twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆలోచనలో పడిన నాగబాబు.. సొంతగూటికి చేరేలా ప్లాన్ రెడీ.. జబర్దస్త్ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు

    |

    Recommended Video

    Getup Srinu Comments On Naga Babu Re Entry Into Jabardasth

    బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ గత కొన్నేళ్లుగా ప్రతీ ఇంటినీ నవ్వులమయం చేసేస్తోంది. అందుకే ఈ షోకి ఎక్కడాలేని పాపులారిటీ వచ్చింది. ఈ వేదికపై రోజా, నాగబాబు చేసిన హంగామా అంతాఇంతా కాదు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ ఇద్దరూ బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్కిచ్చారు. అయితే ఇటీవలే నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి షోకి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చేసిన కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వివరాల్లోకి పోతే..

    నాగబాబు లేని లోటు.. రోజా పక్కన మరో వ్యక్తి

    నాగబాబు లేని లోటు.. రోజా పక్కన మరో వ్యక్తి

    జబర్దస్త్ వేదికపై నాగబాబు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన వెళ్లిపోయిన తర్వాత షో కళ తప్పింది. ఆయన వెళ్లి ఇన్నిరోజులైనా రోజా పక్కన సరిగ్గా సూట్ అయ్యే మరో సెలబ్రిటీ ఇంతవరకూ దొరకలేదు. చాలా మందితో ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఆ లోటు అలాగే ఉంటోంది. ఆయన లేని చోటు.. ఆ నవ్వులు జబర్దస్త్ అభిమానులు మిస్ అవుతున్నారు.

    మూడు నెలలు దాటినా ఆ ప్లేస్‌లో

    మూడు నెలలు దాటినా ఆ ప్లేస్‌లో

    నరేష్, పోసాని, తరుణ్ భాస్కర్ లాంటి జడ్జ్ లను తీసుకొచ్చినా పెద్దగా ప్రయోజనం లేదు. టీఆర్ఫీ పరంగా ఓకే అనిపిస్తున్నా మరో జడ్జ్ స్థానంలో నాగబాబు లేకపోవడం వెలితిగా కనిపిస్తోంది. నాగబాబు ఈ షోను వదిలేసి మూడు నెలలు దాటినా ఆ ప్లేస్‌లో మరొకరిని ఉహించుకోలేకపోతున్నారు జనం.

    నో యూజ్.. ఆలోచనలో పడిన నాగబాబు

    నో యూజ్.. ఆలోచనలో పడిన నాగబాబు

    మరోవైపు నాగబాబు మాత్రం 'అదిరింది' షోకు ఫిక్స్ అయిపోయాడు. జబర్దస్త్ పోటీగా దిగిన ఆ షో మాత్రం అనుకున్న మేర రేటింగ్స్ రాబట్టడం లేదు. వేణుతో పాటు ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటి టీమ్స్ వచ్చినా ఆ షో పెద్దగా ఆకర్షణీయం కాలేదు. దీంతో ఇప్పుడు అక్కడ్నుంచి బయటపడాలని నాగబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    3 మంకీస్ సినిమా ట్రైలర్ లాంచ్.. గెటప్ శ్రీను కామెంట్స్

    3 మంకీస్ సినిమా ట్రైలర్ లాంచ్.. గెటప్ శ్రీను కామెంట్స్

    ఈ నేపథ్యంలో మళ్లీ సొంత గూటికి నాగబాబు చేరతాడనే టాక్ ముదిరింది. ఇదే సమయంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. 3 మంకీస్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగబాబు గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు గెటప్ శ్రీను.

     జబర్దస్త్ షోలోకి మళ్లీ నాగబాబు.. తామంతా అనుకునేది అదే

    జబర్దస్త్ షోలోకి మళ్లీ నాగబాబు.. తామంతా అనుకునేది అదే

    నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడం అనేది పూర్తిగా ఆయన పర్సనల్ అని చెప్పిన గెటప్ శ్రీను.. ఆయన లేని లోటు కనిపిస్తుందని చెప్పాడు. అంతేకాదు అదిరింది చేసినా.. ఇంకో షో చేసినా అంతా ఓ కుటుంబంలా కలిసుంటామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాగబాబు జబర్దస్త్ షోలోకి మళ్లీ రావచ్చనే అనుమానాలు రేకెత్తిస్తూ మాట్లాడాడు గెటప్ శ్రీను. తిరిగి ఆయన జబర్దస్త్ లోకి వస్తే బాగుంటుందని, రావాలనే తామంతా కోరుకుంటున్నామని అన్నాడు.

    గెటప్ శ్రీను ఎదుకిలా కామెంట్ చేశాడు?

    గెటప్ శ్రీను ఎదుకిలా కామెంట్ చేశాడు?

    దీంతో ఇప్పుడు నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోకు వస్తాడా..? ఒకవేళ ఆయన రావాలి అనుకోకపోతే నాగబాబు రావాలని కోరుకుంటున్నట్లుగా గెటప్ శ్రీను ఎందుకు కామెంట్ చేశాడు? అనే దానిపై చర్చలు ముదిరాయి. చూడాలి మరి దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారో.

    English summary
    Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series. From this show Nagababu exit recently. Now Nagababu plan to re enter that show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X