నాగబాబు‌కు నెటిజన్ సూటి ప్రశ్న: నేను అవి చూస్తే సమాజం ఒప్పుకుంటుందా.. ఆమెను లాగుతూ ఊహించని రిప్లై!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీ రంగానికి పరిచయమై.. సుదీర్ఘ కాలంగా తన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ప్రస్తుతం పరిశ్రమలో పెద్దగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తున్నారు. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ నాగబాబును ఊహించని ప్రశ్న అడిగాడు. దీనికి ఆయన అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. మొన్నటి వరకూ

అలా పరిచయం.. మొన్నటి వరకూ

మెగాస్టార్ చిరంజీవి 'రాక్షసుడు' సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను చేశారు. అలాగే, హీరోగానూ కనిపించారు. ఈ క్రమంలోనే నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' వరకు ఆయన సినీ ప్రయాణాన్ని సక్సెస్‌గా సాగిస్తున్నారు.

బుల్లితెరపైకి అడుగు... ఫుల్ ఫేమస్

బుల్లితెరపైకి అడుగు... ఫుల్ ఫేమస్

ఎన్నో ఏళ్ల పాటు సినీ రంగంలో సినీ రంగంలో సత్తా చాటిన నాగబాబు.. 'అపరంజీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత 'శిఖరం', 'సీతామహాలక్ష్మీ' సహా కొన్ని సీరియళ్లలో నటించారు. ఈ క్రమంలోనే 'వీర' అనే షో ద్వారా జడ్జ్‌గా మారి 'అదుర్స్' రెండు సీజన్లను పూర్తి చేశారు. దీని తర్వాత 'జబర్ధస్త్' షోలో చేరారు.

దానికి బ్రేకిచ్చిన బాబు.. ఏమీ లేవుగా

దానికి బ్రేకిచ్చిన బాబు.. ఏమీ లేవుగా

సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించారు నాగబాబు. అప్పటి నుంచి దీన్ని నెంబర్ వన్ స్థానంలో నడిపించారు. ఇలాంటి సమయంలో దానికి అర్థాంతరంగా గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో 'అదిరింది', 'బొమ్మ అదిరింది' అనే షోలు చేశారు. ఇవి కూడా ఉన్నట్లుండి ఆపేశారు. ఇక, స్వయంగా 'ఖుషి ఖుషీగా' అనే షో ఫస్ట్ సీజన్ పూర్తి చేశారు.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా


మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో భాగంగానే తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను కూడా ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అదే సమయంలో సమాజంలో ఎన్నో విషయాలపై స్పందిస్తుంటారు. అలాగే, విమర్శలకు కూడా దీని ద్వారానే జవాబులు ఇస్తూ తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు.

నాగబాబుకు ఓ నెటిజన్ సూటి ప్రశ్న

నాగబాబుకు ఓ నెటిజన్ సూటి ప్రశ్న

సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేస్తూ ఉండే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. ఇందులో భాగంగానే ఓ ఔత్సాహికుడైన నెటిజన్.. 'మీకు బిగ్ బాస్ షో అంటే ఇష్టమా? ఐపీఎల్ అంటే ఇష్టమా' అని ప్రశ్నించాడు.

చూస్తే సమాజం ఒప్పుకుంటుందా

చూస్తే సమాజం ఒప్పుకుంటుందా

నెటిజన్ అడిగిన ప్రశ్నకు మెగా బ్రదర్ నాగబాబు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. 'బిగ్ బాస్ షో చూడకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చూస్తూ... నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్‌కు సపోర్ట్ చేస్తే.. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. తద్వారా తాను బిగ్ బాస్ షోను క్రమం తప్పకుండా చూస్తాను అంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

ఆ వీడియోతో బయట పెట్టేశారుగా

ఆ వీడియోతో బయట పెట్టేశారుగా

ఇప్పటికే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో తాను ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నట్లు నాగబాబు వెల్లడించారు. 'ఈ సీజన్‌లో యాంకర్ రవి, షణ్ముఖ్, శ్రీరాం, ఆనీ మాస్టర్, నటి ప్రియ, నటరాజ్ మాస్టర్ ఇలా చాలా మంది తెలిసిన వాళ్లే ఉన్నారు. కానీ, ప్రియాంక గెలిస్తే చూడాలని ఉంది. తను గెలిచినా గెలవకపోయినా నేను మాత్రం సపోర్ట్ చేస్తున్నా' అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారాయన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X