జబర్దస్త్‌లోకి మళ్లీ వస్తారా?.. నెటిజన్ ప్రశ్నకు నాగబాబు రిప్లై ‘అదిరింది’.. దటీజ్ మెగా బ్రదర్!

మెగాబ్రదర్ నాగబాబు కాసేటి క్రితం పవన్ కళ్యాణ్ వింటేజ్ ఫోటోపై చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. ఆ ఫోటోకు నెటిజన్లు పెడుతున్న కామెంట్లకు నాగబాబు కూడా అదిరిపోయే రిప్లైలు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్ లుక్ ఫోటోను షేర్ చేస్తూ.. ఇలాంటి ఫోటోలు ఇంకా ఎన్నో ఉన్నాయి.. దాచి పెట్టాను అంతే అంటూ కామెంట్ చేశాడు. ఆ మాటలను నిజం చేస్తూ తాజాగా మరో ఫోటోను షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోలకు నెటిజన్లు పలు రకాలు కామెంట్లు చేస్తూ ఉండగా మధ్యలో జబర్దస్త్, అదిరింది షోలపై కామెంట్ చేయాల్సి వచ్చింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

చాలా ఉన్నాయి.. దాచానంతే..

చాలా ఉన్నాయి.. దాచానంతే..

నేటి ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ యవ్వనంలో ఉన్నప్పటి ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతూ వచ్చింది. ఈ ఫోటోపై నాగబాబు కామెంట్ చేస్తూ ‘ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.., నా దగ్గర దాచనంతే... !' అని అన్నాడు. ఎప్పటికీ ఓ గొప్ప సోదరుడు.. అచంచంమైన, అనంతమైన ప్రేమ ఉంటుంది అని తెలిపాడు.

తాజాగా మరో ఫోటో..

తాజాగా మరో ఫోటో..

బావగారు బాగున్నారా సినిమా సమయంలోనూ ఓ ఫోటోను తాజాగా షేర్ చేశాడు నాగబాబు. ఈ మేరకు కామెంట్ చేస్తూ.. ప్పా కదా ఇంకా చాలా ఉన్నాయని...ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. . మనం పెట్టే పిక్స్‌కి గాలరీ నిండి పోవాలంతే .... అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫోటోకు విపరీతమైన స్పందన, భిన్న రకాల కామెంట్స్ వచ్చాయి.

జబర్దస్త్‌లో నవ్వులు..

జబర్దస్త్‌లో నవ్వులు..

జబర్దస్త్ షోలో మీ నవ్వులు మిస్ అవుతున్నాం.. మళ్లీ ఆ షోలోకి వస్తారా? అని ఓ నెటిజన్ ఎంతో ప్రేమగా, ఆసక్తిగా అడిగింది. ఇక దీనికి నాగబాబు సదరు నెటిజన్‌ను నొప్పించకుండా ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకుండా రిప్లై ఇచ్చాడు. ఎల్లప్పుడూ అదిరిందిలో అవైలబుల్‌గానే ఉంటాయి.. ప్రతీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు అని సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చాడు. జబర్దస్త్ అనే మాట కూడా టచ్ చేయకుండా తాను చెప్పదలుచుకున్న జవాబు చెప్పేశాడు.

 దటీజ్ మెగా బ్రదర్..

దటీజ్ మెగా బ్రదర్..

ఇక కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త శృతిమించారు. మాకు పవన్ కళ్యాణ్ సింగిల్‌గా ఉన్న ఫోటోలు మాత్రమే కావాలి.. అంటూ కామెంట్ చేశాడు. కానీ నాకు నా సోదరులిద్దరూ ఒకటే అంటూ అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పాడు. ఇక సాధ్యమైనంతమందికి పేరుపేరునా రిప్లై ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు నాగబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X