నాగబాబుకు షాక్.. రోజా వైపే మెగా బ్రదర్ అడుగులు.. జబర్దస్త్ ఇష్యూ.. ఇదే జరిగితే!!
ఒకప్పుడు ఒకే వేదికపై హాయిగా నవ్వుకుంటూ వినోదాల విందిచ్చిన రోజా, నాగబాబు.. ఇటీవలి కాలంలో ఒకరిపై ఒకరి పోటీకి దిగారు. అది వ్యక్తిగత పోటీ కాకపోయినప్పటికీ జనాల్లో మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారింది. రోజా జబర్దస్తీ చేస్తుంటే.. నాగబాబు అదిరింది అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

ఏడేళ్లపాటు రోజాతోనే.. ప్రతీ వారం అదే!
జబర్దస్త్ కామెడీ షోతో ప్రయాణం ప్రారంభించిన రోజా, నాగబాబు ఏడేళ్లపాటు అలుపెరగని ప్రయాణం కొనసాగించారు. వారం వారం తమ లోని జోష్ రెట్టింపు చేసుకుంటూ ఏళ్ల తరబడి బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచారు. జబర్దస్త్ కమెడియన్స్ వేసే పంచ్ డైలాగులకు రోజా, నాగబాబు నవ్వులు ప్రాణం పోసేవి.

నాగబాబు డెసీషన్.. ఆడియన్స్ షాక్
ఇంతలో నాగబాబు తీసుకున్న డెసీషన్ బుల్లితెర ఆడియన్స్‌కి షాకిచ్చింది. ఊహించని విధంగా జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకున్నారు. కారణాలేంటో తెలియదు గానీ.. అంతటితో ఆగక జబర్దస్త్‌కి పోటీగా వేరొక ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'అదిరింది' షోలో జడ్జ్ అవతారమెత్తారు.

పోటీ వాతారవరణం.. అటు రోజా ఇటు నాగబాబు
ఇక అప్పటినుంచి ఇటు రోజా జబర్దస్త్, అటు నాగబాబు 'అదిరింది' వార్తలు సోషల్ మీడియాలో నిత్యం నిలుస్తూనే ఉన్నాయి. ఈ రెండు షోస్ కమెడియన్ల పర్‌ఫార్‌మెన్స్ మొదలుకొని జడ్జెస్ తీరు, టీఆర్ఫీ రేటింగ్స్ వరకూ అన్నింటా పోటీ వాతారవరణం నెలకొంది. దీంతో జనం ఈ అంశాలను ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు.

జబర్ధస్త్‌కు జిరాక్స్ కాపీ.. నాగబాబుకు షాక్
అదిరింది షో కోసం నాగబాబు.. తనతో పాటు మరికొంత మంది జబర్ధస్త్ నటలను వెంటబెట్టుకు వెళ్లారు. ఈ ప్రోగ్రామ్ చూసి ప్రేక్షకులు జబర్ధస్త్‌కు జిరాక్స్ కాపీ అని కామెంట్స్ చేశారు. దీంతో తొలి వారం నుంచే ఈ షోకు అనుకున్నంత రేంజ్‌లో టీఆర్పీలు రాలేదు. మెల్లగా పుంజుకున్నా పెద్దగా ప్రయోజనం రావడం లేదు. తాజాగా ఈ వారం కూడా చెప్పుకోదగిన టీఆర్ఫీ రేటింగ్స్ రాలేదు.

ఆలోచనలో పడిన అదిరింది టీమ్..
దీంతో ఈ షో నిర్వాహకులు ఆలోచనలో పడినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 25 ఎపిసోడ్ల కాంట్రాక్ట్ పూర్తిచేసి.. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్‌ను ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి.
Recommended Video

రోజా వైపే నాగబాబు అడుగులు!!
మరోవైపు నాగబాబు సైతం తిరిగి రోజా వైపే అడుగులేసే దిశగా అడుగులేస్తూ జబర్ధస్త్ షోకు రావాలనే ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ఈ అంశంపై అందరూ పెద్ద ఎత్తున చర్చించుకోవడం మొదలుపెట్టారు. అఫీషియల్ స్టేట్‌మెంట్ వస్తే గానీ చెప్పలేం ఇలాంటి వార్తల్లో నిజమెంత ఉందో!.


Click it and Unblock the Notifications











