నా స్థాయికి తగ్గ రెమ్మ్యూనరేషన్ కాదది.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

గత కొన్ని రోజులుగా జబర్దస్త్ షో విషయమై సోషల్ మీడియాలో తెగ రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి. జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకున్నారని, ఆయన తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు పుట్టించారు. ఇవన్నీ గమనించిన నాగబాబు తొలిసారి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..

జబర్దస్త్ షో.. ఆ ఇద్దరిదే హవా

జబర్దస్త్ షో.. ఆ ఇద్దరిదే హవా

బుల్లితెరపై నవ్వుల హరివిల్లు జబర్దస్త్ కామెడీ షో. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాలు పంచుతూ దూసుకుపోతున్న ఈ షోలో రోజా, నాగబాబు ఇద్దరిదే హవా. జబర్దస్త్ కమెడియన్స్ వేస్తున్న పంచ్ డైలాగ్స్ ఒకెత్తయితే.. ఈ ఇద్దరి నవ్వులు మరో ఎత్తు. అలానే ఈ షోలో జడ్జి స్థానంలో కూర్చొని కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నారు నాగబాబు, రోజా.

నాగబాబు నిష్క్రమణ.. అదే బాటలో జబర్దస్త్ టీం లీడర్స్

నాగబాబు నిష్క్రమణ.. అదే బాటలో జబర్దస్త్ టీం లీడర్స్

అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జబర్దస్త్ షో గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ షో నుంచి నాగబాబు నిష్క్రమిస్తున్నాడని, ఈయనతో పాటు కొందరు జబర్దస్త్ టీం లీడర్స్ కూడా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెబుతున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ఇన్నాళ్లు బుల్లితెర నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ అయిన జబర్దస్త్ కళ తప్పనుందనే పుకార్లు పుట్టుకొచ్చాయి.

మెగా బ్రదర్ తప్పుకోవడానికి కారణమిదే..

మెగా బ్రదర్ తప్పుకోవడానికి కారణమిదే..

ఇక మెగా బ్రదర్ నాగబాబు తప్పుకోవడానికి ప్రత్యేకంగా రెమ్మ్యూనరేషన్ ఇష్యూనే కారణమని వార్తలు వచ్చాయి. అచ్చం ఈ షో లాగే మరో టీవీ ఛానెల్ షో ప్రారంభించిందని, అందులో నాగబాబును జడ్జిగా తీసుకొని భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని చెప్పుకున్నారు. అందుకే నాగబాబు జబర్దస్త్ షో నుంచి ఇలా నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

నాగబాబు స్పందన.. షాకింగ్ కారణం

నాగబాబు స్పందన.. షాకింగ్ కారణం

ఈ నేపథ్యంలో తొలిసారి ఈ ఇష్యూపై నాగబాబు స్పందిస్తూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. జబర్దస్త్‌తో తనది ఏడున్నరేళ్ల ప్రయాణమని, 2013 ఫిబ్రవరి నుంచి తాను ఈ షోలో కొనసాగుతున్నాని చెప్పారు. తాను జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి చాలా కారణాలు పేర్కొంటూ పలు వదంతులు వస్తున్నాయి. అందుకే క్లారిటీ ఇస్తున్నా అంటూ మెగా బ్రదర్ నోరువిప్పారు.

అందుకే తప్పుకున్నా.. అంతకు మించి ఏమీలేదు

అందుకే తప్పుకున్నా.. అంతకు మించి ఏమీలేదు

బిజినెస్ పరంగా ఐడియాలజీ వల్లే తప్పుకొన్నానని, అంతకు మించి ఏమీలేదని నాగబాబు స్పష్టం చేశారు. ఇప్పటిదాకా తనకు ఎంతగానో సహకరించిన శ్యాంప్రసాద్ రెడ్డికి, ఈటీవీకి నాగబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా ప్రోగ్రాం లేదా ప్రయాణం ఎక్కడో ఓచోట ముగియాలి. అయితే, ప్రోగ్రాం కంటే ముందే జబర్దస్త్‌తో నా జర్నీ ముగుస్తోంది అని నాగబాబు చెప్పారు.

నా ఆర్థిక ఇబ్బందులు.. ఆ సమయంలో

నా ఆర్థిక ఇబ్బందులు.. ఆ సమయంలో

రెమ్యునరేషన్‌ విషయమై తాను తప్పుకున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని నాగబాబు చెప్పారు. ఇది తన స్థాయికి తగ్గ రెమ్యునరేషన్ కాకపోయినప్పటికీ..శ్యాం ప్రసాద్ రెడ్డి తనకు వంద శాతం మంచి రెమ్యునరేషన్ ఇచ్చారనిచెప్పారు. తనకు రెమ్యునరేషన్ అసలు ప్రధానమైన విషయం కాదని, తాను ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న సమయంలో తనను జబర్దస్త్ జడ్జిగా తీసుకున్నారని నాగబాబు అన్నారు. ఆ సమయంలో జబర్దస్త్ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు మెగా బ్రదర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X