జబర్ధస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోవడానికి వెనుక అసలు కారణం చెప్పిన చమ్మక్ చంద్ర

By Manoj Kumar P

ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్' అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను పరిశ్రమకు అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా చాలా మంది గురు, శుక్రవారాల్లో ఈ షో కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలా 'జబర్ధస్త్' ప్రభావం చూపిస్తోంది. ఇందులో కనిపించే ఆర్టిస్టులతో పాటు జడ్జ్‌లు రోజా, నాగబాబుకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు, యాంకర్లు రష్మీ, అనసూయను ఫాలో అయ్యే వారి సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు రోజులుగా ఈ షో మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 జబర్ధస్త్‌కు వాళ్లంతా దూరం

జబర్ధస్త్‌కు వాళ్లంతా దూరం

సక్సెస్‌ఫుల్ షో జబర్ధస్త్ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ షో నుంచి దర్శకులు నితిన్, భరత్‌తో పాటు జడ్జ్ నాగబాబు, టీమ్ లీడర్లు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర సహా పలువురు బయటకు వెళ్లిపోయారనేదే ఆ వార్త సారాంశం. అయితే, మరో జడ్జ్ రోజా మాత్రం తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంటారని తెలుస్తోంది.

ఎన్నో అనుమానాలు

ఎన్నో అనుమానాలు

జబర్ధస్త్‌కు మూల స్థంభంగా ఉన్న నాగబాబుతో పాటు ముఖ్యమైన టీమ్ లీడర్లు, డైరెక్టర్లు బయటకు వెళ్లిపోయారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు, షో నిర్వహకులకు డైరెక్టర్లకు మధ్య గొడవలు అయ్యాయని కొందరు అంటుండగా.. నాగబాబుతో నిర్వహకులకు వివాదం చెలరేగిందని మరికొందరు అంటున్నారు. దీనిపై మాత్రం క్లారిటీ లేదు.

మరో చానెల్‌లో స్టార్ట్ చేశారు

మరో చానెల్‌లో స్టార్ట్ చేశారు

జబర్ధస్త్ నుంచి వెళ్లిపోయిన వారందరూ కలిసి మరో ప్రముఖ చానెల్‌లో సరికొత్త షో స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే విడుదలైంది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడంతో జబర్ధస్త్ షో మనుగడ ప్రశ్నార్ధకం కాబోతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో వార్తలు పుట్టుకొస్తున్నాయి.

 క్లారిటీ ఇచ్చిన చమ్మక్ చంద్ర

క్లారిటీ ఇచ్చిన చమ్మక్ చంద్ర

నాగబాబుతో సహా చాలా మంది టీమ్ లీడర్లు జబర్ధస్త్ షో నుంచి వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చమ్మక్ చంద్ర స్పందించాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ దీనికి క్లారిటీ ఇచ్చాడు. ‘నాగబాబు గారితో పాటు కొంత మంది టీమ్ లీడర్లు జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చిన మాట నిజమే. నేను కూడా వాళ్లలో ఉన్నాను' అని ఆయన చెప్పుకొచ్చాడు.

నాగబాబు అందుకే వచ్చేశారు

నాగబాబు అందుకే వచ్చేశారు

ఈ షో నుంచి నాగబాబు బయటకు రావడం వెనుక అసలు కారణాన్ని చమ్మక్ చంద్ర వెల్లడించాడు. ‘ఈ షో నుంచి నాగబాబు గారు బయటకు రావడం వెనుక బలమైన కారణాలు ఏమీ లేవు. అందరూ అనుకుంటున్నట్లు, బయట ప్రచారం జరుగుతున్నట్లు ఆయన ఎవరితోనూ గొడవలు పడలేదు. షో వాళ్లతో చెప్పి ఫ్రెండ్లీగానే వచ్చేశారు' అని ఆయన వెల్లడించాడు.

Recommended Video

#CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
ఆ షోలోకి వెళ్లడానికి కారణం

ఆ షోలోకి వెళ్లడానికి కారణం

జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిన వారందరూ మరో చానెల్‌లో షో చేయనుండడం గురించి చంద్ర క్లారిటీ ఇచ్చాడు. ‘జబర్ధస్త్ నుంచి మేమంతా వెళ్లిపోయినా ఆ షోకు వచ్చిన నష్టం ఏమీ లేదు. జబర్ధస్త్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మేమంతా కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతోనే మరో షో చేయడానికి ఒప్పుకున్నాం' అని ఈ కమెడియన్ పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X