నిహారిక ఎవడితోనో వెళ్లిపోయింది.. అందర్నీ చంపేసి, ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. నాగబాబు ఎమోషనల్
తండ్రీకూతుళ్ల అనుబంధం గురించి సృష్టిలో అందరికీ తెలిసిందే. ఆ బంధం గురించి ఎంత చెప్పినా అక్షరాలు సరిపోవు. అయితే మన తెలుగు చిత్ర సీమలో ఆ బంధానికి ప్రతీరూపాలుగా నిలిచేవారు ఎంతోమంది ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉండేవారు, ఈ తరానికి బాగా తెలిసిన వాళ్లు నాగబాబు నిహారిక. కూతురంటే ఎంత ప్రాణమో నాగబాబు ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. అదే విధంగా తండ్రి అంటే ఎంతిష్టమో నిహారిక కూడా చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ ఈవెంట్..
ప్రస్తుతం సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయింది నిహారిక. కాబోయే భర్త ఫోటోలు, నిశ్చితార్థపు ఫోటోలు, బాపుబొమ్మకు పెళ్లంట ప్రోమోలతో నిహారిక సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఎక్కడ చూసిన నిహారికకు సంబంధించిన వీడియోలు, ఫోటోలే దర్శనమిస్తున్నాయి.

పర్ఫామెన్స్‌తో ఎమోషనల్..
తాజాగా బాపుబొమ్మకు పెళ్లంట అంటూ విడుదల చేసిన కొత్త ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నిహారిక, నాగబాబు మధ్య ఉన్న అనుబంధాన్ని అందరి ముందు ప్రజెంట్ చేశారు. దీంతో నాగబాబు తన గతంలోకి వెళ్లి ఎమోషనల్ అయ్యాడు. కూతురి కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నడట. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

ఎవడితోనే వెళ్లిపోయింది..
‘ఓ సారి ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాను.. వాడెవడో నాలాగే నల్ల కోటు వేసుకోవడంతో వాడినే నాన్న అనుకుని వాడితో వెళ్లిపోయింది నిహారిక. దాదాపు 20 నిమిషాల పాటు కనిపించకుండా పోయింది నిహారిక. నాకు బుర్ర పనిచేయలేదు.. నాకు ఎలా అనిపించింది అంటే.. మొత్తం న్యూజిలాండ్‌లో ఉన్న వాళ్లందర్నీ చంపేద్దాం అనుకున్నా.

ఆత్మహత్య చేసుకుందామని..
వరుణ్‌ని ఇంటికి పంపించేసి.. నేను, పద్మ సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నాం. నా కూతురు లేకపోతే నేను బతికి ఉన్నా వేస్ట్ అన్నతం పిచ్చ వచ్చేసింది. పుణ్యం చేసుకుంటే వాడి కడుపున ఏంజెల్స్ పుడతారని అంటారు.. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు నిహారిక' అంటూ కూతురిపై అమిత ప్రేమను కురిపించాడు. దీంతో నిహారిక నాగబాబు ఒళ్లో చిన్నపిల్లలా కూర్చుండిపోయింది.
Recommended Video

నిశ్చితార్థం అయ్యాక..
ఆగస్టు 13న నిహారిక నిశ్చితార్థం అయ్యాక నాగబాబు ఎమోషనల్ అవుతూ.. ‘కూతుళ్లు అనేవారు మనకు ప్రతిబింబాలు. వారిని ఎంతగా పట్టి ఉంచాలని ప్రయత్నిస్తే అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వారిని వారిలానే ఉండనిద్దాం అలా వదిలేద్దాం..వారు ఎదిగే క్రమంలోని ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేద్దాం. లవ్యూ నిహా' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











