పోలీసులు బొక్కలో తొస్తారు.. కావాలంటే నా పేరు వాడుకో.. కమెడియన్‌కు నాగబాబు వార్నింగ్
తెలుగు టెలివిజన్ రంగంలో కామెడీ షోల వచ్చిన తర్వాత ప్రతిభావంతులైన హాస్యనటులు చాలా మంది పుట్టుకొచ్చారు. బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా అనూహ్యంగా రాణిస్తున్నారు. ఇలాంటి బుల్లితెర కార్యక్రమాల్లో సినీ నటులు నాగబాబు, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ యాక్టర్ చలాకీ చంటి నిర్వహించే షోకు రోజా, నాగబాబు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రాకెట్ రాఘవను ఎలా ఆటపట్టించారంటే..

రాకెట్ రాఘవకు నాగబాబు ప్రాంక్ కాల్
హోస్ట్‌గా వ్యవహరించే చలాకీ చంటీ, రాకెట్ రాఘవకు ప్రాంక్ కాల్ చేయమని నాగబాబును కోరాడు. దాంతో ఫోన్ కలిపి రాకెట్ రాఘవ ఫ్యామిలీ యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. తన కొడుకుకు జ్వరమని చెప్పగా టెన్షన్ పడవద్దని చెప్పాడు.

పోలీసులు కేసు తిరగదోడారని
ఫ్రాంక్ కాల్‌లో భాగంగా గతంలో పోలీసు రికార్డులో కెక్కిన రాకెట్ రాఘవకు ఆ విషయాన్ని గుర్తు చేశాడు. ఆ కేసు మళ్లీ తిరగదోడారని, కమిషనర్ నాకు ఆ విషయాన్ని చెప్పాడని రాకెట్ రాఘవకు ఝలక్ ఇచ్చాడు. దాంతో రాకెట్ రాఘవ కంగు తిన్నాడు. కేసు గురించి కమిషనర్‌ను కలువమని రాఘవకు నాగబాబు సూచించాడు.

కమిషనర్ నా ఫ్రెండే
నా ఫ్రెండ్ కమిషనర్‌ను కలువమని చెప్పగానే రాకెట్ రాఘవ కంగారుపడ్డారు. మీ పేరు చెప్పి కలుస్తాను అని ఆందోళన పడ్డాడు. కావాలంటే నా పేరు వాడుకో.. అతను మంచి వాడే. నాకు నీవు తెలియడ వల్లే ఇంకా లాకప్‌లో వేయలేదు. నా పేరు చెప్పి ఆయనను కలువు. వీలైతే బెయిల్ కాగితాలు, లాయర్‌తో కలిసి వెళ్లు అని నాగబాబు సూచించాడు.

రాఘవ నీవు అమాయకుడివేనా?
రాకెట్ రాఘవ నీవు సాధు జీవివి. అలా కేసులో ఎలా ఇరుక్కొన్నావు. నీవు పైకి కనిపించేంత అమాయకుడివి కాదేమో అనిపిస్తున్నది. అంతేనా అంటూ నాగబాబు కంగారుపెట్టారు. సార్ నేను మంచి వాడిని. నాకు జబర్దస్త్, ఇల్లు తప్ప నాకు ఎవరు తెలియదు అంటూ రాఘవ ఆందోళన పడ్డాడు.

రాఘవ కంగారు పడకు.. ఫ్రాంక్ కాల్ ఇది
మీరు టీవీ షోలో ఉన్నారు. మీరు మాట్లాడటం చూస్తే నేను నిజంగానే ఏదో చేసినారని అనుకొంటారు అని రాఘవ టెన్షన్ పడుతుండగా.. నాగబాబు అసలు విషయం చెప్పారు. చలాకీ చంటీ షోలో భాగంగా నీకు నేను ప్రాంక్ కాల్ చేశాను. నిన్ను ఆటపట్టించడానికి సరదాగా ఇలా ఆడుకొన్నాను అని నాగబాబు చెప్పగానే రాకెట్ రాఘవ రిలాక్స్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











