అగ్రిమెంట్ పేరుతో పది లక్షలు వసూలు చేస్తారు.. మల్లెమాలపై నాగబాబు కామెంట్స్!!
జబర్దస్త్, మల్లెమాలతో నాగబాబుకు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. కానీ ఒకప్పుడు ఉన్నంత సన్నిహిత సంబంధాలు ఇప్పుడున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే సందు దొరికిన ప్రతీసారి మల్లెమాల, జబర్దస్త్ షోలపై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. తాజాగా నాగబాబు బొమ్మ అదిరింది షోలో చేసిన కామెంట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. చమ్మక్ చంద్ర వేసిన స్కిట్‌లో భాగంగా నాగబాబు వేసిన పంచులు పరోక్షంగా మల్లెమాల, జబర్దస్త్ షోను టార్గెట్ చేసేలా ఉన్నాయి.

చమ్మక్ చంద్ర స్కిట్..
చమ్మక్ చంద్ర ఓ కాంట్రాక్ట్ మీద ఓ ఇంట్లో పని మనిషిగా చేరుతాడు. అయితే ఆ ఇంటి యజమాని ముందుగా రాయించుకున్న కాంట్రాక్ట్ ప్రకారం.. సంవత్సరం లోపు పని మనిషి తనంతట తాను మానేస్తే పది లక్షలు ఇవ్వాలని, తాము గెంటేస్తే పని మనిషికి పది లక్షలు ఇస్తామని ఉంటుంది. ఇక ఈ కాంట్రాక్ట్‌లో ఉన్న లొసుగులను బట్టి ఆ పని మనిషిగా ఉన్న చంద్ర యజమానులను ముప్పు తిప్పలు పెడతాడు.

నీది న్యాయమైన అగ్రిమెంట్..
యజమాని చమ్మక్ చంద్ర రాసుకున్న అగ్రిమెంట్ న్యాయమైంది అని.. కొందరైతే ఒకవైపే రాసుకుంటారని నాగబాబు కౌంటర్లు వేశాడు. వారు గెంటేసినా, మనం మానేసినా మనం చేతే పది లక్షలు కట్టించుకుంటారని మల్లెమాలనుద్దేశించి అన్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ స్కిట్ జరిగినంత సేపు ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు.

పది లక్షలు కట్టి వచ్చిన వారున్నారు..
స్కిట్‌లోనే భాగంగా పని మనిషిగా ఉన్న చమ్మక్ చంద్ర పెట్టే బాధలు భరించలేక పది లక్షలు ఇచ్చి వదిలించుకుందామా? అని యజమానులు అనుకుంటారు. అలా మాట్లాడుతుండగా స్కిట్ మధ్యలో నాగబాబు కౌంటర్లు వేస్తూ.. అలా అగ్రిమెంట్‌ను వదిలేసి పది లక్షలు కట్టి బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారంటూ పగలబడి నవ్వేశాడు.
Recommended Video

అవినాష్ విషయంలో..
అవినాష్ బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్ని అడ్డంకులు దాటాడో అందరికీ తెలిసిందే. మల్లెమాల అగ్రిమెంట్ పేరుతో అవినాష్‌ను బాగానే అడ్డుకుందని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. పది లక్షలు చెల్లించి మరీ అవినాష్ ఆ అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేయించుకున్నాడని తెలుస్తోంది. తాజాగా నాగబాబు చేసిన కామెంట్లతో అది నిజమని తేలింది.


Click it and Unblock the Notifications











