Jabardasth నుంచి వాళ్ళ వల్లనే బయటకు వచ్చేశా.. మళ్ళీ రమ్మంటే..: నాగబాబు

నిర్మాతగా నటుడిగా సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నాగబాబు కొన్ని రోజులపాటు రియాలిటీ షోలలో జడ్జిగా కూడా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఎంతో సక్సెస్ అయిన జబర్దస్త్ నుంచి ఆయన హఠాత్తుగా తప్పుకోవడం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వివాదాల కారణంగానే ఆయన బయటకు వచ్చినట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే ఎప్పుడు కూడా ఆ విషయంలో సరైన క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇటీవల మొత్తానికి నాగబాబు ఆ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

 విబేధాలు వచ్చాయని..

విబేధాలు వచ్చాయని..


జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కూడా అందులో నాగబాబు, రోజా జడ్జీలుగా కొనసాగిన విషయం తెలిసిందే. చాలా కాలం పాటు వీరే అందులో ఉన్నారు. ఇక నాగబాబు మెల్లగా తప్పుకోవడంతో ఊహించని విధంగా రూమర్స్ వచ్చాయి. రోజా నాగబాబు మధ్యలో విభేదాలు వచ్చాయని అలాగే కొంతమంది కమెడియన్స్ కారణంగా కూడా నాగబాబు అక్కడ నుంచి వెళ్లిపోయారని కూడా టాక్ వినిపించింది.

జబర్దస్త్ లో పొరపాట్లు

జబర్దస్త్ లో పొరపాట్లు

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు జబర్దస్త్ లో జరుగుతున్న పొరపాట్లు గురించి కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను నా సొంత నిర్ణయం ద్వారానే అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చాను. నన్ను ఎవరు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు. కానీ అక్కడ కొన్ని పొరపాట్లు జరగడం నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఆ విధంగా అక్కడ జరగడం అక్కడ కంపెనీ పాలసీ అయ్యి ఉండవచ్చు. కానీ అలాంటి వాతావరణంలో నేను పని చేయకూడదు అని అనుకున్నాను అని.. నాగబాబు చెప్పారు.

 నాకు ఏమాత్రం నచ్చలేదు...

నాకు ఏమాత్రం నచ్చలేదు...

అక్కడ యాజమాన్యం తప్పు ఏమీ లేదు. కానీ కొంతమంది కిందిస్థాయి మేనేజ్మెంట్ మాత్రం అక్కడ దారుణంగా ఉంది. కొంతమంది చిన్న స్థాయి కమెడియన్స్ కు న్యాయం చేయలేదు అని అనిపించింది. వారికోసం మాట్లాడాలని కూడా అనుకున్నాను. అయితే అక్కడ ఆ విధంగా రూల్స్ ఉండడంతో నాకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా నా అంతట నేనే జబర్దస్త్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. అని నాగబాబు తెలియజేశారు.

వాళ్ళు నా వల్ల బయటకు రాలేదు

వాళ్ళు నా వల్ల బయటకు రాలేదు


ఇక నేను షో నుంచి బయటకు రావడం వలన చమ్మక్ చంద్ర అలాగే కిరాక్ ఆర్పీ ఇలా కొంతమంది బయటకు రావడం నా నిర్ణయం ఏమీ కాదు. వాళ్ళు సొంతంగానే బయటకు వచ్చేసి సినిమాల్లో అలాగే ఇతర షోలలో అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా కిర్రాక్ ఆర్పీ అనే వ్యక్తి చాలా మంచివాడు. అతను ఏదైనా సరే నిజాలు నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఇక జబర్దస్త్ లో ఉంటేనే జీవితం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బయటకు వస్తే కూడా చాలా అవకాశాలు వస్తాయి. అయితే నేను ఎవరిని కూడా బయటకు రమ్మని మాత్రం చెప్పలేదు. ఎవరి నిర్ణయం వాళ్లది అని నాగబాబు చెప్పారు.

 మళ్ళీ జబర్దస్త్ కు పిలిస్తే..

మళ్ళీ జబర్దస్త్ కు పిలిస్తే..

జబర్దస్త్ నుంచి మళ్లీ పిలుపు వస్తే వెళ్తారా లేదా అనే విషయంలో కూడా నాగబాబు తనదైన శైలిలోకి వివరణ అయితే ఇచ్చాడు. మళ్ళీ అక్కడికి నా సొంతంగా అయితే నేను వెళ్లాలని అనుకోవడం లేదు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్లో కమెడియన్స్ తో చాలాసార్లు చర్చించి షో స్థాయి పెరగడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. అది పై వాళ్లకు తెలియకపోవచ్చు. కానీ కమెడియన్స్ ను ఎక్కువ స్థాయిలో మోటివేట్ చేశాను. ఇక జబర్దస్త్ ద్వారా అయితే నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది అనేది నేను నమ్ముతాను. ఇక వాళ్ళు మరోసారి పిలిస్తే వెళతాను.. కానీ నా అంతట నేను అయితే అక్కడికి వెళ్లను అని నాగబాబు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X