రోజా, శేఖర్ మాస్టార్‌కు బిస్కెట్లు వేయి.. నాకు కాదు.. జబర్దస్త్ అవినాష్‌కు నాగబాబు ఝలక్
కరోనావైరస్‌తో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో మెగా బ్రదర్ సామాజిక బాధ్యతను పోషిస్తున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా మెగా ఫ్యామిలీతోపాటు సినీ ప్రముఖులంతా వంతుగా జాగ్రత్తలు చెబుతూ.. తమకు తోచిన విధంగా సహయం అందిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ కాలంలో మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ ఛాట్ చేస్తూ అందర్నీ పలకరిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ అవినాష్‌తో మాట్లాడుతూ నాగబాబు తనదైన శైలిలో పంచులు విసిరారు. వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇదే..

సరదాగా అవినాష్.. పంచ్ విసిరిన నాగబాబు
సోషల్ మీడియాలో నాగబాబుతో లైవ్‌లోకి వచ్చిన అవినాష్ సరదాగా మాట్లాడుతూ.. నేను వరుణ్ తేజ్‌తో మాట్లాడుతున్నానా? లేక నాగబాబుతో మాట్లాడుతున్నానా అర్ధం కావడం లేదని అంటే.. నాగబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అరేయ్.. నేను జబర్దస్త్‌లో చేయడం లేదు. నాకు బిస్కట్లు వేయకు.. నీకు ఉపయోగపడదు. వెళ్లి శేఖర్ మాస్టర్‌కో.. రోజాకో వేసుకో.. ఏమైనా ఉపయోగపడుతుందో అని నాగబాబు పేర్కొన్నారు.

రెమ్యునరేషన్ కారణంగా కాదు..
జబర్దస్త్‌లో లేకపోవడం, అలాగే లాక్‌డౌన్‌లో ఉండటం కారణంగా కలువడానికి వీలు కావడం లేదు. నేను జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చానో ఆ కారణం మీకు తెలుసు. కొన్ని ఐడియాలజీ విభేదాల కారణంగా తప్పుకొన్నాను. కానీ కొందరు రెమ్యునరేషన్ కారణం అంటూ బయటకు చెప్పున్నా అది కారణం కాదు. ఎందుకంటే రెండేళ్ల క్రితమే మల్లెమాల రెమ్యునరేషన్ పెంచారు. అది కారణం కాదు అని నాగబాబు స్పష్టం చేశారు.

శత్రుత్వం పెంచుకోవద్దు
మనుషులం దూరమైనంత మాత్రాన, వ్యక్తిగత విభేదాల కారణంగా శత్రత్వం పెంచుకోవద్దు. నాకు ఆ అలవాటు లేదు. కోపం వస్తే కొన్ని రోజులు మాట్లాడుకోకపోవచ్చు. కానీ నా మనసులో వ్యక్తిగత కక్షలు, పగలు ప్రతీకారం ఉండవు. జబర్దస్త్‌లో మీరు ఉన్నారు.. అదిరింది కోసం నాతో చంద్ర, ఇతరులు వచ్చారు. ఎవరి అవకాశాలు వారివి అని నాగబాబు అన్నారు.

అదిరింది షోపై కామెంట్లతో బాధపడ్డా
జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చాక నేను చేస్తున్న అదిరింది షోపై కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారు. అది నాకు బాధ కలిగించింది. ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటివి మాములే. కానీ నైతిక విలువలను మరిచిపోవద్దు. కామెడీ రియాలిటీ షోలో అదిరింది 2 చేయడానికి కూడా స్కోప్ ఉంది. మా టీమ్‌లో ధన్ రాజ్, సద్దాం లాంటి టాలెంటెడ్ కమెడియన్లు ఉన్నారు. మీ వైపు కూడా మంచి కమెడియన్లు ఉన్నారు. ఎవరి షో వారిదే అని నాగబాబు పేర్కొన్నారు.
Recommended Video

లాక్‌డౌన్ సమయంలో
లాక్‌డౌన్ కారణంగా విలువైన సమయం దక్కింది. మంచి పుస్తకాలు చదువుకోవడానికి వీలు కలుగుతున్నది. కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఫిట్‌నెస్ మీద ఫోకస్ పెట్టకునే అవకాశం లభించింది. యోగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ తప్ప జనం మిగితావన్నీ నేర్చుకొంటారు. మందు ఎక్కడ దొరుకుందాని వెతుకుతుంటారు. చాలా మంది మందులేక పిచ్చోళ్లు అవుతున్నారు. వాటిపై కాకుండా మంచి విషయాలపై దృష్టిపెట్టాలి అని నాగబాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











