హైపర్ ఆది మాదిరిగానే సద్దాం.. జబర్దస్త్‌కు సమఉజ్జీగా అదిరింది.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

నటుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న నాగబాబు తన సెలబ్రిటీ పరిధిని విస్తృతి చేసుకొంటూ జబర్దస్త్‌ షోకు బ్రాండ్ ఐకాన్‌గా మారారు. జబర్దస్త్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడంలో తన వంతు పాత్రను పోషించారు. అయితే అనూహ్యంగా ఆ షో నుంచి తప్పుకోవడం, వెంటనే మరో పోటీ చానెల్‌లో అదిరింది షోను ప్రారంభించడం కొంత వివాదంగాను ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని కలిగించింది. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ అంతా నా ఇష్టంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

ఐడియాలాజికల్ డిఫరెన్స్ వల్లే

ఐడియాలాజికల్ డిఫరెన్స్ వల్లే

జబర్థస్త్‌ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను చేస్తున్నాను కాబట్టి అదిరింది షో బాగుందనే చెబుతాను. ఐడియాలాజికల్ డిఫరెన్స్ కారణంగా మల్లెమాల నుంచి బయటకు వచ్చాను. అందుకే జబర్దస్త్‌ దూరమయ్యాను. ఆ లోపే అదిరింది షో చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు.

లాక్‌డౌన్ ఎత్తేయగానే

లాక్‌డౌన్ ఎత్తేయగానే

కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా అదిరింది షో పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. కొన్ని ఎపిసోడ్స్ ప్రసారం కాలేదు. అందుకే కొన్ని ఎపిసోడ్స్‌ను రిపీట్ చేస్తున్నాం. లాక్‌డౌన్ ఎత్తివేయగానే అదిరింది షో పూర్తిస్థాయిలో ప్రారంభం అవుతుంది. ఇలాంటి సమయంలో అదిరింది లాంటి డిఫరెంట్ కామెడీ షో చేయడానికి ఛాన్స్ లభించడం సంతోషంగా ఉంది అని నాగబాబు అన్నారు.

రెండువైపుల సీనియర్లు

రెండువైపుల సీనియర్లు

జబర్దస్త్‌కు అదిరిందికి తేడా ఏమిటనే ప్రశ్నకు నాగబాబు జవాబిస్తూ.. జబర్దస్త్‌లో ఆది, సుధీర్ లాంటి సీనియర్లు ఉన్నారు. అదిరిందిలో చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి వారే కాకుండా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన కొందరు అదిరిందితో భాగమయ్యారు. కొత్తగా గల్లీభాయ్స్, రౌడీ భాయ్స్ రావడం వల్ల షోకు అదనపు ఆకర్షణగా మారింది అని నాగబాబు పేర్కొన్నారు.

జబర్దస్త్‌కు సమఉజ్జీగా అదిరింది

జబర్దస్త్‌కు సమఉజ్జీగా నిలిచే విధంగా అదిరింది షో ఉంది. అందులో సీనియర్లు ఉన్నారు. ఇందులో సీనియర్లు ఉన్నారు. గతంలో హైపర్ ఆది లాగా జూనియర్‌గా వచ్చి తారజువ్వలా ఎగిసి స్టార్ అయినట్టు.. అదిరిందిలో సద్దాం బాగా ఆకట్టుకొంటున్నాడు. రౌడీ బాయ్స్ బ్యాచ్‌లో సద్దాం మంచి పేరు తెచ్చుకొంటున్నారు అని నాగబాబు అన్నారు.

కామెంట్ చేయడం ఇష్టం ఉండదు

కామెంట్ చేయడం ఇష్టం ఉండదు

జబర్దస్త్‌పై నాకు కామెంట్ చేయడం ఇష్టం ఉండదు. వాళ్ల షో వారి క్రేజ్ మేరకు నడుస్తుంది. అదిరింది కామెడీ షో ఫ్రెష్‌గా ఉందనిపిస్తున్నది. రెగ్యులర్ కంటే భిన్నంగా ఉందనే ఫీలింగ్ కలుగుతున్నది. అలాంటి అదిరింది షోలో భాగం కావడం చాలా హ్యాపీగా ఉంది అని నాగబాబు అభిప్రాయపడ్డారు.

Recommended Video

Mega Brother Nagababu Comments on Pawan Kalyan's Upcoming Films
జబర్దస్త్‌ను చిన్నచూపు చూడను

జబర్దస్త్‌ను చిన్నచూపు చూడను

అదిరింది బాగా ఉందని చెప్పినా జబర్దస్త్‌ను చిన్నచూపు చూడను. వాళ్లకు ఉండాల్సిన విలువ.. అదిరిందికి ఉండాల్సిన విలువ దానికి ఉంది. తప్పుకుండా అదిరింది షో మరో లెవెల్‌కు వెళ్తుందని, జబర్తస్‌కు మించిన షో అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. బుల్లితెర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే షోగా అవుతుందని బలంగా విశ్వసిస్తున్నాను అని నాగబాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X