కొత్త షోలో బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్లు: నిహారిక ముందే నాగబాబు అలా చేయడంతో!
తెలుగు బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటున్నాయి. అందులో జబర్ధస్త్ షో పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు ఎనిమిదేళ్లుగా టెలివిజన్ రంగంలో ప్రభావాన్ని చూపిస్తున్న ఈ షో.. అప్పటికీ ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. ఈ షో ద్వారా జడ్జ్‌గా పరిచయం అయిన మెగా బ్రదర్ నాగబాబు సరికొత్త షోకు శ్రీకారం చుట్టారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో సంచలనం అవుతోంది. ఇందులో శ్రీముఖి, నిహారిక ముందే నాగబాబు ప్రవర్తించిన తీరు షాకిస్తోంది. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్ నుంచి అదిరిందిలోకి జంప్
చాలా కాలం పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ క్రమంలోనే నవ్వుల రారాజు అన్న పేరును కూడా సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆ షోకు గుడ్‌బై చెప్పిన ఆయన.. మరో ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న అదిరింది అనే షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో జబర్ధస్త్‌కు పోటీగా ఎన్నో ప్రయోగాలు చేయిస్తున్నారాయన.

కొత్త టాలెంట్‌ను తీసుకొచ్చేందుకు
జబర్ధస్త్ షోలో ఉన్న సమయంలోనే ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగబాబు. అదిరిందిలోనూ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కాకుండా స్వతహాగా కొందరిలోని టాలెంట్‌ను గుర్తించి వాళ్లను వెలుగులోకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే సొంతంగా కొన్ని షోలను ప్రారంభించబోతున్నట్లు యూట్యూబ్ చానెల్ ద్వారా వెల్లడించారు.
Recommended Video

తెలుగులో తొలి స్టాండప్ కామెడీ షో
కామెడీని పంచగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లకు అవకాశం కల్పించడం కోసం నాగబాబు ‘ఖుషీ ఖుషీగా' అనే స్టాండప్ కామెడీ షోను మొదలు పెట్టారు. తన సొంత యూట్యూబ్ చానెల్ ‘నా చానెల్.. నా ఇష్టం'లో ప్రసారం ఈ షో ప్రసారం కాబోతుంది. ఆసక్తి ఉన్న వారిని ఐదు నిమిషాల పాటు కామెడీ చేసిన వీడియోలు పంపాలని గతంలో నాగబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ముప్పై మందిలో ముగ్గురు విజేతలు
తొలి తెలుగు స్టాండప్ కామెడీ షోగా చెప్పే ‘ఖుషీ ఖుషీగా'గా కోసం ముప్పై మందిని సెలెక్ట్ చేస్తారు నాగబాబు. వీళ్లంతా జడ్జ్‌ల ముందు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. వారిలో 10 మందిని సెలెక్ట్ చేసి.. మెగా ఫైనల్ నిర్వహిస్తారు. తుది పది మంది నుంచి ముగ్గురిని విజేతలుగా ప్రకటించి.. వాళ్లకు ఫ్రైజ్ మనీతో పాటు వెబ్ సిరీస్‌లలో అవకాశాలు కల్పించబోతున్నారు మెగా బ్రదర్.

బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్లు
‘ఖుషీ ఖుషీగా'లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తయింది. ఈ నేపథ్యంలో వాళ్లు నాగబాబు ముందు పెర్ఫార్మ్ చేసిన వీడియోను ఆయన వదిలారాయన. ప్రోమోగా పేర్కొన్న ఇందులో కంటెస్టెంట్లంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులతో రెచ్చిపోయారు. చివర్లో వీటిని బూతులు అనుకుంటే బూతుల్లా.. సరదాగా ఆలోచిస్తే కామెడీ డైలాగుల్లా అనిపిస్తాయని పేర్కొన్నాడు భాస్కర్.

నిహారిక, శ్రీముఖి ముందే అలా చేసి
ఇక, ఈ వీడియోలో కమెడియన్లు ధన్‌రాజ్, వేణు, సద్దాం, బుల్లెట్ భాస్కర్ సహా పలువురు కనిపించారు. అలాగే, యాంకర్ శ్రీముఖి, నాగబాబు కూతురు నిహారిక కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ పక్కనే ఉన్నా నాగబాబు కూడా డబుల్ మీనింగ్ డైలాగులను ఉచ్చరించడంతో పాటు పగలబడి నవ్వారు. అలాగే, నిహారిక కూడా తన కాలేజ్‌లో జరిగిన ఓ అనుభవాన్ని పంచుకుంది.


Click it and Unblock the Notifications











