Just In
- 4 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 5 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 5 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 5 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జబర్ధస్త్ యాంకర్‌పై నాగబాబు నాటీ కామెంట్స్: ఎప్పటికీ ఆమె అంటేనే ఇష్టం.. హాట్ అంటూ షాకింగ్‌గా!
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు స్మైలింగ్ స్టార్ నాగబాబు. నటుడిగా.. నిర్మాతగా చాలా కాలం పాటు ఓ వెలుగు వెలిగిన ఆయన.. బుల్లితెరపైనా పలు సీరియళ్లలో నటించి మెప్పించారు. ఇక, జబర్ధస్త్ షో ద్వారా దాదాపు ఏడేళ్ల పాటు బుల్లితెరపై సందడి చేశారు. ఈ మధ్య కాలంలో సినిమాలకు, షోలకు దూరంగా ఉంటోన్న నాగబాబు.. తాజాగా జరిగిన లైవ్ చాట్‌లో జబర్ధస్త్ యాంకర్‌పై నాటీ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ హోస్ట్ ఎవరో చెప్పకనే చెప్పేశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘రాక్షసుడు'తో ఎంట్రీ ఇచ్చిన నాగేంద్ర బాబు
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రాక్షసుడు' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబు. అప్పటి నుంచి ఆయన సినీ ప్రస్థానం ఎన్నో విధాలుగా సాగింది. మొదట్లో నటుడిగా సత్తా చాటిన మెగా బ్రదర్.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇలా వందల చిత్రాల్లో మెప్పించారు.

బుల్లితెరపైకి అలా.. జబర్ధస్త్‌గా మారిన కెరీర్
వెండితెరపై హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు.. సీరియళ్లలో నటిస్తూ బుల్లితెరపైనా మెప్పించారు. ఈ సమయంలోనే ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో ద్వారా జడ్జ్‌గా మారారు. దాదాపు ఏడేళ్లు పాటు అందులో తనదైన శైలి మేనరిజంతో ప్రేక్షకులను అలరించారు. తద్వారా స్మైలింగ్ స్టార్, టవర్ స్టార్ అనే పేర్లుతో మరింత పాపులర్ అయ్యారు.

ఆ షోకు గుడ్‌బై.. అదిరింది అంటూ ఎంట్రీతో
జబర్ధస్త్ షోలో చాలా కాలం పాటు జడ్జ్‌గా వ్యవహరిస్తూ.. అదిరిపోయే స్టార్‌డమ్‌ను అందుకున్నారు నాగబాబు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షో నుంచి బయటకు వచ్చేశారు. అదే సమయంలో మరో ఛానెల్లో ‘అదిరింది' అనే షోను ప్రారంభించారు. జబర్ధస్త్ దర్శకులు నితిన్, భరత్ దీనిని రూపొందించారు. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ రెండు సీజన్ల పాటు సాగిన ఈ షో ఆగిపోయింది.

వాళ్లను తీసుకొచ్చేందుకు సరికొత్త షో స్టార్ట్
జబర్ధస్త్ షోలో పని చేసినప్పుడే ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగబాబు. అదిరిందిలోనూ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కాకుండా స్వతహాగా కొందరిలోని టాలెంట్‌ను గుర్తించి వాళ్లను వెలుగులోకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే సొంతంగా కొన్ని షోలను ప్రారంభించబోతున్నట్లు ఆ మధ్య యూట్యూబ్ చానెల్ ద్వారా తెలిపారు.

ఎప్పుడూ అందులోనే.. కొత్త గెటప్.. గాసిప్
నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. ఇక, ఇటీవలే ఓ వైల్డ్ లుక్‌తో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు షాకిచ్చారాయన. ఇది బెల్లకొండ శ్రీనివాస్ నటించే ‘ఛత్రపతి' హిందీ రీమేక్‌లో విలన్ పాత్ర గెటప్ అని అంటున్నారు.

తన ఫేవరెట్ హోస్ట్ ఎవరో చెప్పకనే చెబుతూ
తాజాగా నాగబాబు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ సామాన్యుడిలానే జవాబులు ఇస్తూ ఆకట్టుకున్నారు మెగా బ్రదర్. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ‘జబర్ధస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌లో ఎవరు ఫేవరెట్' అని అడగగా టక్కున జవాబిచ్చారాయన.

జబర్ధస్త్ యాంకర్‌పై నాగబాబు నాటీ కామెంట్స్
నెటిజన్ అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబిస్తూ.. ‘ఎప్పటికీ అనసూయనే హాట్' అంటూ నాటీ కామెంట్ చేశారు నాగబాబు. దీంతో రష్మీ గౌతమ్‌కు భారీ షాక్ తగిలినట్లైంది. మెగా బ్రదర్ చేసిన ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో మనసులో మాటను చెప్పిన నాగబాబుకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.