సుడిగాలి సుధీర్‌కు భారీ షాకిచ్చిన నాగబాబు: పేరు చెప్పగానే ఊహించని విధంగా.. పరువు తీసిన మెగా బ్రదర్
నాగబాబు.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పరిచయం అవసరం లేదు. దీనికి కారణం ఆయన మెగాస్టార్ చిరంజీవిగా అందిరికీ సుపరిచితుడు అవ్వడమే. అంతేకాదు, సుదీర్ఘ కాలంగా ఆయన నటుడిగా, నిర్మాతగా చిత్ర సీమలో వెలుగొందుతున్నారు. కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాల్లో నటించిన ఆయన.. ఆ తర్వాత బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చారు. ఇక, జబర్ధస్త్ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. తద్వారా అందులోని కమెడియన్లతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్‌కు భారీ షాకిచ్చారు నాగబాబు. ఆ వివరాలు మీకోసం!

యాక్టర్‌గా సక్సెస్... నిర్మాతగా ఫెయిల్యూర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రాక్షసుడు'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా పని చేశారు. ఇప్పటికీ దీన్ని కొనసాగిస్తున్నారు. తద్వారా ఉత్తమ నటుడిగా పలుమార్లు ఎంపికయ్యారు. అయితే, నిర్మాతగా మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. ఆయన తీసిన చిత్రాల్లో చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యాయి.

సీరియల్ హీరోగా ఎంట్రీ.. జడ్జ్‌గా మారి అలా
'అపరంజీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి హీరోగా అడుగు పెట్టారు నాగబాబు. దీని తర్వాత 'శిఖరం', 'సీతామహాలక్ష్మీ' సహా కొన్ని సీరియళ్లలో నటించారు. వీటికి మంచి ఆదరణ కూడా లభించింది. దీంతో ఆయనకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'వీర' అనే షో ద్వారా జడ్జ్‌గా ప్రయాణాన్ని మొదలెట్టారు. ఆ తర్వాత 'అదుర్స్' రెండు సీజన్లను చేశారు.

సుదీర్ఘ ప్రయాణం.. అర్థాంతరంగా ముగిసింది
జడ్జ్‌గా మారిన తర్వాత ఈటీవీలో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్'లోకి మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. అందులో దాదాపు ఏడేళ్ల పాటు పని చేశారు. ఈ క్రమంలోనే తనకు మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు షోను కూడా ఉన్నత స్థితిలో నిలిపేలా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దాని నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. దీంతో జబర్ధస్త్ ప్రస్థానం ముగిసిపోయింది.

అందులోకి ప్రవేశం... అది కూడా ఆగడంతో
జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత నాగబాబు.. జీ తెలుగులో 'అదిరింది' అనే కామెడీ షోను ప్రారంభించారు. ఆ సమయంలోనే ఇద్దరు దర్శకులు నితిన్, భరత్‌తో పాటు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీలాంటి వాళ్లు ఆయన వెంట వెళ్లిపోయారు. ఇది కూడా 'అదిరింది', 'బొమ్మ అదిరింది' అని రెండు సీజన్లు జరిగింది. అప్పుడే క్లిక్ అవుతోన్న సమయంలో ఊహించని విధంగా ఆగిపోయింది.

అక్కడ యమ యాక్టివ్.. ఈ మధ్య ఎక్కువ
నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తనదైన కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ఫ్యాన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.

సుధీర్‌కు భారీ షాకిచ్చి... పరువు తీసేసేలా
తాజాగా నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించి.. నెటిజన్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'సార్.. సుధీర్ అన్నతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది' అని అడిగాడు. దీనికి 'శతకోటి సుధీరుల్లో ఏ సుధీర్ గురించి నువ్వు అడిగేది' అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. దీంతో ఆయన కావాలనే సుధీర్ పరువు తీశారన్న టాక్ వినిపిస్తోంది.

అతడికి మాత్రం ఫోటోతో చెప్పిన నాగబాబు
ఇదే సెషన్‌లో మరో నెటిజన్.. 'మీకు ఆటో రాంప్రసాద్ అంటే ఇష్టమా? గెటప్ శ్రీను అంటే ఇష్టమా' అని ప్రశ్నించగా.. దానికి గెటప్ శ్రీను ఫొటోను పోస్ట్ చేశారు. తద్వారా తనకు జబర్ధస్త్‌లో ఇష్టమైన కమెడియన్ ఎవరో ఇలా వివరించారు. ఇవి మాత్రమే కాదు.. తన పర్సనల్.. ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై నాగబాబు తనదైన శైలి ఆన్సర్లు చెప్పి ఆకట్టుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











