Naga Panchami Weekly Roundup: పంచమితో మోక్ష గొడవ.. నాగలోకం వెళ్లిపోతుందా, భర్తను కాపాడుతుందా?
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో సీరియల్ ను రసవత్తరంగా మారుస్తున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా సీరియల్ ను మరింత అద్భుతంగా మార్చడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. అయితే ఈ వారం కూడా ఈ సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో.. కరాళీ ఫణీంద్రతో కచ్చితంగా పంచమికి సాయం చేయాలని చెబుతుంది. మాట తప్పకుండా నాగమణి తీసుకు వచ్చి అతడిని కాపాడాలని అప్పుడు తను మిమ్మల్ని నమ్మి నాగలోకం వెళ్లాక పెళ్లి చేసుకుంటుందని అంటుంది. కానీ ఫణీంద్ర మాత్రం నాగమణి తీసుకు వచ్చే ఆలోచనలో ఉండడు. కేవలం పంచమిని నాగలోకం తీసుకెళ్లాలని మాత్రమే ఆలోచిస్తాడు.

డిసెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి తల్లి నాగ సాధువు వద్దకు వెళ్లి తన అల్లుడిని బతికించుకునేందుకు మార్గం చెప్పమని బతిమాలుతుంది. ఈక్రమంలోనే సాధువు దివ్య దృష్టితో చూసి.. నాగ లోకంలో ఉన్న చంద్రకాంత మొక్కును తీసుకు వస్తే మోక్షను బతికించవచ్చని చెబుతాడు. అది కేవలం నీటిలోనే దొరుకుతుందని.. అదే ఇష్టరూప నాగ జాతి పాముల కాటుకు విరుగుడు అని వివరిస్తారు.
డిసెంబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో.. చంద్రకాంత మొక్క గురించి తెలుసుకున్న పంచమి ఫణీంద్రకు ఆ విషయాన్ని చెబుతుంది. తాను నాగలోకం వచ్చేందుకు భర్త ఒప్పుకోవట్లేదని.. శత్రువులు నీకెందుకు సాయం చేస్తున్నారని అడిగాడని అంటుంది. దీంతో ఫణీంద్ర నువ్వు నాగలోకం వచ్చాకే చంద్రకాంత మొక్క తెద్దామని.. మరోవైపు మేఘన నాగమణితోనే మోక్ష ప్రాణాలు కాపాడవచ్చని అనుకుంటూ ఉంటారు.
డిసెంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమి తనతో కలవట్లేదు, పిల్లల్ని కనట్లేదనే కోపంతో మోక్ష హాల్లో పడుకోవడానికి వస్తాడు. వద్దు అందరూ చూస్తారు అంటున్నా వినకుండా మోక్ష కిందకు రావడంతో పంచమి వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తుంది. లోపలికి రమ్మని బతిమాలుతుంది. ఈక్రమంలోనే మోక్ష.. పంచమిపై చేయి చేసుకుంటాడు. దీంతో ఏడుస్తూ పంచమి లోపలికి వెళ్లిపోతుంది.
డిసెంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో... ఉదయం నిద్రలేవగానే మోక్ష పంచమి ఏదని అడుగుతాడు. లేదు నేను ఇంట్లోంచి పంపించానని వైదేహి చెబుతుంది. తన వల్ల నీ జీవితంలో సుఖమే లేదని.. అందుకే వెళ్లిపోమన్నానని అంటుంది. నువ్వు కూడా తనను వదిలేసి మరో పెళ్లి చేసుకోవాలని చెబుతుంది. మోక్ష మాత్రం అది తప్పమ్మా.. ఎలాంటి గొడవలు ఉన్నా మేమిద్దరమే చూసుకోగలం అంటూ అంటాడు.
డిసెంబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో.. పంచమిని ఇంట్లోంచి వెళ్లగొట్టిన వైదేహిపై కుటుంబ సభ్యులు అంతా ఫైర్ అవుతారు. అది సరైన పద్ధతి కాదని.. ఓ అమ్మాయి, ముఖ్యంగా ఇంటి కోడల్ని అర్ధరాత్రి ఇంట్లోంచి పంపించాల్సిన అవసరం ఏముందని అంటారు. ఇలా అందరూ తిడుతుంటే మోక్ష మాత్రం ఓ చోట కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. నా ప్రాణం అయిన పంచమినే నాకు దూరం చేశావు కదమ్మా అంటూ కన్నీళ్లు కారుస్తాడు. ఇలా సీరియల్ రసవత్తరంగా సాగుతోంది.


Click it and Unblock the Notifications











