తానంటుంది. నువ్వు ఇప్పడి వరకు చూడలేదు కదా.. నేను అక్కడకు వెళ్తున్నాను నువ్వు వస్తావా అనగా.. వస్తానంటాడు. ఇలా వీరిద్దరూ కరాళీ ఆశ్రమానికి బయలు దేరుతారు.

Naga Panchami Telugu Serial Weekly Roundup 2024 March 4th to March 9th episode

మార్చి 9వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ ఆశ్రమంలో పంచమి, ఫణీంద్రలు మేఘనను చూస్తారు. నువ్వు ఇక్కడ ఏంటని అడుగుతుంది. ఎంత పిలిచినా కరాళీ రావట్లేదు, చస్తానని బెదిరిస్తేనైనా వస్తుందని కత్తి మెడపై పెట్టుకున్నాని అంటుంది. తన తల్లిదండ్రులు తన పెళ్లి చూడాలని అక్కడకు వచ్చానని.. పంచమికి చెబుతుంది. ఆ తర్వాత ఫణీంద్ర, మేఘనలు మాట్లాడుకుని.. త్వరగా పెళ్లయ్యేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X