సమాజంలో చాలా మంది అలా బతుకుతున్నారు.. చమ్మక్ చంద్రపై నాగబాబు కామెంట్స్ వైరల్

చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పనేమీ లేదు. జబర్దస్త్ స్టేజ్ మీద అల్లల్లాడించిన చమ్మక్ చంద్ర.. ఇప్పుడు బొమ్మ అదిరింది షోలో రచ్చ చేస్తున్నాడు. నటుడిగా వెండితెరపై అంతగా గుర్తింపు రాని చమ్మక్ చంద్రకు.. జబర్దస్త్ స్టేజ్ ఓ ఐడెంటిటీని ఇచ్చింది. అలా జబర్దస్త్ స్టేజ్ మీద ఫేమస్ అయిన చమ్మక్ చంద్ర హీరోగానూ సినిమా తీశాడు. అలా చమ్మక్ చంద్ర గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. మెగా హీరోలన్నా, ఫ్యామిలీ అన్నా, నాగబాబు అన్నా కూడా చమ్మక్ చంద్రకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.

అందుకే అలా..

అందుకే అలా..

నాగబాబు అంటే ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే.. జబర్దస్త్‌ను వీడి ఆయనతో పాటు అదిరిందిలో చేరాడు. నాగబాబు బాటలో పయనించేందుకు ఏ మాత్రం కూడా ఆలోచించలేదు చమ్మక్ చంద్ర. కొందరు మాత్రం మాటలు చెబుతుంటారు. నాగబాబుపై ప్రేమ ఉందంటూ స్కిట్స్‌లో డైలాగ్‌లు, పంచ్‌లు వేస్తుంటారు. కానీ వారెవ్వరూ కూడా నాగబాబు వెంట నడవలేదు.

 ప్రత్యేకమైన ప్రేమ..

ప్రత్యేకమైన ప్రేమ..

తన వెంట నడిచి రావడంతో చమ్మక్ చంద్ర అంటే నాగబాబుకు మరింత అభిమానం పెరిగింది. అందుకే తన వీడియోల్లో చమ్మక్ చంద్ర క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం, ఎంతో కష్టపడి ఎంతో సంపాదించి.. అందరికీ ఓ ఉదాహరణగా నిలిచాడని నాగబాబు చెబుతుంటాడు. అలాంటి చమ్మక్ చంద్ర బర్త్ డే సందర్భంగా నాగబాబు స్పెషల్ విషెస్ అందించాడు.

నాగబాబు పోస్ట్ వైరల్..

నాగబాబు పోస్ట్ వైరల్..

హ్యాపీ బర్త్ డే మై డియర్ చమ్మక్ చంద్ర అంటూ నాగబాబు విషెస్ చెబుతూ కొన్ని కామెంట్లు చేశాడు. ఈ సమాజంలో కొందరు మాస్క్ ధరించి రెండు నాల్కల ధోరణితో బతుకుతున్నారంటూ ఎవరిపైనో పరోక్షంగా కామెంట్లు వేసినట్టు ఓ పోస్ట్ చేశాడు. నాగబాబు చేసిన పోస్ట్‌లో ఎవరి మీదో సెటైర్లు వేసినట్టు కనిపించినా.. చమ్మక్ చంద్ర పడిన కష్టం మాత్రం కనిపిస్తోంది.

Recommended Video

Niharika Konidela wedding : All Mega Heroes In one Frame
అవన్నీ నాకు తెలుసు..

అవన్నీ నాకు తెలుసు..

నువ్వెంత స్వచ్చంగా ఉంటావు.. నిజాయితీగా ఉంటావో.. నాకు తెలుసు.. అందుకే నువ్వంటే ఇష్టం.. ఈ రోజు ఈ స్థాయిలో ఉండేందుకు నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు.. ఎన్నో బాధలు అధిగమించావో నాకు తెలుసు.. ఇలాగే కష్టపడుతూనే ఉంది.. నిజాయితీగానే ఉండు.. నవ్వుతూ ఉండు.. ఎప్పటికీ నవ్విస్తూనే ఉండంటూ చమ్మక్ చంద్రపై నాగబాబు ప్రేమను కురిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X