నాగబాబు జబర్ధస్త్‌ను వీడడం వెనుక రహస్యం లీక్: రీఎంట్రీపై షాకింగ్ రియాక్షన్.. ఊహించని పేరు చెప్పి!

దాదాపు మూడు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నారు. సుదీర్ఘ కెరీర్‌లో హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా మెప్పించారు. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా హవాను చూపించిన ఆయన.. ఇప్పటికీ ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో జబర్ధస్త్‌ను వీడడం వెనుక రహస్యాన్ని లీక్ చేశారు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే....

ఇండస్ట్రీలోకి అలా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు

ఇండస్ట్రీలోకి అలా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రాక్షసుడు'తో టాలీవుడ్‌లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబు. అప్పటి నుంచి ఆయన సినీ ప్రస్థానం ఎన్నో విధాలుగా సాగింది. మొదట్లో నటుడిగా సత్తా చాటిన మెగా బ్రదర్.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇలా వందల చిత్రాల్లో పలు రంగాల్లో సత్తా చాటుకున్నారు.

టెలివిజన్ రంగంలోకి సైతం... ఇలా ప్రవేశం

టెలివిజన్ రంగంలోకి సైతం... ఇలా ప్రవేశం

వెండితెరపై హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు.. సీరియళ్లలో నటిస్తూ బుల్లితెరపైనా మెప్పించారు. ఈ సమయంలోనే ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే జబర్ధస్త్‌ షో ద్వారా జడ్జ్‌గా మారారు. దాదాపు ఏడేళ్లు పాటు అందులో తనదైన శైలి మేనరిజంతో ప్రేక్షకులను అలరించారు. తద్వారా స్మైలింగ్ స్టార్, టవర్ స్టార్ అనే పేర్లుతో మరింత పాపులర్ అయ్యారు.

జబర్ధస్త్‌కు గుడ్‌బై... కొత్త షోతో రచ్చ చేస్తూ

జబర్ధస్త్‌కు గుడ్‌బై... కొత్త షోతో రచ్చ చేస్తూ

జబర్ధస్త్ షోలో చాలా కాలం పాటు జడ్జ్‌గా వ్యవహరిస్తూ.. అదిరిపోయే స్టార్‌డమ్‌ను అందుకున్నారు నాగబాబు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షో నుంచి బయటకు వచ్చేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో 'అదిరింది' అనే షోను ప్రారంభించారు. జబర్ధస్త్‌ దర్శకులు నితిన్, భరత్ దీనిని రూపొందించారు. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ రెండు సీజన్ల పాటు సాగిన ఈ షో ఆగిపోయింది.

ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెప్తున్నాడు

ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెప్తున్నాడు

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై తనదైన గలాన్ని వినిపిస్తున్నారు. దీంతో తరచూ వార్తల్లో ఉంటున్నారాయన.

 ఇష్టమైన షో.. ఊహించని పేరు చెప్పడంతో

ఇష్టమైన షో.. ఊహించని పేరు చెప్పడంతో

తాజాగా నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ సామాన్యుడిలానే జవాబులు ఇస్తూ ఆకట్టుకున్నారు మెగా బ్రదర్. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. 'జబర్ధస్త్.. అదిరిందిలో మీ ఫేవరెట్ ఏది' అని అడగగా.. ఈ రెండూ కాకుండా 'బొమ్మ అదిరింది' అని చెప్పారాయన.

జబర్ధస్త్‌ను వీడడం వెనుక రహస్యం రివీల్

జబర్ధస్త్‌ను వీడడం వెనుక రహస్యం రివీల్

మెగా బ్రదర్ నాగబాబు దాదాపు ఏడేళ్ల పాటు జబర్దస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించారు. అలాంటిది ఉన్నట్లుండి అందులో నుంచి తప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా నిర్వహించిన సెషన్‌లో ఓ నెటిజన్ 'సార్ మీరు జబర్ధస్త్‌లో ఎందుకు మానేశారు చెప్పండి ప్లీజ్' అని అడిగాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'మల్లెమాల వాళ్లతో సైద్ధాంతిక తేడాలు రావడం వల్లే' అని వెల్లడించారు.

జబర్ధస్త్‌లోకి రీఎంట్రీపై షాకింగ్ రియాక్షన్b

జబర్ధస్త్‌లోకి రీఎంట్రీపై షాకింగ్ రియాక్షన్b

ఇదే సెషన్‌లో మరో నెటిజన్.. 'ఒకవేళ జబర్ధస్త్ నిర్వహకులు మీ దగ్గరకు వచ్చి షోలోకి రమ్మని అడిగితే ఒప్పుకుంటారా లేదా' అని ప్రశ్నించాడు. దీనికి అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్' సినిమా పోస్టర్‌ను షేర్ చేసిన నాగబాబు.. 'నేను ఎప్పుడైతే నో అని చెప్పానో.. అది చేయను' అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన షోలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X