టీఆర్పీ రేటింగ్స్: జబర్ధస్త్ దరిదాపుల్లోకి రాని నాగబాబు షో.. సుమను కూడా దాటలేదు.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర చరత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షోలలో 'జబర్ధస్త్' పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఈ షో ఏడు సంవత్సరాలుగా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడమే. అంతేకాదు, ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పరిచయం అవడం కూడా బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో 'జబర్థస్త్' షో నుంచి జడ్జ్‌ల్లో ఒకరైన మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిపోయారు. అలాగే, వేరే చానెల్‌లో మరో కామెడీ షోను ప్రారంభించారు. దీంతో షో పని అయిపోతుందన్న కామెంట్లు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగులు షాక్‌కు గురి చేస్తున్నాయి.

ఆ నిర్ణయంతో అందరికీ అవకాశం వచ్చింది

ఆ నిర్ణయంతో అందరికీ అవకాశం వచ్చింది

జబర్థస్త్ ప్రారంభమైన సమయంలో వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయ్యేది. అయితే, ఈ కామెడీ షో విజయవంతం అవడంతో చాలా రోజుల తర్వాత దీన్ని రెండు రోజులకు పెంచారు. అదే సమయంలో ఇద్దరు యాంకర్లను పెట్టారు. అలాగే, చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు. ఉన్న వారిలో సీనియర్లను టీమ్ లీడర్లను చేశారు.

వాళ్లతో పాటు ఆ నలుగురికి కలిసొచ్చింది

వాళ్లతో పాటు ఆ నలుగురికి కలిసొచ్చింది

ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం వాళ్లంతా స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అలాగే, యాంకర్లు రష్మీ.. అనసూయకు కూడా ఈ షో ఉపయోగపడింది. వీరితో పాటు నాగబాబు, రోజాకు కూడా ఈ షో బాగా ప్లస్ అయింది. రోజా ఏకంగా తాను ఎమ్మెల్యే కావడం వెనుక ఈ షో కూడా కారణమే అని అప్పట్లో చెప్పడం విశేషం.

జబర్ధస్త్‌లో కలకలం.. షోపై అనుమానాలు

జబర్ధస్త్‌లో కలకలం.. షోపై అనుమానాలు

విజయవంతంగా సాగుతున్న జబర్ధస్త్‌లో మెగా బ్రదర్ నాగబాబు కలకలం రేపారు. ఆయన తన వ్యక్తిగత కారణాలతో షో నుంచి దూరం అయిపోయారు. అప్పుడు ఈ షో మనుగడపై అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇకపై జబర్ధస్త్ ఉండదని కొందరు అంటే.. లేదు రెండు రోజులది కాస్తా ఒకరోజుకు కుదిస్తారని కూడా అన్నారు.

ఇప్పటికీ ఎవరినీ ఫైనల్ చేయలేదు

ఇప్పటికీ ఎవరినీ ఫైనల్ చేయలేదు

నాగబాబు ఈ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారనే దానిపై జోరుగా చర్చలు సాగాయి. కానీ, చాలా రోజులుగా రోజా ఒక్కరే దీనిని లీడ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో కొందరు సినీ ప్రముఖులను గెస్టులుగా తీసుకు వచ్చారు. ఇప్పటికీ ఈ షోలో రోజాతో పాటు జడ్జ్‌మెంట్ ఇచ్చే వారిని ఫైనల్ చేయలేదు.

ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ మొదలెట్టాడు

ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ మొదలెట్టాడు

మెగా బ్రదర్ నాగబాబు జబర్ధస్త్‌ను వీడిన తర్వాత మరో ప్రముఖ చానెల్‌లో కొత్త షోను ప్రారంభించారు. ‘అదిరింది' అనే టైటిల్‌లో మొదలైన ఈ షో ప్రతి ఆదివారం ప్రసారం అవుతోంది. ఇప్పటికే రెండు, మూడు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. ఇందులో జబర్ధస్త్ వాళ్లు చమ్మక్ చంద్ర, ఆర్పీ సహా సీనియర్లు వేణు, ధన్‌రాజ్‌లు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.

Recommended Video

Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu
జబర్ధస్త్ దరిదాపుల్లోకి రాని నాగబాబు షో

జబర్ధస్త్ దరిదాపుల్లోకి రాని నాగబాబు షో

‘అదిరింది' షో వల్ల జబర్ధస్త్‌కు ప్రమాదం ఉంటుందని కామెంట్లు వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగ్స్ షాక్‌కు గురి చేస్తున్నాయి. దీని ప్రకారం.. జబర్ధస్త్ 6.49 రేటింగ్ సాధించగా, ఎక్స్‌ట్రా 5.74 రాబట్టింది. ఇక, అదిరింది షో దారుణంగా 2.26 రేటింగును మాత్రమే దక్కించుకుంది. ఈ షో కంటే సుమ ప్రోగ్రాం ‘క్యాష్' (3.39) ముందుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X