'జాతి మొగుళ్ళు' యూట్యూబ్‌ దుమ్ము దులిపేశారు... బ‌స్తీ బాయ్స్ రచ్చ పీక్స్ !

జబర్దస్త్ కమెడియన్లలో కొంత మందిని తీసుకుని కొన్నాళ్ల పాటు 'అదిరింది' అనిపించిన నాగబాబు. ఆ షో అంతగా ఆకట్టుకోలేక పోవడంతో కొన్నాళ్లకే జెండా ఎత్తేశారు. ఇప్పుడు అదిరింది కమెడియన్లు సద్దాం, భాస్కర్‌, హరి, యాదమ్మ రాజులతో బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్‌ని మొదలుపెట్టారు స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ అంటూ స్కిట్స్ చేసిన కుర్రాళ్ల‌తో నాగ‌బాబు ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తున్నారు. బ‌స్తీ బాయ్స్ అనేది టైటిల్. దీనికి ఆయ‌నే కాన్సెప్ట్ అందించి ఇన్ఫినిటం అనే డిజిటల్ మీడియా సంస్థతో క‌లిసి నిర్మిస్తున్నారు.

మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్

 మా కుర్రాళ్ళు చేసి చూపించారు

మా కుర్రాళ్ళు చేసి చూపించారు

తాజాగా ఈ బస్తీ బాయ్స్ ఫస్ట్ ఎపిసోడ్‌ను నాగబాబు ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. దీంతో నాగబాబు తన ఫేస్‌ బుక్ పేజ్లో.. 'వచ్చింది జాతి రత్నాలు కాదు.. జాతి మొగుళ్లు' అంటూ పోస్ట్ పెట్టి మరీ యూట్యూబ్ లింక్‌ షేర్ చేశారు. ఆయన అనుకున్నట్లుగానే ఈ సిరీస్ యూట్యూబ్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. అంతే కాదు నిన్న రాత్రి మా కుర్రాళ్ళు చేసి చూపించారని చెబుతూ కేక్ కట్ చేస్తున్న ఫోటోలు సైతం నాగబాబు షేర్ చేశారు.

హీరోగా సద్దాం బాబు

హీరోగా సద్దాం బాబు

పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చి హీరో అవ్వాలనే పాత్రల్లో సద్దాం, భాస్కర్ లు నటించారు. సద్దాం తనకు తానే సద్దాం బాబు అని పేరు పెట్టుకుని హైదరాబాద్ లో దిగుతాడు. దిగే సమయంలో ఇండస్ట్రీలో ఓ రేంజ్ వచ్చిన తర్వాత బాబు బాబు అని పెట్టుకుంటారు.. నేనే ముందు బాబు అని పెట్టేసుకున్నా. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం లేదని అనుకుంటున్నారు కదా.. ఇక నుంచి యూట్యూబ్‌లో వరుస అప్ లోడ్‌లే. యూట్యూబ్‌లో ఒక్కొక్క ట్యూబ్‌లు పగిలిపోతాయ్. వారం అంతా యూట్యూబ్‌లో ట్యూబ్‌లు పగలగొట్టేస్తాం అంటూ సద్దాం కూడా నాగ బాబు రేంజ్ బిల్డప్ ఇచ్చాడు.

రొటీన్ కంటెంట్

రొటీన్ కంటెంట్

ఇక ఈ సిరీస్ కి కాన్సెప్ట్ బుల్లెట్ భాస్కర్, నాగబాబు కలిసి తయారు చేసుకున్నారని చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ ని 27 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ వచ్చి సినిమాల్లో హీరో అవుదామని వచ్చిన భాస్కర్ కంపెనీ ఆర్టిస్ట్ గా ఏదో చేస్తూ ఉంటాడు. కానీ ఊర్లో మాత్రం పెద్ద హీరో అని బిల్డప్ ఇస్తాడు. సాధారణంగా ఈ కాన్సెప్ట్ చాలా సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ లో మనం చూసే ఉంటాం.

బిల్డప్ ఇచ్చినంత లేదు కానీ

బిల్డప్ ఇచ్చినంత లేదు కానీ

భాస్కర్ ని నమ్మి సద్దాం పల్లెటూరు నుంచి ట్రంకు పెట్టి, పూతరేకులు, జంతికలు పట్టుకుని ఒకప్పటి హీరోలలా పచ్చ రంగు డ్రెస్ వేసుకుని మరీ హైదరాబాద్ వచ్చేస్తాడు సద్దాం. కానీ ఇక్కడికి వచ్చాక అసలు సినిమా బయటపడింది. బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ కామెడీగా ఉన్నా నాగబాబు, సద్దాంలు బిల్డప్ ఇచ్చినట్టు అంత పగలగొట్టే విషయం ఏమీ లేదు. అయినా నెంబర్ 1 ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది.

Recommended Video

So Many Boys Can Relate To Ek Mini Katha | Funny Interview
 షోలకు దూరం అయి

షోలకు దూరం అయి

మొత్తం మీద షోలకు దూరం అయిన నాగరాజు ఒక పక్క స్టాండప్ కామెడీ షోలు నిర్వహిస్తూ, మరో పక్క ఇలా సిరీస్ లు నిర్మిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇలా రొటీన్ కంటెంట్ కాకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే బాగుంటుందేమో అని అంటున్న వారూ లేక పోలేదు. మరి చూడాలి ఈ షో ఎంత దాకా పాపులర్ అవుతుందో ?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X