నాగబాబు అదిరిపోయే ఎంట్రీ: ఎంత మంది ఉన్నారన్నది కాదురా.. ఎవడున్నాడన్నదే ముఖ్యం

By Manoj

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా పరిచయం అయినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు టవర్ స్టార్ నాగబాబు. నటుడిగా సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈయన.. తర్వాత నిర్మాతగానూ మారిపోయారు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆ తర్వాత బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో పలు సీరియల్స్‌లో నటించిన మెగా బ్రదర్.. ఆ తర్వాత ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఇటీవలే ఈ షో నుంచి తప్పుకున్న నాగబాబు.. సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు.?

Recommended Video

Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu
నాగబాబును నవ్వుల రారాజును చేసింది

నాగబాబును నవ్వుల రారాజును చేసింది

జబర్ధస్త్ కామెడీ షో 2013లో ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఈ షోకు మెగా బ్రదర్ నాగబాబు జడ్జ్‌గా వ్యవహరించారు. ఈ షో ఆయనకు ఎంతగానో ప్లస్ అయింది. ఆయనను నవ్వుల రారాజును చేసింది. స్కిట్ ప్రసారం అవుతున్న సమయంలో నాగబాబు చేసే ఎంజాయ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు.

సుదీర్ఘ ప్రయాణానికి బ్రేకిచ్చారు

సుదీర్ఘ ప్రయాణానికి బ్రేకిచ్చారు

బుల్లితెర చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ షోగా పేరొందింది జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇలాంటి షోలో ఇటీవల లుకలుకలు చోటు చేసుకున్నాయి. ఈ షోకు ఏడేళ్లుగా జడ్జ్‌గా కొనసాగిన నాగబాబు.. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

వాళ్ల వల్లే బయటకు వచ్చాను

వాళ్ల వల్లే బయటకు వచ్చాను

జబర్ధస్త్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగబాబు.. తన యూట్యూబ్ చానెల్‌లో కొన్ని వీడియోలను అప్‌లోడ్ చేశారు. వాటిలో అసలు షో నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది.? అసలు జబర్ధస్త్ షోలో తన ప్రయాణం ఎలా సాగింది.? అనే అంశాలను వెల్లడించారు. అలాగే, పలువురిపై ఆరోపణలు కూడా చేశారు. దీంతో నాగబాబు తీరు చర్చనీయాంశం అవుతోంది.

వాళ్లంతా నాగబాబుకు హ్యాండిచ్చారు

వాస్తవానికి నాగబాబు జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన సమయంలో ఆయనతో పాటు పలువురు టీమ్ లీడర్లు కూడా ఉన్నారు. దీంతో వాళ్లు కూడా కామెడీ షోకు టాటా చెప్పేశారని అనుకున్నారు. కానీ, నాగబాబుకు వాళ్లంతా హ్యాండ్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆయనతో వెళ్లిన వాళ్లంతా తిరిగి జబర్ధస్త్‌లో కనిపించడమే.

అదిరిపోయే రీతిలో ఎంట్రీ ఇచ్చాడు

అదిరిపోయే రీతిలో ఎంట్రీ ఇచ్చాడు

మెగా బ్రదర్ నాగబాబు మరో చానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని షోలలో కనిపించిన ఆయన.. తాజాగా మరో సరికొత్త ప్రొగ్రాంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘అదిరింది' అనే టైటిల్‌తో వస్తున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఆయన ‘ఎంత మంది ఉన్నారన్నది కాదురా.. ఎవడున్నాడన్నదే ముఖ్యం' అనే డైలాగ్ చెప్పి మరీ ఎంట్రీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X