Naga Panchami: అలా చేస్తే మోక్షను కాపాడుకోవచ్చట.. అసలు విషయం చెప్పిన నాగసాధువు!

నాగ పంచమి పంచమి సీరియల్ లో అద్భుతమైన ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఏమాత్రం సాగదీతగా అనిపించకుండా ఉండేలా చేయడంలో సీరియల్ నిర్వాహకులు సఫలం అవుతున్నారు. ఇప్పటికే మోక్ష బ్రహ్మచర్యాన్ని పోగొట్టేందుకు కరాళీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుండగా... మోక్షను కాపాడుకునేందుకు పంచమితో పాటు ఆమె తల్లి కూడా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మోక్ష ఇంట్లో అడుగు పెట్టిన కరాళీ.. మోహనిగా పరిచయం చేసుకుంది. నంబూద్రీ చెల్లెను అని వైదేహీకి చెప్పి.. ఆమె స్నేహితురాలిగా ఇంట్లోకి చేరింది. ఈక్రమంలోనే పాములు, విషంపై రీసర్చ్ చేస్తున్నానంటూ మోక్షకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

ఒంటరిగా అతడితో మాట్లాడుతూ.. తనలోని వశపరుచుకునే శక్తితో అతడికి దగ్గర అవుతోంది. తన కళ్లలోంచి మోహించే శక్తిని పంపి.. అతడిని తన వశం చేసుకుంది. ఈక్రమంలోనే మోక్ష.. మోహిని నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమెను పొగుడుతాడు. అతడు కూడా ఆమెను పొగడగా.. కరాళీ మోక్షను ముద్దు పెట్టుకుంది. అప్పుడే అక్కడకు వచ్చిన పంచమి, సుబ్బులు వాళ్లను చూస్తూ ఉండిపోతారు. పంచమి చాలా కోపంగా చూస్తుండగా.. సుబ్బు మాత్రం ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వడు. అయితే పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఈరోజు రాత్రి వచ్చే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

Naga Sadhuvu Said How to Save Moksha on December 2nd Episode Number 216 in Naga Panchami Telugu Serial

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా కరాళీ ఇంట్లోకి వస్తూ కనిపిస్తుంది. రాగానే తన రక్తంతో రక్తార్పణ చేస్తుంది. క్రీం అంటూ చెట్టుపై రాసి.. ఈ ఇల్లు నాశనం కావాలంటూ కోరుకుంటుంది. కానీ సుబ్బు మహిమతో ఆ రక్తం అంతా పోతుంది. అలాగే ఆమె చుట్టూ ఓ శక్తి వలయాకారంలో తిరుగుతుంది. దీంతో కరాళీ లోపలికి రాలేకపోతుంది. అది గమనించిన ఆమె మహాకాళిని కోరగా.. ప్రాణాలకు తెగించి నువ్వు ముందుకు వెళ్తేనే అనుకున్నది సాధించగల్గుతావని అంటుంది. ఇలా బయటకు వచ్చిన ఆమె ఇంట్లోకి వస్తుంది. గుమ్మం ముందు వైదేహా నీవు ఎవరని అడగా.. నంబూద్రీ చెల్లెల్ని అంటూ ఆమ ఆశీర్వాదం తీసుకుంటుంది.

తన సోదరుడు హిమాలయాలకు వెళ్లాడని.. అప్పటి వరకు తనను ఇక్కడే ఉండాలని చెప్పినట్లు వివరిస్తుంది. అది తెలుసుకున్న వైదేహి.. మా మోక్షకు నంబూద్రీ గారు అంటే నచ్చరు.. కాబట్టి నువ్వు మా స్నేహితురాలివి కూతురివి అని చెబుతానంటుంది. అలా లోపలికి తీసుకెళ్లగా... ఇంట్లో వాళ్లకు పరిచయం చేస్తుంది. చిత్ర, జ్వాలల భర్తలు ఇద్దరూ ఆమెను చూసి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తారు. ముఖ్యంగా తన పేరు మోహిని అని.. పాములపై ప్రయోగాలు చేస్తుంటానని అంటుంది. అది విన్న చిత్ర, జ్వాలలు జోక్ లు వేస్తారు. కానీ పంచమి మాత్రం.. ఆమె కరాళీని గుర్తిస్తుంది. ఈమె ఎందుకు వచ్చిందా అని చూస్తూ ఉండిపోతుంది.

Naga Sadhuvu Said How to Save Moksha on December 2nd Episode Number 216 in Naga Panchami Telugu Serial

ఇక ఆ తర్వాత పంచమి తల్లి నాగ సాధువును కలిసేందుకు వెళ్తుంది. కానీ ఆయన శిష్యుడు కనిపించి.. తన గురువు నాగసాధువుల సమ్మేళనానికి వెళ్లినట్లు చెబుతాడు. ఏదైనా అర్జెంట్ అయితే తనకు చెప్పమంటాడు. మీ కూతురు పంచమి గురించి నాకు అంతా తెలుసని అంటాడు. ఈక్రమంలోనే పంచమి తల్లి తన కూతురు, అల్లుడిని కాపాడుకోవాలని అనగా... మోక్ష ప్రాణాలు పోవడం ఖాయం అంటాడు. కానీ కాపాడుకునేందుకు ఓ దారి ఉందని.. మహా మృత్యుంజయ హోం చేస్తే ఆయన కచ్చితంగా బతుకుతాడని అంటుంది. అయితే ఆయన పేరు మీదు ఓ హోమం చేసే విషయం గురించి అతడికి చెప్పాలని.. వాళ్లు ఒప్పుకుంటే తాము చేస్తామని అంటాడు. వాళ్లతో మాట్లాడి వస్తానంటూ పంచమి తల్లి వెళ్లిపోతుంది.

ఇక ఆ తర్వాత పంచమి.. ఇంటి ముందు కార్తీక దీపాలు వెలిగిస్తుంది. సుబ్బు పక్కనే ఉండి ఆ పనులు అన్నీ చేయిస్తాడు. ఈ దీపం పెట్టిన వాళ్లకే కాకుండా.. దాన్ని చూసిన వాళ్లకు కూడా శుభం కల్గుతుందని సుబ్బు అంటాడు. ఆ మహా శివుడి కటాక్షం ఉండాలంటే కార్తీకదీపం పెట్టాలంటూ వివరిస్తాడు. ఆ తర్వాత పైకి వెళ్దాం పదా అని వెళ్తారు. ఈక్రమంలోనే కరాళీ.. మోక్షను ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తుంది. అయితే ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X