twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంపీ అయినా వదిలేది లేదు.. చాలా పెద్ద విషయాలపై పోరాటం చేస్తున్నా.. శివాజీ రాజా గురించి నాగబాబు

    |

    Recommended Video

    Nagababu Again Reacted On Shivaji Raja Comments || Filmibeat Telugu

    నటుడు, మెగా సోదరుడు నాగబాబు ఇప్పుడిప్పుడే ఎన్నికల ప్రచారం బడలిక నుంచి తెరుకుంటున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నాగబాబు జనసేన తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ముగిసిన ఎన్నికల అనంతరం తన భావాలను ఇటీవల మీడియాకు పంచుకొన్నారు. తనకు ఆర్థికంగా, నటుడిగా హోదాను పెంచిన జబర్దస్త్ కార్యక్రమంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే..

     జబర్దస్త్‌తో నాకు బాగా అనుబంధం

    జబర్దస్త్‌తో నాకు బాగా అనుబంధం

    నరసాపురం ఎంపీగా గెలిస్తే జబర్దస్త్ షో మానేస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఇష్టం. రకరకాల సమస్యల నుంచి బయటపడటానికి నాకు కూడా అది ఉపశమనంగా ఉంటుంది. ఆ కార్యక్రమం కోసం నెలకు నాలుగు రోజులు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంపీగా గెలిచినా నేను నా సమయాన్ని అడ్జస్ట్ చేసుకొంటాను అని నాగబాబు అన్నారు.

     ఒకవేళ ఎంపీగా ఎన్నికైనా గానీ

    ఒకవేళ ఎంపీగా ఎన్నికైనా గానీ

    ప్రజలకు హాస్యాన్ని అందించడం ఓ రకంగా సమాజసేవ లాంటిదిగా భావిస్తాను. చాలా మంది ప్రముఖులు లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికై పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించినట్టు సమాచారం. గతంలో ఎంపీగా ఎన్నికైన సిద్ధూ, అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ లాంటి వాళ్లు టెలివిజన్ షోలలో జడ్జీలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

     శివాజీరాజా అంశం చాలా చిన్నది

    శివాజీరాజా అంశం చాలా చిన్నది

    మా ఎన్నికల్లో ఓటమి పాలైన నటుడు శివాజీ రాజా తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా నాగబాబు స్పందించారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. నరసాపురం ఎంపీగా నాగబాబుని గెలిపించొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలను నాగబాబు తేలికగా తీసుకొన్నారు. శివాజీ రాజా అంశం చాలా చిన్నది. అంతకంటే పెద్ద విషయాలపై పోరాటం చేస్తున్నాను అని నాగబాబు అన్నారు.

     శివాజీ రాజా పనితీరు నాకు నచ్చలేదు

    శివాజీ రాజా పనితీరు నాకు నచ్చలేదు

    కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నరేష్‌కు మా ఎన్నికల్లో మద్దతు తెలిపాను. గత రెండేళ్ల కాలంలో శివాజీ రాజా పనితీరుపై నాకే కాదు.. చాలా మందికి అసంతృప్తి ఉంది. అందుకే కొత్తవారికి అవకాశమిచ్చి చూద్దాం అనుకొన్నాం. నరేష్ కంటే నాకు శివాజీరాజానే ముఖ్యమని, సన్నిహితుడు అని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే శివాజీరాజా, నాగబాబు మధ్య వివాదం అంతటితో ఆగిపోతుందా లేదా వేచి చూడాల్సిందే.

    నాగబాబు, రోజా స్థానాల్లో హోస్టులుగా వీరే

    నాగబాబు, రోజా స్థానాల్లో హోస్టులుగా వీరే

    ఇక జబర్దస్త్ విషయానికి వస్తే నాగబాబు, రోజా ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లారనేది కాదనలేని వాస్తవం. ఎపీ ఎన్నికల్లో రోజా అసెంబ్లీకి, నాగబాబు పార్లమెంట్‌కు పోటీ చేయడంతో వారి స్థానాల్లో శేఖర్ మాస్టర్, హీరోయిన్ రోజాను వారి స్థానంలోకి తీసుకొన్నారు. అయితే అది తాత్కాలికమేనని టెలివిజన్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే వారిద్దరూ మళ్లీ జబర్దస్త్‌లోకి వస్తారనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Actor Nagababu is brand ambassodar for Jabardast comedy show in Telugu. He is away from the popular Show, becasuse of AP Elections, He said, He will continue even if i select as MP. Nagababu also taken light of Shivaji Raja comments on him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X