జబర్దస్త్‌‌ను ఆ విషయంలో టార్గెట్.. ‘అదిరింది’పై మాత్రం మౌనం.. నాగబాబుపై నెటిజన్స్ ఫైర్

జబర్దస్త్ షో నుంచి నాగబాబు బయటకు రావడం, వస్తూ వస్తూ విడతల వారిగా షోపై విమర్శలు చేయడం అప్పట్లో సంచలనాలకు దారి తీసింది. జబర్దస్త్ షోలో అంతర్గత వ్యవహారాలు, మల్లెమాల సంస్థ, అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేయడం, కార్పోరేట్ తరహా పద్దతులను ఎండగట్టడం వంటివి తెగ హల్చల్ చేశాయి. నితిన్-భరత్‌ల కోసం బయటకు వచ్చిన నాగబాబు వారి కోసం నిలబడ్డాడు.

Recommended Video

Adirindi Comedy Show Anchor Sameera Out Of The Show
క్రియేటివ్ డిఫరెన్స్..

క్రియేటివ్ డిఫరెన్స్..

జబర్దస్త్ షోలో క్రియేటివ్ డిఫరెన్స్ వల్లనే బయటకు వచ్చానని, అక్కడంతా కార్పోరేట్ స్టైల్ ఉందని, ఆర్టిస్ట్‌లకు ఏమైనా సరే వారు పట్టించుకోరని, అవసరానికి వాడుకుంటారని తెగ విమర్శలు చేశాడు. అక్కడ ఎవరికైనా కష్టం వస్తే తాను ముందున్నానని, చేతనైన సాయం చేశానని తెలిపాడు.

చెప్పకుండా తీసేశారు..

చెప్పకుండా తీసేశారు..

జబర్దస్త్ ఆర్టిస్ట్‌లను చెప్పకుండా తీసేశారని, అయితే అలా ఎలా తీసేస్తారంటూ మల్లెమాలను ప్రశ్నించినట్టు చెప్పుకొచ్చాడు. అలా అడిగే సరికి మళ్లీ ఆ ఆర్టిస్ట్‌లను తీసుకున్నారని తెలిపాడు. జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్‌లను నడి రోడ్డున నిలబెట్టారని, అందుకే వారి కోసం బయటకు వచ్చాను.. వారికి అండగా నిలబడ్డాడని చెప్పుకొచ్చాడు.

కొత్త షోలతో జోష్..

కొత్త షోలతో జోష్..

అక్కడి నుంచి బయటకు వచ్చిన నితిన్ భరత్ లోకల్ గ్యాంగ్, అదిరింది అంటూ రెండు కొత్త షోలను ప్రారంభించారు. అవి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాయి. అయితే అదిరింది యాంకర్ సమీరాను అనూహ్యంగా తప్పించేశారు. కనీసం ఈ విషయాన్ని ఆమెకు కూడా చెప్పలేదట. ఇదే విషయంలో నాగబాబు ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

మౌనంగా ఉన్నా నాగబాబు..

మౌనంగా ఉన్నా నాగబాబు..

చెప్పకుండా ఆర్టిస్ట్‌లను తీశారంటూ జబర్దస్త్‌పై విమర్శలు చేసిన నాగబాబు.. అదిరిందిపై మౌనమెందుకు వహించాడంటూ ఫైర్ అవుతున్నారు. చెప్పకుండా ఎలా తీసేస్తారు.. ముందు అగ్రిమెంట్ రాసుకున్నా కూడా అలా మధ్యలోనే ఎలా తీస్తారు.. ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X