For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదు.. నేను లేకుంటే షో నడవదు.. జబర్దస్త్‌పై నాగబాబు కామెంట్స్

  |

  బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన జబర్దస్త్.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది నవ్వుల నవాబు నాగబాబు. ఆయన నవ్వులు, స్కిట్ మధ్యలో ఆయన వేసే పంచులు జబర్దస్త్‌కు మరింత ఆకర్షణగా నిలిచాయి. అయితే అలాంటి నాగబాబు జబర్దస్త్‌ను వీడటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. ఇదంతా ఓ వైపు అనుకుంటే.. నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా జబర్దస్త్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం మరింత కాకపుట్టిస్తోంది.

  రెండు వీడియోలతో హల్‌చల్..

  రెండు వీడియోలతో హల్‌చల్..

  జబర్దస్త్‌ను వీడటానికి గల కారణాలును చెబుతూ.. కేవలం ఐడియాలజీలో వచ్చిన విబేధాల కారణంగానే జబర్దస్త్‌ను వీడాడని, ఇలా మధ్యలో వదిలి వెళ్తానని ఎన్నడూ అనుకోలేదని చెప్పుకొచ్చాడు. రెండో వీడియోల జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ పుట్టుకు, టీమ్ లీడర్లు, కంటెస్టెంట్ల గురించి వివరించిన నాగబాబు మూడో వీడియోలో మరిన్ని విషయాలను వెల్లడించాడు.

  వేణు ఘటనను గుర్తు చేస్తూ..

  వేణు ఘటనను గుర్తు చేస్తూ..

  కమెడియన్ వేణుని చితక్కొట్టిన ఘటన గురించి ప్రస్థావిస్తూ అప్పుడు కూడా ఈటీవీ-శ్యాం బృందం ఆ ఆర్టిస్టుకు ఏమీ చేయలేదని నాగబాబు గుర్తు చేసుకున్నాడు. కొన్ని ఎపిసోడ్స్‌పై కోర్టులో కేసు నడుస్తోందని తెలిపాడు. దానికి మాత్రమే మల్లెమాల అధినేత సహా ఈటీవీ వర్గాలు స్పందించారని.. అలాంటి కార్పొరెట్ గొడవలు పట్టించుకున్నట్టు ఇతర విషయాలేవీ పట్టించుకోరని సెటైర్ వేశాడు.

  తాను అండగా..

  తాను అండగా..

  రకరకాల దెబ్బల వల్ల ఆర్టిస్టులు టీమ్ లీడర్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే తాను అండగా నిలిచానని.. కలిసి పోరాడదామని అన్నానని తెలిపాడు. ఎవరి మనోభావాలో దెబ్బతింటాయని సైలెంట్‌గా ఉండాలా? లీగల్‌గా సమస్యలు వస్తే కోర్టులు ఉన్నాయి కదా అని.. ఛానల్ సమస్యల్ని డీల్ చేస్తారని, వ్యక్తిగతంగా పట్టించుకోరని ఫైరయ్యాడు.

  నేను లేకపోతే నడవదు..

  నేను లేకపోతే నడవదు..

  షోలో నవ్వడానికే కాదు .. తాను లేకపోతే అది నడవదని అందరూ అభిమానం చూపారని అన్నాడు. కానీ తాను లేకపోయినా వ్యవస్థ కొనసాగుతుందని నాగబాబు అన్నాడు. తాను షో ఆర్టిస్టుల మధ్య టీమ్ లీడర్ల మధ్య స్పిరిట్‌ని నెలకొల్పేందుకు చాలా చేశానని అయితే అది మల్లెమాల అధినేతకు కూడా తెలియదని వెల్లడించారు.

  #CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
  కనీసం ఫుడ్ కూడా..

  కనీసం ఫుడ్ కూడా..

  జబర్ధస్త్‌పై కార్పొరెట్ ఇంపాక్ట్ పడడంతో ట్యాలెంట్ అనేది సంస్థను వదిలి వెల్లిందని విమర్శించాడు. ఇంత పెద్ద షోలో నిర్మాణ విలువలు దారుణంగా ఉండేవని.. జబర్దస్త్‌లో పనిచేసేవాళ్లు మల్లెమాల బాగుకోసమే కష్టపడినా.. ఎవరి గురించి పట్టించుకోలేదని అన్నాడు. టీం ఆర్టిస్టులకు నిర్వాహకులకు మధ్య దళారులు ఉన్నారని.. వాళ్ల వల్ల చాలా విషయాలు శ్యామ్ ప్రసాద్‌కి తెలిసేవి కాదని అన్నాడు. ఇవన్నీ శ్యామ్‌కి తెలియదు అనే తాను అనుకుంటున్నానని.. తెలిసి జరిగితే తానేం చేయలేనని అన్నాడు. తనను బాగానే చూసుకున్నారు కాని మిగతా టీం వాళ్లకు ఫుడ్ కూడా సరిగా పెట్టేవారు కాదు అని తీవ్రంగానే విమర్శించాడు.

  English summary
  Naga Babu Quits Jabardasth Show. Naga Babu Released third Video About Jabardasth Show. Even Proper Food Also Not Provided By Mallemala. naga Babu Sensational COmments On Jabardasth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X