For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లితెరపై మెగాబ్రదర్.. చాలా గ్యాప్ తరువాత మళ్లీ.. మనసు మార్చుకున్న నాగబాబు!

    |

    మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం బుల్లితెరపై కనిపించక చాలా రోజులే అవుతోంది. బొమ్మ అదిరింది షో బిచానా సర్దేశాక నాగబాబు మొత్తానికి తెరకు దూరమయ్యాడు. ఇకపై బుల్లితెరపై కనిపించడేమో, తన యూట్యూబ్ చానెల్‌పైనే దృష్టి సారించాడేమోనని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై కనిపించాడు. అది కూడా ఉగాది రోజున రాబోతోన్న స్పెషల్ ఈవెంట్‌లో నాగబాబు భాగమయ్యాడు.

    బుల్లితెరపై అలా..

    బుల్లితెరపై అలా..

    ఆరెంజ్ సినిమా తరువాత పూర్తిగా కుప్పకూలిన నాగబాబుకు బుల్లితెర ఆశ్రయమిచ్చింది. బుల్లితెరపై వచ్చిన అవకాశాలతోనే నాగబాబు నిలదొక్కుకున్నాడు. అందులో ముఖ్యంగా జబర్దస్త్ వంటి షోకు జడ్జ్‌గా నాగబాబు వచ్చాక కెరీర్ మారిపోయింది. అలా జబర్దస్త్ నుంచి అదిరింది.. అది కాస్తా బొమ్మ అదిరిందిగా మారింది.

    బొమ్మ అదిరింది ఇలా..

    బొమ్మ అదిరింది ఇలా..

    అదిరింది షోకు కాస్త మార్పులు చేర్పులు చేసి బొమ్మ అదిరిందిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందులో మొదటి రెండు మూడు ఎపిసోడ్‌లో విపరీతమైన కాంట్రవర్సీకి దారి తీశాయి. ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మీదే సెటైర్లు వేశారు. అలా చివరకు బొమ్మ అదిరింది షో కథ కంచికి చేరింది.

    సోషల్ మీడియాలో హల్చల్..

    సోషల్ మీడియాలో హల్చల్..

    బొమ్మ అదిరింది షో ముగిసిన తరువాత నాగబాబు బుల్లితెరకు దూరంగా ఉండిపోయాడు. అదే సమయంలో తన యూట్యూబ్ చానెల్‌ను బాగానే ప్రమోట్ చేసుకున్నాడు. అలా నాగబాబు తన స్టాండప్ కామెడీ షోను క్లిక్ అయ్యేలా చేసుకున్నాడు. ప్రస్తుతం ఖుషీ ఖుషీగా షో బాగానే రన్ అవుతోంది.

    ఉగాది స్పెషల్..

    ఉగాది స్పెషల్..

    ఉగాది సందర్భంగా బుల్లితెరపై పండుగ వాతావరణం నెలకొంది. ప్రముఖ చానెల్స్‌లో ఉగాది స్పెషల్ ఈవెంట్లు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో జీ తెలుగు స్పెషల్ ఈవెంట్ (ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం) ప్లాన్ చేశారు. ఇందులో నాగబాబు, నిహారిక అందరూ కూడా మళ్లీ సందడి చేసేందుకు వచ్చారు.

    గ్యాప్ తరువాత..

    గ్యాప్ తరువాత..

    నిహారిక తన పెళ్లికి ముందుగా జీ తెలుగు ఈవెంట్‌లో రచ్చ చేసింది. అప్పుడు నాగబాబు కూడా హల్చల్ చేశాడు. కానీ ఈ ఏడాది సంక్రాంతి, హోళీ వంటి పండుగలను మాత్రం సెలెబ్రేట్ చేయలేదు. ఇలా ఉగాది ఈవెంట్‌లో చాలా గ్యాప్ తరువాత నాగబాబు మళ్లీ బుల్లితెరపై కనిపించాడు. ఇకపై తన మనసు మార్చుకుని మళ్లీ బుల్లితెరపై ఏదైనా షో చేస్తాడేమో చూడాలి.

    English summary
    Nagababu In zee telugu ugadi 2021 event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X