జబర్దస్త్‌లో అందరి కంటే ఎక్కువ సంపాదించాడట.. చమ్మక్ చంద్ర ఆస్తి వివరాలను బయటపెట్టిన నాగబాబు
చమ్మక్ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై నవ్వులు పూయించడం, సంసారంలో ఉండే కష్టాలు, భార్యభర్తల మధ్య ఉండే గొడవలపై స్కిట్స్ చేస్తూ అందర్నీ మెప్పించాడు. జబర్దస్త్ వేదిక ద్వారా చమ్మక్ చంద్రగా ఎదిగాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ బుల్లితెర మాత్రం చమ్మక్ చంద్రకు స్టార్ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. జబర్దస్త్ నుంచి అదిరింది షోకు వెళ్లిన చమ్మక్ చంద్ర గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను నాగబాబు తాజాగా వెల్లడించాడు.

నాగబాబుతో సహా..
నాగబాబుకు చంద్ర అంటే ప్రత్యేక అభిమానం. జబర్దస్త్ నుంచి వీరిద్దరి మధ్య ఓ బంధం ఏర్పడింది. తన స్కిట్స్‌లోనూ నాగబాబును ఎక్కువ ఇన్వాల్వ్ చేసేవాడు. చంద్ర సెటైర్లను కూడా నాగబాబు బాగా ఎంజాయ్ చేసేవాడు. జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిన సమయంలో చంద్ర కూడా వెళ్లిపోయి స్వామి భక్తిని చాటుకున్నాడు.

అదిరిందిలో అలా..
ఇక తనతో పాటు అదిరింది షోకు వచ్చిన కంటెస్టెంట్లకు భారీ రెమ్యూనరేషన్ వచ్చేలా చూశాడు నాగబాబు. జబర్దస్త్ కంటే ఎక్కువగా పారితోషికం లభించడంతో అక్కడ వారికి బాగానే వర్కౌట్ అవుతోంది. అయితే అదిరిందిలో స్కిట్స్ బాగానే ఉంటున్నా.. టీఆర్పీలో మాత్రం జబర్దస్త్‌ను బీట్ చేయలేకపోతోంది.

డబ్బు ప్రాముఖ్యత..
నాగబాబు ఈ మధ్య జీవిత సత్యాలను చెబుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం వరుసగా కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ డబ్బు గొప్పదనం చెప్పుకొచ్చాడు. అన్నింటికంటే డబ్బు సంపాదించడమే గొప్ప పని అని అదో ఆర్ట్ అని పేర్కొన్నాడు. డబ్బును గౌరవించని వారెప్పుడూ ధనవంతులు కాలేరని అన్నాడు.

ప్లానింగ్ ఉండాలి..
డబ్బు సంపాదించాలంటే ప్లానింగ్ ఉండాలని, అది లేని వారెప్పుడూ రిచ్ కాలేరని పేర్కొన్నాడు. ఎంత పెద్ద వారైనా సరే ప్లానింగ్ లేకపోయితే ఫెయిల్ అవుతారని అన్నాడు. అనిల్ అంబానీ కూడా ప్లానింగ్ లేకనే అలా పడిపోయారని అన్నాడు. ఇక ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల గురించి చెప్పుకొచ్చాడు.
Recommended Video

లగ్జరీ ఇళ్లు, కారు..
జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల్లో అందరికంటే ఎక్కువగా చంద్ర సెటిల్ అయ్యాడు. ఓ ప్లానింగ్‌తో ఎదిగాడు. ఓ లగ్జరీ ఇళ్లు కట్టుకున్నాడు.. దాదాపు అది 80లక్షలు కోటి విలువ ఉంటుంది.. ఓ బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది అంటూ చంద్ర గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











